Tholi ekadashi 2024: తొలి ఏకాదశి ముహూర్తం, పూజా విధానం, పరిహారాలు, పఠించాల్సిన మంత్రాలు
16 July 2024, 16:09 IST
- Tholi ekadashi 2024: దేవశయని ఏకాదశి లేదా తొలి ఏకాదశి శుభ ముహూర్తం ఎప్పుడు. పూజా విధానం, పఠించాల్సిన మంత్రాలు ఏంటి? ఈ ఏకాదశి ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం.
దేవశయని ఏకాదశి శుభ ముహూర్తం
Tholi ekadashi 2024: ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో దేవశయని ఏకాదశి ఉపవాసం పాటిస్తారు. జులై 17వ తేదీ జరుపుకుంటారు. దీన్నే తొలి ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ ఏకాదశి నుండి విష్ణువు 4 నెలల పాటు యోగ నిద్రలోకి వెళతాడని, సృష్టి భారం శివుని భుజాలపై పడుతుందని నమ్ముతారు.
ఈ సంవత్సరం, దేవశయని ఏకాదశి రోజున జరిగే అద్భుతమైన పవిత్రమైన యాదృచ్చికం కారణంగా భక్తులు విష్ణువు ప్రత్యేక అనుగ్రహాన్ని పొందుతారు. విశ్వాసాల ప్రకారం తొలి ఏకాదశి రోజున ఉపవాసం పాటించడం ద్వారా వ్యక్తి అన్ని కోరికలు నెరవేరుతాయి. దేవశయని ఏకాదశి శుభ సమయం, పూజా విధానం, మంత్రం, నైవేద్యం, పరిహారాలు, ఉపవాస సమయం గురించి తెలుసుకుందాం-
తొలి ఏకాదశి ఎందుకు ప్రత్యేకం?
ఉదయ తిథి ఆధారంగా దేవశయని ఏకాదశి వ్రతం జూలై 17వ తేదీ బుధవారం నాడు ఆచరిస్తారు. జూలై 17న బ్రహ్మ ముహూర్తం నుంచి దేవశయని ఏకాదశి ఆరాధన చేయవచ్చు. ఈ రోజున ఉదయం నుండి సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడింది. ఈ సమయంలో ఏ పని చేసిన విజయవంతమవుతుంది.
దేవశయని ఏకాదశి రోజున సర్వార్థ సిద్ధి యోగం, అమృత సిద్ధి యోగం, శుభ యోగం, శుక్ల యోగం ఏర్పడతాయి. ఈ యోగాలన్నీ పూజలు, శుభకార్యాలకు నిర్వహించేందుకు మంచివిగా భావిస్తారు. ఉపవాసం రోజున అనూరాధ నక్షత్రం, పారణ రోజున జ్యేష్ఠ నక్షత్రం కూడా ఉన్నాయి.
దేవశయని ఏకాదశి శుభ సమయం
దేవశయని ఏకాదశి తిథి ప్రారంభం - జూలై 16, 2024 రాత్రి 08:33 గంటలకు
దేవశయని ఏకాదశి తేదీ ముగుస్తుంది - జూలై 17, 2024 రాత్రి 09:02 గంటలకు
జూలై 18న, పరానా (ఉపవాస విరమణ) సమయం - ఉదయం 05:35 నుండి 08:20 వరకు
పరాన్ తిథిలో ద్వాదశి ముగింపు సమయం - 08:44 PM
దేవశయని ఏకాదశి పూజా విధానం
బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం ఆచరించాలి. పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. శ్రీ హరివిష్ణువు జలాభిషేకం చేయండి. అనంతరం పంచామృతంతో పాటు గంగా జలంతో స్వామికి అభిషేకం చేయాలి. ఇప్పుడు పసుపు చందనం, పసుపు పుష్పాలను స్వామికి సమర్పించండి. దేవుడి ముందు నెయ్యి దీపం వెలిగించాలి.
ఏకాదశి ఉపవాసం ఆచరించడం అత్యంత పవిత్రం. తర్వాత దేవశయని ఏకాదశి కథ చదువుకోవాలి. “ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ” అనే మంత్రాన్ని జపించండి. విష్ణు సమేత లక్ష్మీదేవికి హారతి ఇచ్చి నైవేద్యం సమర్పించాలి. తులసి లేకుండా విష్ణుమూర్తికి నైవేద్యం సమర్పించకూడదు. అయితే ఏకాదశి రోజు తులసి ఆకులు మాత్రం పొరపాటున కూడ కోయకూడదు.
నైవేద్యంగా బెల్లం, పప్పు, ఎండు ద్రాక్ష, అరటి వంటివి సమర్పించవచ్చు. దేవశయని ఏకాదశి రోజున శ్రీ విష్ణు చాలీసా పఠించడం, అరటి చెట్టును పూజించడం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ ఉపవాసం పాటించిన వ్యక్తి మరణం అనంతరం మోక్షం పొందుతాడు. పాపాల నుంచి విముక్తి లభిస్తుంది.
జపించాల్సిన మంత్రాలు - ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం విష్ణవే నమః: