తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  డిసెంబర్ 3 : నేటి రాశి ఫలాలు.. ఒక పెద్ద సమస్య నుంచి వీరు బయటపడతారు

డిసెంబర్ 3 : నేటి రాశి ఫలాలు.. ఒక పెద్ద సమస్య నుంచి వీరు బయటపడతారు

HT Telugu Desk HT Telugu

03 December 2023, 4:05 IST

    • Today Rasi Phalalu Telugu : ఈరోజు రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 03.12.2023 ఆదివారం కోసం జ్యోతిష శాస్త్ర నిపుణులు, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
నేటి రాశి ఫలాలు
నేటి రాశి ఫలాలు

నేటి రాశి ఫలాలు

తెలుగురాశి ఫలితములు (దిన ఫలితము) 3.12.2023, వారం: ఆదివారం, తిథి : షష్టి నక్షత్రం : ఆశ్లేష, మాసం : కార్తీకం, సంవత్సరం: శోభకృత్‌ నామ, అయనం: దక్షిణాయనం

లేటెస్ట్ ఫోటోలు

మే 15, రేపటి రాశి ఫలాలు.. మీ కుటుంబంలోకి వచ్చే కొత్త అతిథి వల్ల గొడవలు వస్తాయ్

May 14, 2024, 08:30 PM

Bad Luck Rasis: గురు భగవానుడి ఆగ్రహాన్ని ఎదుర్కోబోయే రాశులు ఇవే.. వీరికి బ్యాడ్ టైమ్ రాబోతుంది

May 14, 2024, 02:33 PM

Jupiter venus conjunction: వృషభ రాశిలో గురు శుక్ర కలయిక.. వీరి ప్రేమ జీవితం రొమాన్స్ తో నిండిపోతుంది

May 14, 2024, 10:30 AM

మే 19 నుంచి ఈ రాశుల వారి జీవితాల్లో భారీ మార్పులు.. ఉద్యోగంలో ప్రమోషన్​- ధన లాభం!

May 14, 2024, 09:35 AM

మే 14, రేపటి రాశి ఫలాలు.. రేపు శత్రువుల నుంచి వీరికి ఆర్థిక లాభాలు

May 13, 2024, 08:09 PM

Rahu transit: రాహు గ్రహ అనుగ్రహం.. 2025 వరకు ఈ రాశుల వారికి దేనికి ఢోకా లేదు

May 13, 2024, 06:27 PM

మేష రాశి

మేష రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఆదాయం కొంత పెరిగి అవసరాలు తీరతాయి. ఆప్తుల సలహాలు స్వీకరించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. శత్రువులను సైతం ఆదరిస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు కొలిక్కివస్తాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపారులు ఉత్సాహంగా ముందుకు సాగి లాభాలు పొందుతారు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు దక్కే అవకాశం ఉంది. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు అనుకోని విదేశీప్రయాణాలు ఉంటాయి. పలుకుబడి, ఉన్నతస్థితి కలిగినవారు పరిచయమవుతారు. మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే ఆదివారం రోజు సూర్యాష్టకం పఠించడం, మహావిష్ణువును పూజించడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయి.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థం నుండి అనుకూత ఫలితాలున్నాయి. చేపట్టిన కార్యాలు దిగ్విజయంగా పూర్తి. స్థిరాస్తి విషయాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. రాబడి మెరుగ్గా ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. ఇంటి నిర్మాణ ప్రయత్నాలలో అవాంతరాలు తొలగుతాయి. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు ఉన్నత పదవులు రావచ్చు. రాజకీయవేత్తలు, పరిశోధకులు, క్రీడాకారులకు మంచి గుర్తింపు. సమస్యల పరిష్కారంలో సోదరుల సలహాలు స్వీకరిస్తారు. ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయడం మంచిది. వృషభరాశివారు ఈరోజు క్రిష్టాష్టకం పఠించడం వల్ల వృషభరాశి వారికి మరింత శుభఫలితాలు కలుగుతాయి.

మిథున రాశి

మిథున రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలముగా ఉన్నది. ఆదాయం పెరుగుతుంది. ఏపని చేపట్టినా విజయవంతంగా పూర్తిచేస్తారు. ఆత్మీయులు, బంధువులతో కష్టసుఖాలు పంచుకుంటారు. ఆస్తుల వ్యవహారాల్లో చికాకులు తొలగుతాయి. చిత్ర విచిత్ర సంఘటనలు ఎదురై ఆశ్చర్యపోతారు. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. నూతన ఉద్యోగాలు దక్కే అవకాశం. వ్యాపారులకు ఆశించిన లాభాలుంటాయి. ఉద్యోగులకు ఊరటనిచ్చే సమాచారం. మిథునరాశివారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే ఆదివారం రోజు సూర్యాష్టకం పఠించడం, మహావిష్ణువును పూజించడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ఆశ్చర్యకరమైన రీతిలో కార్యాలు చక్కదిద్దుతారు. విద్యార్థుల ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. ఇంటి నిర్మాణాలలో ఆటంకాలు తొలగుతాయి. ఆశించిన ఆదాయం. దీర్హకాలిక రుణ ఒత్తిడులు తొలగుతాయి. కుటుంబంలో వివాహాల విషయంలో చర్చలు. ఇంతకాలం పడిన కష్టం ఒక కొలిక్కి వస్తుంది. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు ఉన్నత పదవులు రావచ్చు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు అనుకూల సమయం. కర్కాటక రాశివారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే నవగ్రహ పీడాహర స్తోత్రం పఠించాలి. అరుణం పఠించడం లేదా వినడం మంచిది.

సింహరాశి

సింహ రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది. మీ నిర్ణయాలు అందరూ గౌరవిస్తారు. రావలసిన సొమ్ము అందుతుంది. ఆస్తుల సలహాలు స్వీకరిస్తారు. చిరకాల స్వప్నం ఫలిస్తుంది. వాహన, గృహ కొనుగోలు ప్రయత్నాలు కలసివస్తాయి. శత్రువులు మిత్రులుగా మారి సాయపడతారు. విద్యార్థులు, నిరుద్యోగులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. వ్యాపారులకు పెట్టుబడులు మరింత పెరుగుతాయి. ఉద్యోగులకు ఉన్నత పదవులు దక్కుతాయి. రాజకీయనాయకులు, క్రీడాకారులు విదేశీ పర్యటనలు చేస్తారు. సింహ రాశి వారికి మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయాలి. నవగ్రహ పీడాహర స్తోత్రం పఠించడం మంచిది.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. దూరప్రాంతాల నుంచి శుభవర్తమానాలు అందుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఎవరి సాయం లేకుండానే ముఖ్యమైన కార్యాలు పూర్తిచేస్తారు. సమాజంలో ప్రత్యేక గౌరవం. విద్యావకాశాలు పెరుగుతాయి. ఆస్తి వ్యవహారాలలో కొత్త ఒప్పందాలు. వ్యాపారులు అనుకున్న సమయానికి విస్తరణ పూర్తి. పెట్టుబడులు పెరుగుతాయి. ఉద్యోగుల నిర్వహణలో ఆటంకాలు అధిగమిస్తారు. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం, ఆదిత్య హృదయం పారాయణ చేయడం మంచిది.

తులా రాశి

తులా రాశి వారికి ఈ రోజు మధ్యస్థ ఫలితాలున్నాయి. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లేదా ధనలాభాలు ఉండవచ్చు. పోటీ పరీక్షల్లో విద్యార్థులకు అనుకూల ఫలితాలున్నాయి. మనసులోని భావాలను నిర్మొహమాటంగా వెల్లడిస్తారు. వ్యాపారులకు ఊహించని లాభాలున్నాయి. ఉద్యోగులకు పదోన్నతులు. మీ ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కివస్తాయి. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు. తులారాశివారు మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే ఆదివారం రోజు నవగ్రహ పీడాహర స్తోత్రం పఠించడం మంచిది. ఆదిత్య హృదయం పారాయణ చేయడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఇంతకాలం పడిన కష్టం ఫలిస్తుంది. ఆదాయం మెరుగుపడి ఊరట లభిస్తుంది. సన్నిహితులతో సఖ్యత. వాహనాలు, ఆభరణాలు కొంటారు. ఆస్తుల వ్యవహారాల్లో గందరగోళం తొలగుతుంది. వివాహాది వేడుకల నిర్వహణ యత్నాలు ముమ్మరం చేస్తారు. మీ నిర్ణయాలు అందరి ప్రశంసలు పొందుతాయి. వ్యాపారులకు మెరుగైన లాభాలు. ఉద్యోగులకు హోదాలు. వృశ్చిక రాశి వారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే ఆదిత్య హృదయాన్ని పఠించడం, నవగ్రహా ఆలయాల్లో పూజలు వంటివి చేయడం వలన మరింత శుభఫలితాలు కలుగుతాయి.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈరోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. చేపట్టిన పనులు వేగంగా పూర్తిచేస్తారు. ఆదాయానికి ఇబ్బంది ఉ౦డదు. ఆలోచనలు కలసివస్తాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. ధనూరాశివారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే సూర్యాష్టకాన్ని పఠించాలి. నవధాన్యాలను దానం ఇవ్వడం మంచిది. క్షీరాన్నాన్ని ఆలయాల్లో ప్రసాదంగా పంచడం మంచిది.

మకర రాశి

మకర రాశివారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. వ్యాపారస్తులకు మెరుగైన లాభాలుంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు ఉంటాయి. వ్యతిరేకులను ఆకట్టుకుంటారు వాహనాలు, ఆభరణాలు కొంటారు. ముఖ్య కార్యాలు దిగ్విజయంగా పూర్తిచేస్తారు. పోటీ పరీక్షల్లో విద్యార్థులు సత్తా చాటుకుంటారు. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. నేర్పుతో కొన్ని సమస్యలను పరిష్కరిస్తారు. మకరరాశివారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే నవగ్రహశాంతి చేసుకోవడం మంచిది. ఈ రోజు నవగ్రహ ఆలయాలను దర్శించడం మంచిది. సూర్యాష్టకాన్ని పఠించండి.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలుంటాయి. ఆదాయం పెరిగి అవసరాలు తీరతాయి. సమాజంలో గుర్తింపు వస్తుంది. నిరుద్యోగులు ఆశించిన ఉద్యోగాలు సాధిస్తారు. ప్రముఖులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. చేపట్టిన కార్యక్రమాలు సకాలంలో పూర్తిచేస్తారు. కొంతకాలంగా వేధిస్తున్న ఒక సమస్యనుంచి బయటపడతారు. వ్యాపారులకు నూతన పెట్టుబడులు. ఉద్యోగులకు కొత్త పదవులు దక్కవచ్చు. మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయాలి. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. నువ్వులతో చేసిన ప్రసాదాన్ని ఆలయాల్లో పంచి పెట్టండి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఉద్యోగులకు కోరుకున్న పదవులు రావచ్చు. వ్యాపారులకు లాభాలు పెరుగుతాయి. అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. వ్యతిరేకులను సైతం ఆకట్టుకుంటారు. విద్యార్థుల ఆశలు ఫలిస్తాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కరమవుతాయి. వాహనాలు, భూముల కొనుగోలు ప్రయత్నాలు కలసివస్తాయి. నవగ్రహ స్తోత్రం పారాయణ చేయండి. విష్ణుసహస్రనామ పారాయణ చేయడం వలన శుభఫలితాలు కలుగును.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
తదుపరి వ్యాసం