Vastu Plants for Home: ఈ 6 మొక్కలతో మీ ఇంట్లో అంతా శుభమే
23 May 2023, 11:42 IST
- వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని చిట్కాలతో అదృష్టాన్ని పొందవచ్చు. కొన్ని పూల మొక్కలు, ప్రత్యేకమైన మొక్కలతో అదృష్టం వెన్నంటి ఉండడంతో పాటు మీ ఇంటిల్లిపాది సంతోషంగా జీవిస్తారు.
వాస్తు మొక్కలు
పూల మొక్కలు ఉంటే ఇల్లు అందంగా కనిపిస్తుంది. ఆక్సిజన్‌తో జీవశక్తి కనిపిస్తుంది. ఇంటి నిండా సానుకూల శక్తి కనిపిస్తుంది. అంటే మొక్కలతో ఆరోగ్యం, ఇంటికి అందం, సానుకూల శక్తి లభిస్తాయి.
వాస్తు శాస్త్రం, ఫెంగ్‌షూయి ప్రకారం అదృష్టం తెచ్చి పెట్టే కొన్ని మొక్కలను లక్కీ ప్లాంట్స్ అంటారు. అవేవో ఇక్కడ చూడండి.
వెదురు మొక్క
వెదురు మొక్క ఇంట్లో ఉండడం అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. యజమానికి సంపూర్ణ ఆరోగ్యం ఇస్తుంది. పైగా ఎయిర్ ప్యూరిఫయర్‌గా కూడా పనిచేస్తుంది. ప్రతికూల దృష్టిని లాగేస్తుంది.
మల్లె పూవు
మల్లె పూవు తన సువాసనతో ఆకట్టుకుంటుంది. మల్లె చెట్టు ఇంటి ఆవరణలో ఉంటే గృహ యజమానికి ప్రేమ, అదృష్టం వెన్నంటి ఉంటాయి. ఇంట్లో శాంతి నెలకొంటుంది. స్ట్రెస్ తగ్గిస్తుంది. సానుకూల వాతావరణం ఉంటుంది.
మనీ ప్లాంట్
చైనీస్ మనీ ప్లాంట్ గృహంలో ఆర్థిక సంపద పెరిగేలా చేస్తుంది. బంధాలను బలోపేతం చేస్తుంది. స్నేహితులు, బంధువుల కారణంగా ప్రయోజనం కలిగేలా చేస్తుంది. అదృష్టం వెన్నంటి ఉండేలా చేసే ఈ మొక్కను జాగ్రత్తగా పెంచాలి. బాగా నీరు పెట్టకూడదు. కాస్త సూర్య రశ్మి సోకేలా చూడాలి.
పీస్ లిల్లీ
పీస్ లీల్లీ పూవులు తెల్లగా, అందంగా ఉంటాయి. ఇంట్లో శాంతిసామరస్యాలు నెలకొనేలా చేస్తాయి. పీస్ లిల్లీ ప్రతికూల శక్తిని తొలగించి సానుకూల శక్తిని వెదజల్లుతుంది. మానసిక ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇది ఎయిర్ ప్యూరిఫయర్‌గా కూడా పనిచేస్తుంది.
కలబంద
కలబంద ముఖ్యమైన ఔషధ మొక్క. మీ కుటుంబ ఆరోగ్యానికి తోడ్పడుతుంది. మీ పెరట్లో, బాల్కనీలో పెంచుకోవచ్చు. కలబంద గుజ్జు డయాబెటిస్‌కు, చర్మ సంరక్షణకు, జుట్టు ఆరోగ్యానికి దోహదం చేస్తుంది.