Commonwealth Games 2022: రెజ్లింగ్‌లో ఒకే రోజు ఆరు మెడల్స్ - బజరంగ్, దీపక్, సాక్షిలకు గోల్డ్ మెడల్స్
06 August 2022, 6:15 IST
కామన్వెల్త్ గేమ్స్ లో ఎనిమిదో రోజు రెజ్లర్లు సత్తాచాటారు. బజరంగ్ పునియా, దీపక్ పునియా, సాక్షి మాలిక్ స్వరాలు గెలిచి చరిత్రను సృష్టించారు. శుక్రవారం రెజ్లింగ్ లో ఇండియా మూడు గోల్డ్, ఒక సిల్వర్, రెండు బ్రాంజ్ మెడల్స్ వచ్చాయి.
సాక్షి మాలిక్
భారత రెజర్లు అదరగొట్టారు. కామన్వెల్త్ గేమ్స్ లో శుక్రవారం ఒకే రోజు ఆరు పతకాల్ని సొంతం చేసుకొని క్రీడాభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేశారు. బజరంగ్ పునియా, దీపక్ పునియాతో పాటు సాక్షిమాలిక్ స్వర్ణాలు గెలవగా అన్షు మాలిక్ సిల్వర్, దివ్య, మోహిత్ బ్రాంజ్ మెడల్స్ గెలిచారు.
65 కేజీల విభాగంలో అద్భుతమైన ఆటతీరుతో ఫైనల్ చేరిన బజరంగ్ పునియా తుదిపోరులోకెనడా ఆటగాడు మెక్ నీల్ పై పూర్తిగా ఆధిపత్యం చెలాయించారు. 9 2 తో తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేసి గోల్డ్ మెడల్ దక్కించుకున్నాడు.
86 కేజీల విభాగంలో పాకిస్థాన్ ప్లేయర్ మహ్మద్ ఇనామ్ ను ఓడించి దీపక్ పునియా గోల్డ్ మెడల్ సొంతం చేసుకున్నారు. ఉమెన్స్ 62 కేజీల విభాగంలో కెనడా క్రీడాకారిణి అన గోంజలెజ్ ను ఓడించి సాక్షి మాలిక్ స్వర్ణాన్ని దక్కించుకున్నది. కామన్వెల్త్ క్రీడల్లో సాక్షికి ఇదే తొలి పతకం కావడం గమనార్హం.
57 కేజీల విభాగంలో అన్షు మాలిక్ తుది మెట్టులో తడబడింది. నైజీరియా రెజ్లర్ ఒడునాయో చేతిలో 7 3 తేడాతో ఓటమి పాలై సిల్వర్ మెడల్ తో సరిపెట్టుకున్నది. 125 కేజీల విభాగంలో మోహిత్, 68 కేజీల విభాగంలో దివ్య బ్రాంజ్ మెడల్స్ గెలిచి సత్తా చాటారు.
టాపిక్