తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Kitchen Vastu Tips: గ్యాస్ స్టవ్, సింక్ మధ్య దూరం లేకపోతే ఏమవుతుందో తెలుసా?

Kitchen vastu tips: గ్యాస్ స్టవ్, సింక్ మధ్య దూరం లేకపోతే ఏమవుతుందో తెలుసా?

Gunti Soundarya HT Telugu

09 December 2023, 7:00 IST

google News
    • Kitchen vastu tips: ఇంటికి కిచెన్ గుండెలాంటిది. వంట గదిలో స్టవ్ సరైన దిశలో ఉంటేనే ఆ ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది. 
వంటింట్లో గ్యాస్ స్టవ్ ఏ దిశలో ఉండాలి?
వంటింట్లో గ్యాస్ స్టవ్ ఏ దిశలో ఉండాలి? (pixabay)

వంటింట్లో గ్యాస్ స్టవ్ ఏ దిశలో ఉండాలి?

Kitchen vastu tips: ఇంట్లో ప్రతి వస్తువు ఏది ఎక్కడ పెట్టాలనేదానికి వాస్తు పాటిస్తూ ఉంటారు. అలాగే కిచెన్ దిశ కూడా సరిగా ఉండాలి. వాస్తు ప్రకారం వంట గది ఇంటి ఆగ్నేయ మూలలో ఉండాలి. అక్కడ అగ్ని దేవత లేదా అగ్ని దేవుడు పరిపాలిస్తాడు. అందుకే వాస్తు శాస్త్రం ప్రకారం వంట గది స్థానం అక్కడే ఉండాలని సూచిస్తారు.

తూర్పు ముఖంగా ఉన్న ఇంటికి వంట గది ఆగ్నేయం అనువైన దిశ. ఈ స్థలం వంట గది పెట్టడానికి అందుబాటులో లేకపోతే వాయువ్యంగా పెట్టుకోవచ్చు. కాని ఉత్తరం, పడమర, ఈశాన్య దిశల్లో మాత్రం నివారించకూడదు. అలాగే వంట గదిలో పెట్టుకునే పాత్రలకు కూడా వాస్తు నియమాలు వర్తిస్తాయి. కిచెన్ లో ముఖ్యమైన గ్యాస్ స్టవ్ సరైన దిశలో పెట్టుకోవాలి. వంట చేసేటప్పుడు తూర్పు వైపు ఉండాలి.

స్టవ్ ఏ దిశలో ఉండాలి?

ఇంటికి వంటగది గుండెలాంటిది. అందుకే వంట గది ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. అప్పుడే ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. వాస్తు సిద్ధాంతం ప్రకారం గ్యాస్ స్టవ్ అగ్ని మూలకాన్ని సూచిస్తుంది. స్టవ్ సరిగా ఉన్నప్పుడు ఇంట్లో నివసిస్తున్న వాళ్ళు సంతోషంగా ఉంటారు. గ్యాస్ స్టవ్ కు సమాంతరంగా సింక్ నిర్మిస్తారు. స్టవ్, సింక్ మధ్య సరైన దూరం ఉంచడం చాలా ముఖ్యం. స్టవ్, సింక్ మధ్య దూరం లేకపోతే అది ఇంట్లో ఆడవారి మీద ప్రభావం చూపిస్తుంది. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. సింక్ ఈశాన్య దిశలో ఉంచాలి. అలాగే గ్యాస్ స్టవ్ ఆగ్నేయంలో పెట్టాలి.

ఒకవేళ వంట గదిని దక్షిణ దిశలో నిర్మిస్తే సింక్ ఉత్తరం వైపు ఉంచాలి. సింక్, స్టవ్ రెండూ కలిపి ఉంచకూడదు. స్టవ్ అగ్ని మూలకం అయితే సింక్ నీరుకి సంబంధించినది. ఇవి రెండూ దగ్గర దగ్గరగా ఉండటం వల్ల ప్రతికూలత ఏర్పడుతుంది. చిన్న వంట గది ఉన్నప్పుడు గ్యాస్ స్టవ్, సింక్ కి మధ్య దూరం అసలు ఉండదు. అటువంటి సమయంలో నెగటివ్ ఎనర్జీ రాకుండా ఉండేందుకు వాటి మధ్య చెక్క బోర్డు లేదా గాజు వస్తువు పెట్టడం మంచిది. కిచెన్ ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. వస్తువులు చిందరవందరగా పెట్టకూడదు. సరైన పరిశుభ్రత లేకపోతే అన్నపూర్ణ దేవికి ఆగ్రహం వస్తుంది.

ఫ్రిజ్ ఈ దశలో ఉండాలి

ఇంట్లో మనుషుల సంఖ్య పెరిగే కొద్దీ ఫ్రిజ్ పరిమాణం కూడా పెరుగుతుంది. పెద్దగా ఉన్న రిఫ్రిజిరేటర్లు వంట గదిలో పెట్టుకోవడానికి వీలు ఉండదు. వాస్తు ప్రకారం ఫ్రిజ్ ని నైరుతి దిశలో ఉంచాలి. గది మూలకు కనీసం ఒక అడుగు దూరంలో ఉంచడం మంచిది. ఈశాన్య దిశలో ఫ్రిజ్ పెట్టకూడదు.

ఎలక్ట్రానిక్ పరికరాలు

ఆధునిక వంట గదిలో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల వినియోగం ఎక్కువగా మారిపోయింది. ఇండక్షన్ స్టవ్, మైక్రో వేవ్, మిక్సర్లు, గ్రైండర్లు వంటి అనేక విద్యుత్ ఉపకరణాలు వినియోగిస్తున్నారు. వంట గది వాస్తు చిట్కాల ప్రకారం ఈ ఉపకరణాలు ఎప్పుడు వంట గదికి ఆగ్నేయ దిశలో ఉండాలి. వీటిని ఈశాన్య దిశలో ఉంచకూడదు. ఇంట్లో వంటకి ఉపయోగించే రోటీ పాన్, కడాయి అందరికీ కనిపించే విధంగా పెట్టకూడదు.

టాపిక్

తదుపరి వ్యాసం