WTC Final Schedule: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ షెడ్యూల్ ఇదే.. ఎక్కడ జరుగుతుందంటే?-wtc final schedule revealed by icc on wednesday february 8th ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Wtc Final Schedule: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ షెడ్యూల్ ఇదే.. ఎక్కడ జరుగుతుందంటే?

WTC Final Schedule: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ షెడ్యూల్ ఇదే.. ఎక్కడ జరుగుతుందంటే?

Hari Prasad S HT Telugu
Feb 08, 2023 04:18 PM IST

WTC Final Schedule: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ షెడ్యూల్ ను బుధవారం (ఫిబ్రవరి 8) ఐసీసీ రిలీజ్ చేసింది. 2021-23 సైకిల్లో టాప్ 2లో నిలిచిన రెండు జట్లు ఈ ఫైనల్లో తలపడతాయి.

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ షెడ్యూల్ రిలీజ్
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ షెడ్యూల్ రిలీజ్

WTC Final Schedule: మరో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సైకిల్ క్లైమ్యాక్స్ కు చేరువైంది. 2021-23 సైకిల్ కు గాను ఈ ఏడాది ఫైనల్ జరగనుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ ను ఐసీసీ బుధవారం (ఫిబ్రవరి 8) రిలీజ్ చేసింది. ఈ డబ్ల్యూటీసీ ఫైనల్ జూన్ 7 నుంచి 11 వరకూ జరగనుంది. జూన్ 12ను రిజర్వ్ డేగా ప్రకటించారు.

ఈ విషయాన్ని ఐసీసీ ట్విటర్ ద్వారా అనౌన్స్ చేసింది. "ఈ ఏడాది జరగబోయే ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ తేదీలు రివీల్ అయ్యాయి" అని ట్విటర్ లో ఐసీసీ వెల్లడించింది. ఈ ఫైనల్ మ్యాచ్ లండన్ లోని ది ఓవల్ గ్రౌండ్లో జరగనుంది.

నిజానికి ఈసారి లార్డ్స్ లో ఈ ఫైనల్ జరుగుతుందని భావించినా.. ది ఓవల్ లోనే జరగనున్నట్లు ఐసీసీ స్పష్టం చేసింది. తొలి డబ్ల్యూటీసీ ఫైనల్ 2021లో సౌథాంప్టన్ లో జరిగింది. ఈ ఫైనల్లో ఇండియాపై న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు ఇలా..

తొలి డబ్ల్యూటీసీ ఫైనల్ చేరిన టీమిండియా.. ఈసారి కూడా రేసులో ఉంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా ఈ టేబుల్లో 75.56 పర్సెంటేజ్ పాయింట్లతో టాప్ లో ఉంది. ఆ తర్వాత ఇండియా 58.93 పాయింట్లతో రెండోస్థానంలో ఉంది. ఇప్పుడీ రెండు టీమ్సే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాలుగు టెస్టుల సిరీస్ లో తలపడబోతున్నాయి.

ఈ సిరీస్ గురువారం (ఫిబ్రవరి 9) నుంచి నాగ్‌పూర్ లో జరగబోయే తొలి టెస్టుతో ప్రారంభం కానుంది. ఈ సిరీస్ గెలిస్తే ఇండియా ఫైనల్ చేరుతుంది. అయితే ఒక్క మ్యాచ్ కంటే ఎక్కువగా ఓడిపోకూడదు.

ఇక ఈ టేబుల్లో మూడో స్థానంలో ఉన్న శ్రీలంక (53.33), నాలుగో స్థానంలో ఉన్న సౌతాఫ్రికా (48.72) కూడా ఫైనల్ బెర్త్ పై ఆశతో ఉన్నాయి. శ్రీలంక విదేశాల్లో రెండు టెస్టుల సిరీస్, సౌతాఫ్రికా స్వదేశంలో వెస్టిండీస్ తో రెండు టెస్టుల సిరీస్ ఆడనున్నాయి.

Whats_app_banner

సంబంధిత కథనం