తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Vastu Tips: వాస్తు ప్రకారం ఏ దిశ ఇల్లు ఉత్తమం?

Vastu Tips: వాస్తు ప్రకారం ఏ దిశ ఇల్లు ఉత్తమం?

HT Telugu Desk HT Telugu

28 September 2023, 13:56 IST

google News
    • వాస్తు రీత్యా ఏ దిశలో ఉన్న ఇంట్లో ఉండాలో జ్యోతిష్య శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు.
వాస్తు ప్రకారం ఏ దిశలో ఉన్న ఇంటిని ఎంచుకోవాలి?
వాస్తు ప్రకారం ఏ దిశలో ఉన్న ఇంటిని ఎంచుకోవాలి? (pixabay)

వాస్తు ప్రకారం ఏ దిశలో ఉన్న ఇంటిని ఎంచుకోవాలి?

వాస్తురీత్యా మీయొక్క నక్షత్రము, రాశి స్పష్టంగా మీకు తెలిసినట్లయితే వాటిని బట్టి మీకు తగిన అంటే ఉత్తర ముఖమా, తూర్పు ముఖమా, దక్షిణ ముఖమా, పశ్చిమ ముఖమా, ఆగ్నేయ ముఖమా, ఈశాన్య ముఖమా తెలుసుకుని ఆ రకమైన ఇంట్లో ఉండటము శ్రేష్టం అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. 

ఎవరైతే పూర్తిగా వారి యొక్క స్థలము, గృహమునందు ఉండకుండా అపార్ట్‌మెంట్‌ వంటి గృహ సముదాయంలో ఉంటున్నారో అటువంటి వారికి వాస్తురీత్యా కొన్ని కొన్ని దిశలను వాస్తుశాస్త్రం నిర్దేశించింది. ఎవరైతే రాజ్యాధికారాన్ని కోరుకుంటారో, ధనాన్ని కోరుకుంటారో, భోగాన్ని కోరుకుంటారో అటువంటి వారికి ఉత్తర ముఖం మంచిది. 

ఎవరైతే ధనము, చదువు, క్తీర్తి జ్ఞానము వంటి కోరుకుంటారో వారికి తూర్పు ముఖం శ్రేష్టమైనది. వ్యాపారపరమైనటువంటి అభివృద్ధి కోరుకునేటటువంటి వారికి పడమర ముఖం మంచిది. 

ఇక వాస్తురీత్యా ఆలోచించినట్లయితే ఎటువంటి వారికైనా రాశి, నక్షత్రము వంటి వాటితో సంబంధం లేకుండా తూర్పు, ఉత్తర ముఖముల గల ఇంటిని తీసుకోవడం మంచిదని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలియచేస్తున్నారు. 

ఒక ఇంటిలో కుటుంబ సభ్యులు భిన్న రాశుల జాతకులై ఉంటారు. అందరికి కలిసివచ్చే విధంగా ఉత్తర లేదా తూర్పుముఖంగా ఉండేటటువంటి ఇళ్ళను వాస్తుప్రకారంగా చూసుకొని తీసుకోవచ్చు. 

ఇప్పటివరకు ముఖాల గురించి చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆగ్నేయం, ఈశాన్యం, విశేషించి నైబుుతిభాగం ఇవన్నీ కూడా మనం పరిశీలించుకోవాలి. వాస్తురీత్యా పూర్తి ఇల్లు సరిగ్గా ఉన్నప్పుడు తూర్పు లేదా ఉత్తర ముఖం ఏదో ఒక ముఖం ఉన్న ఇంటిని కొనడంలో, ఆ ఇంటిలో ఉండటంలో లేదా అద్దెకు ఉ౦డటంలో ఎలాంటి ఇబ్బంది లేదని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

అసలు ఈ వాస్తు చూసేటప్పుడు ఏ వ్యక్తి అయినా ఇంటి బయట నుంచి కాక ఇంటి లోపల మధ్య భాగం నుండి ఉత్తరం, తూర్పు ఏరకంగా వున్నాయో కంపాస్‌తో చూడాలని ఆ రకంగా చూసిన దిశలే సరైన దిశలని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

టాపిక్

తదుపరి వ్యాసం