తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  ఏప్రిల్ 20, నేటి రాశి ఫలాలు.. వీరికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా అనుకూల ఫలితాలు

ఏప్రిల్ 20, నేటి రాశి ఫలాలు.. వీరికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా అనుకూల ఫలితాలు

HT Telugu Desk HT Telugu

20 April 2024, 0:01 IST

  • Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 20.04.2024 శనివారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

ఏప్రిల్ 20వ తేదీ నేటి రాశి ఫలాలు
ఏప్రిల్ 20వ తేదీ నేటి రాశి ఫలాలు (pixabay)

ఏప్రిల్ 20వ తేదీ నేటి రాశి ఫలాలు

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 20.04.2024

లేటెస్ట్ ఫోటోలు

Saturn transit: ఈ మూడు రాశులకు డబ్బు, ఆనందాన్ని ఇవ్వబోతున్న శని

May 15, 2024, 12:37 PM

Marriage life: ఈ రాశుల వారికి ఎప్పుడూ పెళ్లి, శృంగారం పట్ల ఆసక్తి ఎక్కువ

May 15, 2024, 10:52 AM

మే 15, రేపటి రాశి ఫలాలు.. మీ కుటుంబంలోకి వచ్చే కొత్త అతిథి వల్ల గొడవలు వస్తాయ్

May 14, 2024, 08:30 PM

Bad Luck Rasis: గురు భగవానుడి ఆగ్రహాన్ని ఎదుర్కోబోయే రాశులు ఇవే.. వీరికి బ్యాడ్ టైమ్ రాబోతుంది

May 14, 2024, 02:33 PM

Jupiter venus conjunction: వృషభ రాశిలో గురు శుక్ర కలయిక.. వీరి ప్రేమ జీవితం రొమాన్స్ తో నిండిపోతుంది

May 14, 2024, 10:30 AM

మే 19 నుంచి ఈ రాశుల వారి జీవితాల్లో భారీ మార్పులు.. ఉద్యోగంలో ప్రమోషన్​- ధన లాభం!

May 14, 2024, 09:35 AM

వారం: శనివారం, తిథి : శు.ద్వాదశి,

నక్ష్మత్రం : పుబ్బ, మాసం : చైత్రము

సంవత్సరం: శ్రీ క్రోధి నామ, అయనం: ఉత్తరాయణం

మేష రాశి

మేష రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరుగుతుంది. దూరప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. సంతానపరంగా కొన్ని చికాకులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారపరంగా అంత అనుకూలంగా లేదు. మరింత శుభఫలితాల కోసం నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. వేంకటేశ్వరస్వామిని పూజించడం, వేంకటేశ్వరస్వామి సుప్రభాతం వినడం, చదవడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. కుటుంబ సభ్యుల వలన మానసికంగా చికాకులు పెరుగుతాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు. నిరుద్యోగులకు అనుకూలంగా లేదు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా అనుకూలంగా లేదు. నవగ్రహ ఆలయ ప్రదక్షిణం చేయడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.

మిథున రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం మిథున రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. నూతన వ్యక్తులతో పరిచయాలు కలసి వస్తాయి. పాత రుణాలు తీరతాయి. ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యుల నుండి వ్యతిరేకత పెరుగుతుంది. వృత్తి ఉద్యోగపరంగా మధ్యస్థంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులు కష్టపడవలసిన సమయం. కుటుంబ సమస్యలు, పని ఒత్తిళ్ళు ఇబ్బందిపెట్టును. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. లింగాష్టకాన్ని పఠించండి.

కర్కాటక రాశి

కర్కాటకరాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా అనుకూల ఫలితాలున్నాయి. కుటుంబములో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. మీరు చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ముఖ్యమైన పనులలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికపరంగా అనుకూల సమయం. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. నవగ్రహ ఆలయాలలో శనికి తైలాభిషేకం చేయించి నవగ్రహలకు ప్రదక్షిణ చేయడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదు. ఉద్యోగస్తులకు పని ఒత్తిడులు, ఆటంకాలు ఏర్పడును. ప్రయాణాలు వాయిదావేస్తారు. ముఖ్యమైన విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సన్నిహితులతో వివాదాలు ఏర్పడతాయి. ఆర్థికపరంగా అనుకూలంగా లేదు. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. వేంకటేశ్వరస్వామిని పూజించడం, వేంకటేశ్వరస్వామి సుప్రభాతం వినడం చదవడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. స్థిరాస్తి వృద్ధి అగును. వ్యాపారస్తులకు లాభదాయకం. ఉద్యోగస్తులకు అధికారుల ప్రశంసలుంటాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. వివాహ ప్రయత్నాలు కలసివస్తాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. నవగ్రహ ఆలయ ప్రదక్షిణం చేయడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.

తులా రాశి

తులా రాశి వారికి ఈరోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు వింటారు. వాహనయోగముంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటంకాలు తొలగుతాయి. అన్ని విషయాలలో మీదే పై చేయి. నూతన కార్యక్రమాలు చేపడతారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వృధా ఖర్చులుంటాయి. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. లింగాష్టకాన్ని పఠించండి.

వృశ్చిక రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం వృశ్చిక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా అంత అనుకూలంగా లేదు. శ్రమ తప్ప ఫలితం ఉండదు. ఆస్తి వివాదాలుంటాయి. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. ఒప్పందాలలో ఆటంకాలేర్పడతాయి. ఆర్థిక ఇబ్బందులుంటాయి. కొత్త రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా సాగవు. బంధువర్గంలో గొడవలుంటాయి. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. నవగ్రహ ఆలయాలలో శనికి తైలాభిషేకం చేయించి నవగ్రహాలకు ప్రదక్షిణం చేయడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. బంధుమిత్రులతో అభిప్రాయ భేదాలు ఏర్పడతాయి. దూర ప్రయాణాలుంటాయి. వృథా ఖర్చులు ఇబ్బందిపెట్టును. ఆలయ దర్శనం చేస్తారు. పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో కొన్ని ఇబ్బందులుంటాయి. వ్యాపారస్తులకు ఒడిదుడుకులతో కూడియున్నటువంటి సమయం. వేంకటేశ్వరస్వామిని పూజించడం, వేంకటేశ్వరస్వామి సుప్రభాతం వినడం చదవడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

మకర రాశి

మకర రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. విందు, వినోదాల్లో పాల్గొంటారు. వాహనయోగముంది. ఆసక్తికర సమాచారం అందుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా అనుకూల సమయం. పరిస్థితులు అనుకూలిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. నవగ్రహ ఆలయ ప్రదక్షిణం చేయడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. సోదరులతో గొడవలుంటాయి. పనుల్లో ఆటంకాలు. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇంటా బయటా ఒత్తిడులుంటాయి. స్థిరాస్తి వృద్ధి. వ్యాపార, ఉద్యోగపరంగా చిక్కులు. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోరాదు. వాగ్వివాదాలకు దూరంగా ఉండాలి. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. లింగాష్టకాన్ని పఠించండి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. కొన్ని వ్యవహారాలలో అనుకున్న విధంగా పూర్తి చేయలేరు. రుణా ప్రయత్నాలు చేస్తారు. పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. సన్నిహితులతో అకారణంగా వివాదాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు ఒత్తిడులు పెరుగుతాయి. దైవదర్శనం చేసుకుంటారు. వ్యాపారస్తులకు సామాన్య లాభాలుంటాయి. వృత్తి ఉద్యోగాలో ఆలోచనలు నిలకడగా ఉండదు. సోదరుల నుంచి ధన సహాయం అందుతుంది. నవగ్రహ ఆలయంలో శనికి తైలాభిషేకం చేయించి నవగ్రహాలకు ప్రదక్షిణం చేయడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ : 9494981000

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
తదుపరి వ్యాసం