తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Kamada Ekadashi: నేడే కామద ఏకాదశి.. ఈరోజు ఏం చేయాలి? ఎలాంటి పనులు చేయకూడదు

Kamada ekadashi: నేడే కామద ఏకాదశి.. ఈరోజు ఏం చేయాలి? ఎలాంటి పనులు చేయకూడదు

Gunti Soundarya HT Telugu

19 April 2024, 7:00 IST

    • Kamada ekadashi: ఏప్రిల్ 19వ తేదీ కామద ఏకాదశి జరుపుకుంటున్నారు. ఏకాదశి రోజు ఏం పనులు చేయాలి? ఎలాంటి పనులు చేయకూడదనే విషయాల గురించి తెలుసుకుందాం. 
కామద ఏకాదశి రోజు చేయకూడని పనులు
కామద ఏకాదశి రోజు చేయకూడని పనులు

కామద ఏకాదశి రోజు చేయకూడని పనులు

Kamada ekadashi: హిందూ పంచాంగం ప్రకారం చైత్ర మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని కామధ ఏకాదశి అంటారు. ఈరోజు ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని పూజిస్తే సకల కోరికలు నెరవేరుతాయి. అలాగే కామద ఏకాదశి వ్రత కథ చదవడం లేదా వినడం వల్ల మంచి జరుగుతుంది. ఏకాదశి నాడు కొన్ని పనులు చేయడం వల్ల విష్ణు అనుగ్రహం పొందుతారు.

లేటెస్ట్ ఫోటోలు

Mohini Ekadashi : మోహిని ఏకాదశి రోజున ఈ రాశులపై లక్ష్మీదేవి అనుగ్రహం

May 18, 2024, 08:31 AM

మే 18, రేపటి రాశి ఫలాలు.. రేపు విలువైన వస్తువులు పోయే అవకాశం ఉంది, జాగ్రత్త

May 17, 2024, 08:25 PM

Sukraditya yogam: శుక్రాదిత్య యోగం.. ఈ మూడు రాశుల వారికి ఆదాయం పెరుగుతుంది, ఐశ్వర్యం వస్తుంది

May 17, 2024, 02:37 PM

ఈ రాశుల వారికి భారీ ధన లాభం- ఇంకొన్ని రోజుల్లో ప్రమోషన్​!

May 17, 2024, 12:21 PM

saturn Retrograde 2024 : శని తిరోగమనంతో రాజయోగం.. మంచి మంచి ఆఫర్లు వీరి సొంతం

May 17, 2024, 08:14 AM

3 రోజుల్లో వృషభ రాశిలోకి శుక్రుడు.. వీరి కష్టాలు తీరిపోతాయి

May 16, 2024, 04:45 PM

ఏకాదశి నాడు చేయాల్సిన పనులు

శ్రీ మహావిష్ణువుకు అరటి పండ్లు అంటే మహా ప్రీతి. వీటిని పూజలో సమర్పించడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. అలాగే జాతకంలో ఉన్న గురుదోషం తొలగిపోతుంది.

అరటిపండ్లతో పాటు పంచామృతం కూడా సమర్పించాలి. ఇందులో తప్పకుండా తులసి ఆకులు చేర్చాలి. తులసి ఆకులు లేకుండా విష్ణువుకి భోగం సమర్పించడం వల్ల మీరు చేసే పూజ అసంపూర్తిగా అవుతుంది. ఎటువంటి ఫలితము ఇవ్వదు.

విష్ణుమూర్తికి పసుపు రంగు అంటే చాలా ఇష్టం. ఆరోజు పసుపు రంగు వస్త్రాలు లేదా పువ్వులు సమర్పించాలి. ఇలా చేయడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది.

లక్ష్మీసమేత విష్ణుమూర్తిని పూజించాలి. పూజలో లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఖారీ సమర్పించడం వల్ల మీ ఇంట ఆనందం నిలుస్తుంది. 

కామధ అంటే అన్ని కోరికలు తీర్చేవాడని అర్థం. అటువంటి పవిత్రమైన రోజున చేయాల్సిన పనులు మాత్రమే కాకుండా చేయకూడని పనులు కూడా కొన్ని ఉన్నాయి. పొరపాటున కూడా ఈ పనులు చేయొద్దు. అలా చేస్తే మిమ్మల్ని దురదృష్టం వెంటాడుతుంది. 

ధాన్యాలు తినకూడదు

ఏకాదశి రోజు కొంతమంది ఉపవాసం ఉంటారు. ఒకవేళ ఉపవాసం ఉండని వాళ్ళు ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోను ధాన్యాలు తినకూడదు. బ్రాహ్మణ హత్య వంటి భయంకరమైన పాపాలతో పాటు ఇతర అనేక పాపాలు ఆహార ధాన్యాలలో నివసిస్తాయని అంటారు. అందుకే ఈ పవిత్రమైన రోజున ధాన్యాలు తినడం వల్ల వాటి ద్వారా మీ శరీరంలోకి పాపాలు ప్రవేశిస్తాయి. ముఖ్యంగా విష్ణువు, కృష్ణుడిని పూజించే వాళ్లు ధాన్యాలు తినకుండా ఉండాలి.

ఆహారం తీసుకోకూడదు

ఏకాదశి రోజు ఉపవాసం ఉండని వాళ్ళు అన్నం, ఉల్లిపాయ పొరపాటున కూడా తీసుకోకూడదు. అలాగే మద్యపానం సేవించడం, మాంసాహారం వంటి తామసిక ఆహారాలకు దూరంగా ఉండాలి. ఇవి తినడం వల్ల ప్రతికూల ఆలోచనలు కలుగుతాయి. 

తులసి ఆకులు కోయకూడదు

ఏకాదశి రోజు తులసి ఆకులను పొరపాటున కూడా కోయకూడదు. దానికి బదులు ముందు రోజు వాటిని తీసుకుని పెట్టుకోవాలి. ఏకాదశి రోజు తులసి ఆకులు తెంపడం వల్ల లక్ష్మీదేవి అసంతృప్తిగా ఉంటుంది. అమ్మవారి అనుగ్రహం లభించదు. 

జుట్టు కట్టించకూడదు 

గోర్లు, జుట్టు కత్తిరించకూడదు. అలాగే గడ్డం షేవింగ్ చేయకూడదు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు కోల్పోవాల్సి వస్తుంది.

పిండాలు పెట్టకూడదు 

పవిత్రమైన ఏకాదశి రోజున శార్ధ ఖర్మలు, తర్పణాలు వదలడం వంటి పనులు చేయకూడదు. అలాగే హవన్, వివాహాలు వంటివి జరిపేందుకు మంచి సమయం కాదు. 

పగలు నిద్రపోకూడదు

ఏకాదశి రోజు పగటిపూట పొరపాటున కూడా నిద్రపోకూడదు. అలాగే మోసం చేయడం, ఎదుటివారి మీద కోపం ప్రదర్శించడం, బాధ కలిగేలా మాట్లాడటం, హింసాత్మక పనులు చేయడం మంచిది కాదు. 

 

తదుపరి వ్యాసం