తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Babar Azam: విరాట్‌ కోహ్లి మరో వరల్డ్‌ రికార్డును బ్రేక్‌ చేసిన బాబర్‌ ఆజం

Babar Azam: విరాట్‌ కోహ్లి మరో వరల్డ్‌ రికార్డును బ్రేక్‌ చేసిన బాబర్‌ ఆజం

Hari Prasad S HT Telugu

29 June 2022, 14:59 IST

google News
    • Babar Azam: పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం దూకుడు కొనసాగుతోంది. రన్‌ మెషీన్‌లాగా మారిన అతడు.. తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి చెందిన మరో వరల్డ్‌ రికార్డును బ్రేక్‌ చేశాడు.
పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం
పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం (AFP)

పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం

దుబాయ్‌: రికార్డులు ఉన్నవి బ్రేక్‌ చేయడానికే అంటారు. అందులోనూ క్రికెట్‌లో సాధ్యం కాని రికార్డులంటూ ఏవీ లేవు. అంతటి సచిన్‌ టెండూల్కర్‌ రికార్డులకు కూడా ఎప్పటికప్పుడు ముప్పు పొంచి ఉంటూనే ఉంది. ముఖ్యంగా ఇప్పటి క్రికెట్‌ పూర్తిగా బ్యాటర్లకు అనుకూలంగా మారడంతో బ్యాటింగ్‌లో ఎలాంటి రికార్డయినా తెరమరుగవుతోంది.

సచిన్‌ రికార్డులను విరాట్‌ కోహ్లి బద్ధలు కొట్టడానికి ట్రై చేస్తుంటే.. కోహ్లి రికార్డులపై కన్నేశాడు బాబర్‌ ఆజం. ఆ మధ్య వన్డేల్లో కెప్టెన్‌గా అత్యంత వేగంగా వెయ్యి రన్స్‌ చేసిన రికార్డును అందుకున్న బాబర్‌ ఆజం.. తాజాగా టీ20 ర్యాంకింగ్స్‌లో విరాట్‌ రికార్డును బ్రేక్‌ చేశాడు. బుధవారం (జూన్‌ 29) ఐసీసీ రిలీజ్‌ చేసిన లేటెస్ట్‌ టీ20 ర్యాంకింగ్స్‌లోనూ బాబర్‌ ఆజం టాప్‌లో ఉన్నాడు.

దీంతో ఐసీసీ టీ20 ఇంటర్నేషనల్‌ ర్యాంకింగ్స్‌లో అత్యధిక కాలం టాప్‌లో ఉన్న రికార్డును బాబర్‌ అందుకున్నాడు. ఇన్నాళ్లూ 1013 రోజులతో ఈ రికార్డు కోహ్లి పేరిట ఉండేది. ఇప్పుడు బాబర్‌ ఆజం 1030 రోజులుగా టాప్‌ ర్యాంక్‌లో ఉంటూ విరాట్‌ రికార్డును బ్రేక్‌ చేశాడు. వైట్‌ బాల్‌ క్రికెట్‌లో తన డామినెన్స్‌ను కొనసాగిస్తున్న బాబర్‌.. టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లోనూ టాప్‌లోకి దూసుకెళ్లడమే టార్గెట్‌గా పెట్టుకున్నాడు.

టాపిక్

తదుపరి వ్యాసం