Border Gavaskar Trophy History: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ చరిత్ర ఇదీ.. ఆస్ట్రేలియాపై ఇండియాదే పైచేయి-border gavaskar trophy history india dominated australia ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Border Gavaskar Trophy History India Dominated Australia

Border Gavaskar Trophy History: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ చరిత్ర ఇదీ.. ఆస్ట్రేలియాపై ఇండియాదే పైచేయి

Hari Prasad S HT Telugu
Feb 06, 2023 09:03 PM IST

Border Gavaskar Trophy History: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ చరిత్ర చూస్తే ఇప్పటివరకూ ఆస్ట్రేలియాపై ఇండియానే పైచేయి సాధించింది. ఇక చివరి మూడుసార్లూ ఇండియానే సిరీస్ గెలవడం విశేషం.

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీతో ఇండియన్ టీమ్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీతో ఇండియన్ టీమ్

Border Gavaskar Trophy History: అలన్ బోర్డర్, సునీల్ గవాస్కర్.. ఇండియా, ఆస్ట్రేలియా క్రికెట్ లోని ఆల్ టైమ్ గ్రేట్ ప్లేయర్స్ లో వీళ్ల పేర్లు టాప్ లో ఉంటాయి. అందుకే ఈ రెండు దేశాల మధ్య జరిగే టెస్ట్ సిరీస్ లకు ఈ ఇద్దరి పేర్ల మీదుగానే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అనే పేరు పెట్టారు. 1996 నుంచి ఈ సిరీస్ జరుగుతోంది. ఇప్పటి వరకూ 15 సిరీస్ లు జరిగాయి.

ట్రెండింగ్ వార్తలు

ఇక ఇప్పుడు ఇండియాలో జరగబోయే 16వ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా టీమ్ వచ్చింది. ఫిబ్రవరి 9 నుంచి నాగ్‌పూర్ లో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అసలు ఈ ట్రోఫీలో ఏ టీమ్ గెలుపోటములు ఎలా ఉన్నాయి? ఇప్పటి వరకూ అత్యధిక విజయాలు సాధించిన టీమ్ ఏది అన్న విషయాలు చూద్దాం.

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ రికార్డు ఇదీ

ప్రపంచ క్రికెట్ ను ఆస్ట్రేలియా దశాబ్దాల పాటు ఏలినా.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మాత్రం ఇండియాదే పైచేయి సాధించింది. ఇప్పటి వరకూ అత్యధిక టెస్టు మ్యాచ్ లూ, సిరీస్ విజయాలూ సాధించిన టీమ్ ఇండియానే. మొత్తంగా చూస్తే రెండు దేశాల మధ్య 102 టెస్టులు జరిగాయి. అందులో 43 విజయాలతో ఆస్ట్రేలియా ఆధిపత్యం చెలాయించింది.

అయితే 1996లో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రారంభమైన తర్వాత మాత్రం ఇండియా హవా మొదలైంది. ఈ ట్రోఫీలో భాగంగా రెండు దేశాల మధ్య 52 టెస్టులు జరగగా.. అందులో 22 ఇండియా గెలిచింది. టీమిండియా విజయాల శాతం 42.30 గా ఉంది. మరోవైపు ఆస్ట్రేలియా 19 టెస్టుల్లో విజయం సాధించింది. వాళ్ల విజయాల శాతం 36.53గా ఉంది. మరో 11 డ్రాగా ముగిశాయి.

ఏ సిరీస్‌లో ఎవరు గెలిచారంటే?

ఆతిథ్య దేశం సీజన్ విజేత గెలుపు మార్జిన్

ఇండియా 1996/97 ఇండియా 1-0 (1)

ఇండియా 1997/98 ఇండియా 2-1 (3)

ఆస్ట్రేలియా 1999/00 ఆస్ట్రేలియా 3-0 (3)

ఇండియా 2000/01 ఇండియా 2-1 (3)

ఆస్ట్రేలియా 2003/04 డ్రా 1-1 (4)

ఇండియా 2004/05 ఆస్ట్రేలియా 2-1 (4)

ఆస్ట్రేలియా 2007/08 ఆస్ట్రేలియా 2-1 (4)

ఇండియా 2008/09 ఇండియా 2-0 (4)

ఇండియా 2010/11 ఇండియా 2-0 (2)

ఆస్ట్రేలియా 2011/12 ఆస్ట్రేలియా 4-0 (4)

ఇండియా 2012/13 ఇండియా 4-0 (4)

ఆస్ట్రేలియా 2014/15 ఆస్ట్రేలియా 2-0 (4)

ఇండియా 2016/17 ఇండియా 2-1 (4)

ఆస్ట్రేలియా 2018/19 ఇండియా 2-1 (4)

ఆస్ట్రేలియా 2020/21 ఇండియా 2-1 (4)

ఇండియాలో ఒకే ఒక్కసారి

ఇప్పటి వరకూ జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీల్లో ఇండియాలో కేవలం ఒక్కసారి మాత్రమే ఆస్ట్రేలియా సిరీస్ గెలిచింది. అది కూడా 2004లో. 19 ఏళ్లుగా ఇక్కడ మరో సిరీస్ కోసం ఆస్ట్రేలియా ఎదురు చూస్తూనే ఉంది. మొత్తం ఇప్పటి వరకూ 15 సిరీస్ లలో 9 ఇండియా గెలవగా.. ఆస్ట్రేలియా 5 గెలిచింది. మరొకటి డ్రాగా ముగిసింది. ఇక ఆస్ట్రేలియాలో ఇండియా రెండు సిరీస్ లు సొంతం చేసుకుంది.

2016-17 నుంచి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఇండియా దగ్గరే ఉంది. ఆ ఏడాది స్వదేశంలో జరిగిన సిరీస్ గెలిచిన ఇండియా.. తర్వాత 2018-19, 2020-21లలో వరుసగా రెండుసార్లు ఆస్ట్రేలియాలో సిరీస్ విజయాలు సాధించింది. ఇక ఇప్పుడు ఏడేళ్లుగా తమకు దక్కని ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఇండియాకు వచ్చింది ఆస్ట్రేలియా. ఈసారి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ టేబుల్లో టాప్ లో ఉన్న ఈ రెండు టీమ్స్ మధ్య సమరం రసవత్తరంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

WhatsApp channel

సంబంధిత కథనం