తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  36 National Games 2022: నేటి నుంచి 36వ నేషనల్ గేమ్స్ షురూ - ప్రారంభోత్సవ వేడుకకు ముఖ్య అతిథిగా ప్రధాని మోడీ

36 National Games 2022: నేటి నుంచి 36వ నేషనల్ గేమ్స్ షురూ - ప్రారంభోత్సవ వేడుకకు ముఖ్య అతిథిగా ప్రధాని మోడీ

HT Telugu Desk HT Telugu

29 September 2022, 9:45 IST

  • 36 National Games 2022: 36వ జాతీయ క్రీడలు నేడు గుజరాత్ లో మొదలుకానున్నాయి. సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 12 వరకు ఈ పోటీలు జరుగనున్నాయి. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ప్రధాన మోడీ ఈ జాతీయ క్రీడలను ప్రారంభించబోతున్నారు

36వ నేషనల్ గేమ్స్
36వ నేషనల్ గేమ్స్ (Twitter)

36వ నేషనల్ గేమ్స్

36 National Games 2022: దేశంలోనే అతిపెద్ద క్రీడా సంబురాల్లో ఒకటైన నేషనల్ గేమ్స్ నేడు ఆరంభం కానున్నాయి. గుజరావ్ వేదికగా మొదలుకానున్న 36వ నేషనల్ గేమ్స్ ప్రారంభోత్సవ వేడుకకు ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అహ్మదబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియాంలో ఈ గేమ్స్ ను ప్రధాన మంద్రి ప్రారంభించబోతున్నారు. నేషనల్ గేమ్స్ లో 36 క్రీడాంశాల్లో 7 వేలకు మంది పైగా అథ్లెట్లు పోటీపడబోతున్నారు. సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 12 వరకు ఈ నేషనల్ గేమ్స్ జరుగనున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

అహ్మదబాద్, గాంధీనగర్, సూరత్, వడోదర, రాజ్ ఖోట్, భావ్ నగర్ లలో నేషనల్ గేమ్స్ నిర్వహించబోతున్నారు. సైక్లింగ్ గేమ్ మాత్రం ఢిల్లీలో నిర్వహించనున్నట్లు తెలిసింది. జాతీయ క్రీడలకు గుజరాత్ ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి. దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత జాతీయ క్రీడలు జరుగనుండటం గమనార్హం.

చివరగా 2015లో కేరళలో నేషనల్ గేమ్స్ జరిగాయి. ఈ సారి కొత్తగా ఖోఖో, యోగాసన్ తో పాటు మల్లఖంబ్ గేమ్స్ ను ప్రవేశపెట్టబోతున్నారు. ఇప్పటికే కబడ్డీ, లాన్ బౌల్స్, రగ్బీ పోటీలు మొదలుపెట్టారు. ఈ జాతీయ పోటీలకు పీవీ సింధు, నీరజ్ చోప్రా, నిఖత్ జరీన్ తో పాటు పలువురు స్టార్ ప్లేయర్స్ ధూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. ఒలింపిక్ విన్నర్స్ మీరాబాయిఛాను, లవ్లీనా ఈ గేమ్స్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నారు.