తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  నవంబర్ 23, నేటి రాశి ఫలాలు - ఈ రాశి వారు తీవ్ర ఒత్తిళ్లు ఎదుర్కోవలసి వస్తుంది!

నవంబర్ 23, నేటి రాశి ఫలాలు - ఈ రాశి వారు తీవ్ర ఒత్తిళ్లు ఎదుర్కోవలసి వస్తుంది!

HT Telugu Desk HT Telugu

23 November 2024, 0:01 IST

google News
    • Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 23.11.2024 శనివారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
నవంబర్ 23, నేటి రాశి ఫలాలు - ఈ రాశి వారు తీవ్ర ఒత్తిళ్లు ఎదుర్కోవలసి వస్తుంది!
నవంబర్ 23, నేటి రాశి ఫలాలు - ఈ రాశి వారు తీవ్ర ఒత్తిళ్లు ఎదుర్కోవలసి వస్తుంది!

నవంబర్ 23, నేటి రాశి ఫలాలు - ఈ రాశి వారు తీవ్ర ఒత్తిళ్లు ఎదుర్కోవలసి వస్తుంది!

రాశిఫలాలు (నేటి రాశిఫలాలు) 23-11-2024

మాసం: కార్తీకము, తిథి : బ.అష్టమి, వారం: శనివారం, నక్షత్రం: మఖ

ఆయనము: దక్షిణాయనం, సంవత్సరం: శ్రీ క్రోధినామ సంవత్సరం

మేషం:

వాయిదా పడిన పనులు పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. వాహనయోగం. విద్యార్థులకు, నిరుద్యోగులకు శుభదినం. భవిష్యత్తు కోసం మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆలోచించి వ్యవహరించండి.

వృషభం:

ఆలోచనల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. నూతన పనులు చేపడతారు. కొత్తగా ఒప్పందాలు కుదుర్చుకుంటారు. తొందరపాటు నిర్ణయాలు వద్దు. వృత్తి ఉద్యోగాల్లో మార్పుకోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయం బాగుంటుంది.

మిథునం:

వాగ్వాదాలు చోటుచేసుకోవచ్చు. నిగ్రహంతో వ్యవహరించండి. ఖర్చుపై అదుపు ఉంచండి. ప్రలోభాలకు లొంగవద్దు. విద్యార్థుల మధ్య ఘర్షణలు తలెత్తుతాయి. ఉద్యోగుల్లో అసహనం పెరుగుతుంది. లక్ష్యంపై దృష్టి సారించి వ్యవహరించండి.

కర్కాటకం:

కొత్తవారితో జాగ్రత్తగా వ్యవహరించండి. నిరాశను దరి చేరనివ్వద్దు. ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. నిరుద్యోగులకు శుభదినం. వాహనాలు, యంత్రాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. పనుల్లో జాప్యం చోటుచేసుకుంటుంది.

సింహం:

ఒత్తిడులు పెరుగుతాయి. అప్పులు తీర్చాల్సి వస్తుంది. అనుకున్నట్టుగా డబ్బు చేతికందదు. అధికారులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. ఉద్యోగులకు అనువుగా ఉంటుంది. వ్యాపారులు ఆచితూచి వ్యవహరించాలి.

కన్య:

అనుకున్నవి సాధిస్తారు. అయితే తీవ్ర ఒత్తిళ్ళను ఎదుర్కోవలసి ఉంటుంది. ఇతరులను నమ్మి పనిభారం పెంచుకోవద్దు. ఆత్మీయులను కలుసుకుంటారు. వివాదాలు తలెత్తకుండా వ్యవహరించండి. మాట అదుపు అవసరం.

తుల:

నిరాశ వద్దు. కొత్త వ్యక్తుల సహకారం అందుతుంది. మనోధైర్యంతో వ్యవహరించండి. ఉద్యోగ మార్పు యత్నాలు వద్దు. ఆర్థికంగా బాగుంటుంది. శుభకార్య యత్నాలు జరుగుతాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి.

వృశ్చికం:

అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. ఆచితూచి వ్యవహరించండి. తొందరపాటు నిర్ణయాలు వద్దు. ఆర్భాటంగా వృథా ఖర్చును తలకెత్తుకోవద్దు. అప్రమత్తంగా ఉండండి.

ధనుస్సు:

మనోధైర్యంతో ఉండండి. ఆరోగ్యపరంగా పరిస్థితి మెరుగవుతుంది. ఆహార వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించండి. వృత్తి ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి. మొండి బకాయిలు వసూలు కావచ్చు.

మకరం:

ఒత్తిడులు పెరుగుతాయి. ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కుతారు. పెద్దల ప్రోత్సాహం లభిస్తుంది. కొత్త విషయాలు నేర్చుకోవడంపై ఆసక్తి చూపుతారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి.

కుంభం:

ఖర్చులు పెరుగుతాయి. విమర్శలను ఎదుర్కొంటారు. ఓర్పుతో వ్యవహరించండి. మాట తూలవద్దు. ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబంలో అందరూ కలసి వస్తారు. కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు.

మీనం:

ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. రుణాలు చేయాల్సి వస్తుంది. ఒప్పందాలు కుదుర్చుకునేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి. సంతాన విషయంలో సమస్యలు తలెత్తవచ్చు. కొత్త అవకాశాలను అన్వేషిస్తారు.

తదుపరి వ్యాసం