Gavaskar on Team India: ఈ ఏడాది టీమిండియా ఆ రెండూ గెలవాలి: గవాస్కర్
Gavaskar on Team India: ఈ ఏడాది టీమిండియా ఆ రెండూ గెలవాలని అన్నాడు మాజీ ప్లేయర్ సునీల్ గవాస్కర్. ఈసారి ఇండియా రెండు ప్రధాన ఐసీసీ టోర్నీల్లో ఆడబోతున్న వేళ సన్నీ ఈ కామెంట్స్ చేశాడు.
Gavaskar on Team India: ఇండియన్ క్రికెట్ టీమ్ టీ20, వన్డేల్లో నంబర్ వన్. టెస్టుల్లోనూ దూసుకెళ్తోంది. కానీ సుమారు పదేళ్లుగా ఇండియన్ టీమ్ ఒక్క ఐసీసీ టోర్నీ కూడా గెలవలేకపోయిందన్న బాధ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ లో ఉంది. ఈ నేపథ్యంలో ఇండియా 2023లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ తోపాటు వన్డే వరల్డ్ కప్ లలో ఆడబోతోంది.
ఈ రెండు టోర్నీలు గెలవాలని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఆకాంక్షించాడు. స్పోర్ట్స్‌స్టార్ ఏసెస్ అవార్డుల సెర్మనీలో పాల్గొన్న సన్నీ.. ఇండియన్ టీమ్ పై స్పందించాడు. "ఈసారి ఇండియా రెండు టైటిల్స్ గెలవాలని నేను కోరుకుంటున్నా. అందులో ఒకటి వరల్డ్ ఛాంపియన్షిప్ కాగా.. మరొకటి వన్డే వరల్డ్ కప్. ఈ రెండింటి మధ్యలో ఆసియా కప్ కూడా ఉందనుకోండి. అది కూడా ఇండియాకు వస్తే అంతకన్నా కావాల్సింది ఏముంటుంది" అని గవాస్కర్ అన్నాడు.
గత దశాబ్దకాలంగా ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ అథ్లెట్లతో కలిసే అవకాశం రావడం వల్ల ఇండియా స్పోర్ట్స్ పర్సన్స్ ప్రమాణాలు పెరిగాయని కూడా ఈ సందర్భంగా గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. "ప్రపంచంలోని టాప్ స్టార్లను చూసే అవకాశం, వాళ్లతో కలిసి పోటీ పడే అవకాశాలు వస్తున్నాయి. ఆ టాప్ అథ్లెట్లు ఎలా తమను తాము మలచుకుంటారు అనేది కూడా తెలుసుకునే అవకాశం రావడంతో ఇండియన్ అథ్లెట్లు తమను తాము మెరుగుపరచుకొనే అవకాశం వచ్చింది" అని గవాస్కర్ అన్నాడు.
ఇక ఇండియన్ వుమెన్స్ టీమ్ టీ20 వరల్డ్ కప్ లో భాగంగా గురువారం (ఫిబ్రవరి 23) ఆస్ట్రేలియాతో సెమీఫైనల్లో తలపడనున్న నేపథ్యంలో కంగారూలను దాటడం అనేది ఇండియాకు చాలా ముఖ్యమని గవాస్కర్ చెప్పాడు. "చాలా రోజులుగా ఆస్ట్రేలియా టీమ్ అడ్డుగా ఉంటోంది. మన మెన్స్ టీమ్ ఆస్ట్రేలియాలో 2018-19లో సాధించిన విజయంలాంటిది ఇప్పుడు వుమెన్స్ టీమ్ కు అవసరం. ఒకవేళ ఇండియన్ వుమెన్స్ టీమ్ ఆస్ట్రేలియా అడ్డంకిని అధిగమించి, తర్వాత వరల్డ్ కప్ గెలిస్తే ఇది చాలా పెద్ద విజయం అవుతుంది" అని గవాస్కర్ అన్నాడు.
సంబంధిత కథనం