తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ahmedabad Test: అహ్మదాబాద్‌లో ఆడితే డబ్ల్యూటీసీ ఫైనల్ చేరినట్లే.. సెంటిమెంట్ కలిసొస్తుందా?

Ahmedabad Test: అహ్మదాబాద్‌లో ఆడితే డబ్ల్యూటీసీ ఫైనల్ చేరినట్లే.. సెంటిమెంట్ కలిసొస్తుందా?

Hari Prasad S HT Telugu

07 March 2023, 14:18 IST

    • Ahmedabad Test: అహ్మదాబాద్‌లో ఆడితే డబ్ల్యూటీసీ ఫైనల్ చేరినట్లేనా? ఇండియాకు సెంటిమెంట్ కలిసొస్తుందా? ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టుకు ముందు భారత అభిమానులను ఈ సెంటిమెంట్ ఊరిస్తోంది.
చివరి టెస్టులో గెలిస్తేనే ఇండియా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరుతుంది
చివరి టెస్టులో గెలిస్తేనే ఇండియా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరుతుంది (ANI)

చివరి టెస్టులో గెలిస్తేనే ఇండియా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరుతుంది

Ahmedabad Test: క్రికెట్ లో కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి. అవి వర్కవుటైతే బాగుంటుందని అటు ప్లేయర్స్, ఇటు ఫ్యాన్స్ కోరుకుంటారు. ఇప్పుడు ఆస్ట్రేలియాతో నాలుగో టెస్ట్ కు ముందు కూడా అలాంటి సెంటిమెంటే ఇండియన్ టీమ్ ను ఊరిస్తోంది. ఇప్పుడు టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ చేరాలంటే ఆస్ట్రేలియాతో జరగబోయే నాలుగో టెస్ట్ తప్పక గెలవాల్సిన పరిస్థితి.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

ఈ నేపథ్యంలో అహ్మదాబాద్ లో వర్చువల్ సెమీఫైనల్ కు ఇండియన్ టీమ్ సిద్ధమవుతోంది. అయితే రెండేళ్ల కిందట తొలి డబ్ల్యూటీసీ సైకిల్ ఫైనల్ కు ముందు కూడా ఇండియా సరిగ్గా ఇలాంటి సిచువేషన్ లోనే అహ్మదాబాద్ లో వర్చువల్ సెమీస్ ఆడింది. ఆ మ్యాచ్ గెలవడం లేదంటే కనీసం డ్రా చేసుకుంటేనే ఫైనల్ చేరే అవకాశం ఉండేది.

ఇలాంటి సమయంలో ఇంగ్లండ్ తో జరిగిన ఆ మ్యాచ్ లో ఇండియా ఇన్నింగ్స్ 25 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్ కు అర్హత సాధించింది. ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియం అయిన నరేంద్ర మోదీ స్టేడియంలో విరాట్ కోహ్లి కెప్టెన్సీలోని ఇండియన్ టీమ్ ఘనంగా గెలిచింది. ఆ మ్యాచ్ సరిగ్గా మార్చి 6, 2021న ప్రారంభమైంది. అంతేకాదు కేవలం రెండున్నర రోజుల్లోనే ఆ మ్యాచ్ ముగిసింది.

అయితే ఆ తొలి ఫైనల్లో న్యూజిలాండ్ చేతుల్లో ఇండియా ఓడిపోయింది. ఇక ఇప్పుడు మరోసారి డూ ఆర్ డై పరిస్థితుల్లో ఇండియా అహ్మదాబాద్ లో ఆస్ట్రేలియాతో చివరి టెస్ట్ ఆడబోతోంది. కానీ ఈసారి డ్రా కాదు కదా కచ్చితంగా గెలవాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అహ్మదాబాద్ సెంటిమెంట్ కలిసి రావాలని ఇటు ఇండియన్ టీమ్, అటు అభిమానులు ఆశిస్తున్నారు. ఇప్పటికే మూడో టెస్ట్ గెలిచిన ఆస్ట్రేలియా ఫైనల్ చేరింది. ఇండియా లేదా శ్రీలంకలలో ఒకరితో ఫైనల్ ఆడుతుంది.

డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే?

ఆస్ట్రేలియాపై నాలుగో టెస్టులో గెలిస్తే ఇండియా నేరుగా ఫైనల్ చేరుతుంది. అయితే ఈ మ్యాచ్ లో ఓడినా, డ్రా అయినా కూడా శ్రీలంక, న్యూజిలాండ్ సిరీస్ పై ఆధారపడాల్సి వస్తుంది. ఆ సిరీస్ న్యూజిలాండ్ గెలిస్తే ఇండియా ఫైనల్ వెళ్తుంది. కనీసం రెండు టెస్టుల్లో కివీస్ ఒక మ్యాచ్ డ్రా చేసుకున్నా.. శ్రీలంక రేసు నుంచి తప్పుకొని ఇండియా డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకుంటుంది.

ప్రస్తుతం డబ్ల్యూటీసీ టేబుల్లో ఇండియా 60.29 పర్సెంటేజ్ పాయింట్లతో రెండోస్థానంలో ఉంది. డబ్ల్యూటీసీ ఫైనల్ జూన్ 7 నుంచి లండన్ లోని ది ఓవల్ లో జరగనుంది. ఇక శ్రీలంక విషయానికి వస్తే ఆ టీమ్ న్యూజిలాండ్ పై 2-0తో గెలిస్తేనే ఫైనల్ వెళ్తుంది. శ్రీలంక గెలుపోటములపై ఆధారపడకూడదనుకుంటే.. చివరి టెస్టులో ఆస్ట్రేలియాను ఇండియా ఓడించాల్సిందే.

తదుపరి వ్యాసం