తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Varalakshmi Vratham: వరలక్ష్మీవ్రతం.. తేదీ, వ్రత కథ, పూజా విధానం మీకోసం

Varalakshmi Vratham: వరలక్ష్మీవ్రతం.. తేదీ, వ్రత కథ, పూజా విధానం మీకోసం

HT Telugu Desk HT Telugu

23 August 2023, 11:21 IST

    • Vara Lakshmi Vratham: శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతం జరుపుకోవడం హిందువుల ఆచారం. ఈనెల 25న శుక్రవారం ఈ వరలక్ష్మీ వ్రతాన్ని జరుపుకోనున్నారు.
వరలక్ష్మీ వ్రత కథ, పూజా విధానం
వరలక్ష్మీ వ్రత కథ, పూజా విధానం

వరలక్ష్మీ వ్రత కథ, పూజా విధానం

శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం హిందువుల ఆచారం. ఈనెల 25న శుక్రవారం ఈ వరలక్ష్మీ వ్రతాన్ని జరుపుకోనున్నారు. మహామాయారూపిణి, శ్రీ పీఠవాసిని, దేవతలు నిరంతరం సేవించే లోకమాత, శంక, చక్ర, గదల్ని ధరించిన మహాలక్ష్మీదేవి అష్టయిశ్వర్య ప్రదాయిని, అష్ట సంపదల్ని అందించే జగన్మంగళదాయిని, అష్టలక్ష్మీ రూపాన్నే వరలక్ష్మీదేవిగా మనం ఆరాధిస్తాం.

లేటెస్ట్ ఫోటోలు

మే 15, రేపటి రాశి ఫలాలు.. మీ కుటుంబంలోకి వచ్చే కొత్త అతిథి వల్ల గొడవలు వస్తాయ్

May 14, 2024, 08:30 PM

Bad Luck Rasis: గురు భగవానుడి ఆగ్రహాన్ని ఎదుర్కోబోయే రాశులు ఇవే.. వీరికి బ్యాడ్ టైమ్ రాబోతుంది

May 14, 2024, 02:33 PM

Jupiter venus conjunction: వృషభ రాశిలో గురు శుక్ర కలయిక.. వీరి ప్రేమ జీవితం రొమాన్స్ తో నిండిపోతుంది

May 14, 2024, 10:30 AM

మే 19 నుంచి ఈ రాశుల వారి జీవితాల్లో భారీ మార్పులు.. ఉద్యోగంలో ప్రమోషన్​- ధన లాభం!

May 14, 2024, 09:35 AM

మే 14, రేపటి రాశి ఫలాలు.. రేపు శత్రువుల నుంచి వీరికి ఆర్థిక లాభాలు

May 13, 2024, 08:09 PM

Rahu transit: రాహు గ్రహ అనుగ్రహం.. 2025 వరకు ఈ రాశుల వారికి దేనికి ఢోకా లేదు

May 13, 2024, 06:27 PM

భక్తితో పూజించినవారికీ, కొలిచినవారికీ కొంగుబంగారమై వరాలనిచ్చే మహాలక్ష్మే వరలక్ష్మి కుటుంబం సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సువాసినులు వరలక్ష్మీ వ్రతం చేస్తుంటారని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

వరలక్ష్మీ వ్రత కథ

కైలాసగిరిలో పరమేశ్వరుడు తన అనుచర గణములతో, మునిశ్రేష్టులతో కూడియుండగా పార్వతీదేవి అక్కడికి వచ్చింది. స్వామీ! స్త్రీలు సుఖసౌఖ్యాలు, పుత్రపౌత్రాదులతో కళకళలాడుతూ ఉండాలంటే ఎటువంటి వ్రతాలను, నోములను ఆచరించాలో తెలియచేయవలసిందిగా కోరుతున్నాను అన్నది.

పరమేశ్వరుడు సమాధానమిస్తూ స్త్రీలకు సమస్త సుఖాలను ప్రసాదించు వ్రతం వరలక్ష్మీవ్రతం. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించాలి. వ్రత కథను వినాలి. వ్రతాన్ని ఆచరించిన వారి మనోభీష్టాలు నెరవేరుతాయి. ఈ కథను తెలియచేస్తాను అని పరమేశ్వరుడు వ్రత కథను వినిపించాడు అని చిలకమర్తి తెలిపారు.

పూర్వం కుండినం అనే ఒక పట్టణం ఉందేది. ఆ పట్టణాన చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉంది. ఆమె వేకువ ఝామునే లేచి స్నానమాచరించి పుష్పాలను తెచ్చి భర్త పాదాలకు నమస్కరించి పూజలు చేసేది. అత్తమామలకు తల్లిదండ్రుల వలె చూసుకుంటూ ఉండేది.

గృహకార్యాలన్నీ స్వయంగా తానే చేసుకొనేది. చుట్టుప్రక్కల వారితో, బంధువులతో చనువుగా కలసిమెలసి ఉండేది. చారుమతి సద్గుణాలకు వరలక్ష్మీదేవి ప్రసన్నమైంది. ఒకనాడు చారుమతి కలలో వరలక్ష్మీదేవి కనిపించి ఇలా అన్నది. చారుమతీ! నీ సత్‌ప్రవర్తనకు, సద్గుణాలకు ప్రసన్నురాలనైనాను. నీకు ఒక వరం ఇవ్వాలన్న సంకల్పం కలిగింది. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించు. నీ సమస్త కోరికలు నెరవేరుతాయని చెబుతుంది.

చారుమతీదేవి కలలోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణాలు చేసి స్తుతించింది. తెల్లవారిన తరువాత భర్త, అత్తమామలకు తన స్వప్న వృత్తాంతాన్ని వివరించింది. చుట్టుప్రక్కల గల స్త్రీలు కూడా ఆ వృత్తాంతాన్ని విని సంతోషించారు. అందరూ కలసి వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరించడానికి సంకల్పించుకున్నారు. అందరూ శ్రావణ శుక్ష పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం కొరకు వేచి చూడసాగారు. ఆరోజు చారుమతితో సహా స్త్రీలందరూ వేకువ జాముననే లేచి స్నానం చేసి కొత్త వస్త్రాలు ధరించారు. చారుమతి వాకిట ముందర గోమయంతో అలికింది. అలికిన చోట బియ్యం పోసి మంటపాన్ని ఏర్పాటుచేసింది. ఆ మంటపంలోకి వరలక్ష్మీదేవిని ఆహ్వానం చేసింది. భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీదేవిని పూజించింది.

శ్లోః పద్మప్రియే పద్నిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి

విష్ణుప్రియే విశ్వమనోనుకూలే త్వత్పాదపద్మం మయిధత్స్వ

అనే శ్లోకాన్ని పఠిస్తూ షోడశోపచార పూజలు గావించింది. తొమ్మిది సూత్రములు గల తోరాన్ని దక్షిణి హస్తానికి కట్టుకున్నది. వరలక్ష్మీదేవికి వివిధ ఫలభక్ష్య పానీయ, పాయసాదులను సమర్పించింది. అనంతరం స్త్రీలందరూ కలసి వరలక్ష్మీ దేవికి ప్రదక్షిణ చేయడం మొదలుపెట్టారు.

మొదటి ప్రదక్షిణ పూర్తయ్యేసరికి ఘల్లు ఘల్లుమని శబ్దాలు వినిపించాయి. కిందికి కాళ్ళవైపు చూసుకుంటే గజ్జెలు, రెండవ ప్రదక్షిణ పూర్తయ్యే సరికి వారి హస్తాలు నవరత్నఖచిత కంకణాలతో ప్రకాశించసాగాయి. మూడవ ప్రదక్షిణం పూర్తి కాగానే స్త్రీలందరూ సర్వాలంకార భూషణాలతో ప్రకాశించసాగారు. వారి గృహాలన్నీ సకల సంపదలతో సమృద్ధమయ్యాయి.

వ్రతం పరిసమాప్తి కాగానే చారుమతి వ్రతం చేయించిన బ్రాహ్మణోత్తములకు దక్షిణ తాంబూలాదులను ఇచ్చి సత్కరించింది. వరలక్ష్మీ ప్రసాదాన్ని బంధుమిత్రులకు పెట్టి తానూ భుజించింది. లోకోపకారం కొరకు చారుమతి అందరిచేత వరలక్ష్మీ వ్రతాన్ని చేయించిందని పౌరులందరూ ఆమెను ప్రశంసించారు.

ఆనాటి నుంచి అందరూ ఈ వ్రతాన్ని చేయడం మొదలుపెట్టారని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

తదుపరి వ్యాసం