తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  శని శశ రాజయోగం.. మూడు రాశులకు ఆకస్మిక ధన లాభం

శని శశ రాజయోగం.. మూడు రాశులకు ఆకస్మిక ధన లాభం

HT Telugu Desk HT Telugu

13 June 2023, 10:37 IST

google News
    • శని శశ రాజయోగం కారణంగా మూడు రాశులకు ఆకస్మిక ధన లాభం, పదోన్నతులు లభించనున్నాయి.
శని శశి రాజయోగం
శని శశి రాజయోగం

శని శశి రాజయోగం

జ్యోతిష శాస్త్రంలో శని దేవుడికి ప్రత్యేక స్థానం ఉంది. కర్మ ఫల ప్రదాత, న్యాయ దేవత శని జూన్ 17న కుంభ రాశిలో తిరోగమనంలో పయనించనున్నాడు. శని వక్రగమనం కారణంగా పలు రాశుల జాతకులకు ప్రయోజనం కలుగుతుంది. ముఖ్యంగా ఈ పరిణామం ఏర్పరిచే శశ రాజయోగం, ధన రాజయోగం 2 రాశులకు అమితమైన సంతోషాన్ని ఇస్తుంది.

శని తిరోగమనం జూన్ 17న రాత్రి 10.48 గంటలకు సంభవించనుంది. వైదిక జ్యోతిష శాస్త్రం ప్రకారం శని మిథున రాశి తొమ్మిదో ఇంట్లో తిరోగమనం చెందడం వల్ల ధన రాజయోగం, శశ రాజయోగం ఏర్పడనున్నాయి. వీటి ప్రభావం వల్ల మూడు రాశులకు మేలు జరగనుంది.

మిథున రాశి

మిథున రాశి జాతకులకు వేతన పెంపు ఉంటుంది. పదోన్నతులు లభిస్తాయి. వ్యాపారస్తులకు ఆదాయంలో భారీ పెరుగుదల కనిపిస్తుంది. వ్యాపారం నుంచి లాభాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణకు అవకాశం కలుగుతుంది.

సింహ రాశి

సింహ రాశి ఏడో ఇంట్లో శని తిరోగమనం వల్ల ధన రాజయోగం, శశ రాజయోగం ఏర్పడుతున్నాయి. దీని ఫలింగా సింహ రాశి జాతకులకు ఆదాయ మార్గాలు పెరుగుతున్నాయి. ఉద్యోగస్తులకు ఆదాయం పెరగనుంది. సొంత వ్యాపారం చేసే వారికి లాభాలు పెరుగుతాయి. విజయాలు సొంతమవుతాయి. ఆకస్మిక నగదు ప్రోత్సాహకాలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. మీ వ్యక్తిత్వం అందరినీ ఆకట్టుకుంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

మకర రాశి

మకర రాశిలో శని తిరోగమనం కారణంగా మకర రాశి వారికి మేలు జరుగుతుంది. ధన రాజయోగం, శశ రాజయోగం వల్ల ఊహించని ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి. వేతన పెంపుతో కూడిన పదోన్నతి లభించవచ్చు. వృత్తిపరంగా ఉన్నత స్థానాలు అందుకుంటారు. స్వయం ఉపాధి పొందుతున్న వారికి అనూహ్య లాభాలు వస్తాయి. వ్యాపారం విస్తరిస్తుంది.

తదుపరి వ్యాసం