తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Sukraditya Rajayogam: 18 ఏళ్ల తర్వాత శుక్రాదిత్య యోగం.. ఈ మూడు రాశుల పంట పండినట్టే

Sukraditya rajayogam: 18 ఏళ్ల తర్వాత శుక్రాదిత్య యోగం.. ఈ మూడు రాశుల పంట పండినట్టే

Gunti Soundarya HT Telugu

13 April 2024, 10:20 IST

    • Sukraditya rajayogam: సూర్యుడు నేడు మేష రాశిలోకి ప్రవేశించాడు. మరికొద్ది రోజుల్లో శుక్రుడు కూడా ఇదే రాశిలో ప్రవేశించబోతున్నాడు. ఫలితంగా శుక్ర, సూర్య కలయిక జరుగుతుంది. 
శుక్రాదిత్య రాజయోగం
శుక్రాదిత్య రాజయోగం

శుక్రాదిత్య రాజయోగం

Sukraditya rajayogam: వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలన్నీ నిర్ణీత విరామం తర్వాత రాశి చక్రాన్ని మార్చుకుంటూ ఉంటాయి. ఇది మొత్తం పన్నెండు రాశులపై సానుకూల, ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. ఏప్రిల్ 13న గ్రహాల రాజుగా పరిగణించే సూర్యుడు మేష రాశిలోకి ప్రవేశించాడు.

లేటెస్ట్ ఫోటోలు

Marriage life: ఈ రాశుల వారికి ఎప్పుడూ పెళ్లి, శృంగారం పట్ల ఆసక్తి ఎక్కువ

May 15, 2024, 10:52 AM

మే 15, రేపటి రాశి ఫలాలు.. మీ కుటుంబంలోకి వచ్చే కొత్త అతిథి వల్ల గొడవలు వస్తాయ్

May 14, 2024, 08:30 PM

Bad Luck Rasis: గురు భగవానుడి ఆగ్రహాన్ని ఎదుర్కోబోయే రాశులు ఇవే.. వీరికి బ్యాడ్ టైమ్ రాబోతుంది

May 14, 2024, 02:33 PM

Jupiter venus conjunction: వృషభ రాశిలో గురు శుక్ర కలయిక.. వీరి ప్రేమ జీవితం రొమాన్స్ తో నిండిపోతుంది

May 14, 2024, 10:30 AM

మే 19 నుంచి ఈ రాశుల వారి జీవితాల్లో భారీ మార్పులు.. ఉద్యోగంలో ప్రమోషన్​- ధన లాభం!

May 14, 2024, 09:35 AM

మే 14, రేపటి రాశి ఫలాలు.. రేపు శత్రువుల నుంచి వీరికి ఆర్థిక లాభాలు

May 13, 2024, 08:09 PM

మీన రాశి నుంచి సూర్యుడి రాశి మార్పు వల్ల ఖర్మల కాలం కూడా ముగిసింది. ఈ నెల మొత్తం సూర్యుడు ఇదే రాశిలో సంచరిస్తాడు. అయితే ఇదే నెలలో సంపదకు కారకుడైన శుక్రుడు కూడా మేష రాశిలో సంచరించబోతున్నాడు. ప్రస్తుతం మీన రాశిలో సంచరిస్తున్న శుక్రుడు ఏప్రిల్ 24న మేష రాశి ప్రవేశం చేస్తాడు.

సుమారు 18 సంవత్సరాల తర్వాత సూర్య, శుక్ర గ్రహాల కలయిక వల్ల రాజయోగం ఏర్పడుతుంది. ఇవి రెండూ కలిసి శుక్రాదిత్య రాజయోగాన్ని ఏర్పరుస్తాయి. దీనివల్ల ప్రతి రంగంలో ఆశించిన విజయాలు పొందగలుగుతారు. జాతకంలో శుక్రాదిత్య రాజయోగం ఉంటే వృత్తిలో అనేక మార్పులు వస్తాయి. డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. జీవితంలోని ప్రతి రంగంలో అదృష్టం జాతకులకు అనుకూలంగా ఉంటుంది. మేషరాశిలో సూర్యుడు, శుక్రుడి కలయిక వల్ల కొన్ని రాశుల వారికి చాలా శుభ ఫలితాలు ఇస్తుంది. వీరికి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉంటుంది.

మేష రాశి

మేష రాశిలో శుక్రాదిత్య రాజయోగం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశిలోనే సూర్య, శుక్ర కలయిక ఉంటుంది. ఫలితంగా ఉద్యోగ, వ్యాపారాలలో పురోగతికి అనేక సువర్ణ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి పుంజుకుంటుంది. ఆత్మవిశ్వాసంతో జీవితంలో కొత్త సవాళ్లను స్వీకరిస్తారు. ఉద్యోగస్తులకు పదోన్నతి వచ్చే అవకాశాలు పెరుగుతాయి. కొత్త జాబ్ ఆఫర్ కూడా లభిస్తుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఇంటి వాతావరణం సుఖశాంతులతో ఆహ్లాదకరంగా మారిపోతుంది. మీ లవర్ తో డేటింగ్ కి కూడా వెళ్తారు. ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త మార్గాలు అనుసరిస్తారు.

కన్యా రాశి

సూర్యుడు, శుక్రుడి కలయిక కన్యా రాశి వారికి మేలు చేస్తుంది. ఈ సమయంలో కన్యా రాశి వారికి సమాజంలో గౌరవం పెరుగుతుంది. కెరీర్లో ఆశించిన విజయాన్ని అందుకుంటారు. శుభకార్యాలు జరుపుకుంటారు. ప్రేమ సంబంధాలు దృఢంగా ఉంటాయి. ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. ధన ప్రవాహానికి కొత్త మార్గాలు సుగమం అవుతాయి. విద్యార్థులకు పరీక్షల్లో మంచి మార్కులు వస్తాయి.

తులా రాశి

శుక్రాదిత్య రాజయోగం తులా రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. జీవితంలో ఎన్నో సానుకూల మార్పులు వస్తాయి. వైవాహిక జీవితంలోని సమస్యలు తొలగిపోతాయి. వ్యాపారం విస్తరించుకుంటారు. డబ్బు సంపాదించడానికి అనేక కొత్త అవకాశాలు లభిస్తాయి. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేసుకుంటారు. బకాయి పడిన డబ్బులు తిరిగి చెల్లించుకోగలరు. జీవితాన్ని భౌతిక సౌకర్యాలతో ఆనందంగా గడుపుతారు.

మిథున రాశి

శుక్రుడి కదలిక మిథున రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. పని ప్రాంతంలో పెట్టుబడులు పెట్టేందుకు మంచిగా ఒప్పందం మీ దగ్గరికి వస్తుంది. ఇది లాభదాయకంగా ఉంటుంది.

 

తదుపరి వ్యాసం