తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Chanting Stotram Benefits: స్తోత్రాల మహిమ ఏంటి? ఏ కష్టం వచ్చినప్పుడు ఏ స్తోత్రం పఠించాలి

Chanting stotram benefits: స్తోత్రాల మహిమ ఏంటి? ఏ కష్టం వచ్చినప్పుడు ఏ స్తోత్రం పఠించాలి

HT Telugu Desk HT Telugu

15 January 2024, 17:56 IST

    • Chanting strotram benefits: భగవంతుడిని స్మరించుకోవడం కోసం అనువైన మార్గం స్త్రోత్రాలు పఠించడం. శక్తివంతమైన ఈ మంత్రాలు జపించడం వల్ల అధ్యాత్మికంగా బలపడతారని ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర శర్మ తెలిపారు. 
స్తోత్రాలు పఠించడం వల్ల ఏమవుతుంది?
స్తోత్రాలు పఠించడం వల్ల ఏమవుతుంది? (pixabay)

స్తోత్రాలు పఠించడం వల్ల ఏమవుతుంది?

Chanting stotram benefits: భారతీయ సనాతన ధర్మంలో భాగవతారాధన చాలా ప్రత్యేకమైనది. కర్మఫలంగా జీవించేటటువంటి మామూలు వారి జీవన విధానంలో అనేక సుఖ దుఃఖాలకు లోనవుతారు. జీవితంలో ఏర్పడేటువంటి బాధలకు, కష్టాలకు, దుఃఖాల నుండి బయటపడటానికి మన రుషుల ద్వారా పురాణాల ద్వారా అధ్యాత్మిక గురువులైనటువంటి శంకరాచార్యులవారు అలాగే వేద వ్యాసుల వంటి రుషుల ద్వారా అనేక స్తోత్రాలు మనకు అందటం జరిగింది.

లేటెస్ట్ ఫోటోలు

Mercury transit: గ్రహాల రాకుమారుడు వచ్చేశాడు.. ఈ నెల అంతా వీరికి డబ్బే డబ్బు

May 18, 2024, 03:19 PM

Mohini Ekadashi : మోహిని ఏకాదశి రోజున ఈ రాశులపై లక్ష్మీదేవి అనుగ్రహం

May 18, 2024, 08:31 AM

మే 18, రేపటి రాశి ఫలాలు.. రేపు విలువైన వస్తువులు పోయే అవకాశం ఉంది, జాగ్రత్త

May 17, 2024, 08:25 PM

Sukraditya yogam: శుక్రాదిత్య యోగం.. ఈ మూడు రాశుల వారికి ఆదాయం పెరుగుతుంది, ఐశ్వర్యం వస్తుంది

May 17, 2024, 02:37 PM

ఈ రాశుల వారికి భారీ ధన లాభం- ఇంకొన్ని రోజుల్లో ప్రమోషన్​!

May 17, 2024, 12:21 PM

saturn Retrograde 2024 : శని తిరోగమనంతో రాజయోగం.. మంచి మంచి ఆఫర్లు వీరి సొంతం

May 17, 2024, 08:14 AM

ఈ స్తోత్రాలలో ఏ స్తోత్రమును పారాయణ చేయడం వలన ఎటువంటి ఫలితాన్ని పొందవచ్చు అనేది ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు.

ఏ స్త్రోత్రం పఠిస్తే ఎటువంటి ప్రయోజనం

పనులలో విజయం పొందాలంటే గణనాయకాష్టకం చదవాలి. జ్ఞానం, భక్తి తత్వం పొందేందుకు, శివ అనుగ్రహం పొందడానికి శివాష్టకం చదవాలి. ఉద్యోగ సమస్యలు, అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి ఆదిత్య హృదయం పారాయణ చేయడం చాలా మంచిది. కోరికలు నెరవేరడానికి శ్రీరాజరాజేశ్వరి అష్టకం, అన్నానికి, ఆహారమునకు లోటు ఉండకుండా అన్నపూర్ణ అష్టకం, అధ్యాత్మిక జ్ఞానం, అద్భుత జీవనం పొందడానికి కాలభైరవ అష్టకం పఠించడం మంచిది అని చిలకమర్తి తెలిపారు.

మానసిక భయాందోళనలు, బుద్ధి వికాసము కోసం దుర్గ అష్టోత్తర శతనామం, జ్ఞానం, విద్య పొందడానికి విశ్వనాథ అష్టకం పఠించాలని చిలకమర్తి వివరించారు. కుజదోషం, కాలసర్పదోషం, పాప నాశనం కొరకు సుబ్రహ్మణ్యం అష్టకం, శని బాధలు, పిశాచపీడ తొలగడానికి హనుమాన్‌ చాలీసా చదవాలని తెలిపారు. పాపనాశనం, వైకుంఠ ప్రాప్తికై విష్ణు శతనామ స్తోత్రం పఠించాలి.

సత్ప్రవర్తన, సత్పురుష ప్రాప్తి శివ అష్టకం చదవాలని, సర్వ శుభప్రాప్తికి భ్రమరాంబిక అష్టకం, పాపనాశనానికి శివషోడక్షరి స్తోత్రం, ఆపద, పీడ తొలగడానికి లక్ష్మీనరసింహ స్తోత్రం చదవాలి.

కోటి జన్మపాప నాశనం పోవడానికి కృష్ణ అష్టకం, భార్యాభర్తల అన్యోన్యతకు ఉమామహేశ్వర స్తోత్రం, హనుమాన్‌ కటాక్షం సిద్ధించడానికి శ్రీ రామరక్ష స్తోత్రం, కీర్తి లలిత పంచరత్నం, వాక్‌శుద్ధికి శ్యామాల దండకం పఠించాలని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

సర్వజ్ఞాన ప్రాప్తికై త్రిపుర సుందరి స్తోత్రం పఠించాలి. రథ గజ తురంగ ప్రాప్తికై శివ తాండవ స్తోత్రం పఠించాలి. శని పీడ నివారణకు శని స్తోత్రం, శత్రు నాశనం చేయడానికి మహిషాసుర మర్ధిని స్తోత్రం, రుణ బాధలు తీరడానికి అంగారక రుణ విమోచన స్తోత్రం, నష్ట ద్రవ్యలాభం పొందడానికి కార్యవీర్యార్జున స్తోత్రం, ఆర్థిక వృద్ధికి కనకధార స్తోత్రం, ధన లాభం పొండానికి శ్రీ సూక్తం, సామ్రాజ్య సిద్ధికి సూర్య కవచం, శత్రు నాశనానికి సుదర్శన మంత్రం చదవాలి.

అశ్వమేధయాగ ఫలం పొందడానికి విష్ణు సహస్ర నామ స్తోత్రం, అఖండ ఐశ్వర్య ప్రాప్తి కొరకు రుద్రకవచం, శని బాధలు తొలగడానికి శని స్తోత్రం, ఈతిబాధలు తొలగడానికి దక్షిణ కాళీ స్తోత్రం, మనశ్శాంతి, మానసిక బాధలకు భువనేశ్వరి కవచం, పిశాచ పీడ నివారణకు వారాహి స్తోత్రం, పిశాచ పీడ నివారణకు దత్త స్తోత్రం, సర్వార్థ సిద్ధికి లలిత సహస్రనామం చదవాలని సూచించారు. నిత్యము భగవన్నామస్మరణ వలన ఎన్నో పాపాలు నశిస్తాయని పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

పంచాంగకర్త, ఆధ్యాత్మికవేత్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
తదుపరి వ్యాసం