Laxmi harathi songs: లక్ష్మీ దేవి మంగళ హారతి పాటల లిరిక్స్.. సింపుల్ సినిమా పాటల స్టైల్‌లో ఎవరైనా పాడేయొచ్చు
15 August 2024, 15:00 IST
Laxmi harathi songs: వరలక్ష్మీ వ్రతం రోజున దేవీ పూజ మంగళ హారతి లేనిదే పూర్తి కాదు. అందరికీ పాటలు పాడటం రావాలని లేదు కానీ, ప్రతి ఒక్కరు సులువుగా పాడగలిగే పాటలు కూడా ఉంటాయి. మన నోట్లో బాగా నానిన సినిమా పాటల స్టైల్‌లో ఉండే ఈ హారతి పాటలను చూడండి. స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నారంటే పూజలో పాడేయొచ్చు.
లక్ష్మీ హారతి పాటలు
శ్రావణ మాసంలో అతి ముఖ్యమైన పూజల్లో వరలక్ష్మి పూజ కూడా ఒకటి. ఈ పూజకు ప్రత్యేక విశిష్టత ఉంది. మహిళలంతా భక్తి శ్రద్ధలతో చేసుకునే ఈ పూజ మంగళ హారతులు లేనిదే పూర్తవ్వదు. చాలా సింపుల్ రాగంతో ఎవరైనా పాడగలిగే కొన్ని లక్ష్మీదేవి హారతి పాటలు చూడండి. ఈ లిరిక్స స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుంటే రేపు పూజలో పాడేయొచ్చు.
1. ఎట్లా నిన్నెత్తుకొందు పాట..
పల్లవి :
ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా వరలక్ష్మీ తల్లి
ఎట్లా నిన్నెత్తుకొందు ఆట్లాడే బాలవు నీవు
ఇట్లా రమ్మనుచు పిలిచి కోట్లా ధనమిచ్చేవమ్మా
ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా వరలక్ష్మీ తల్లి
ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా
చరణం :
పసి బాలవైతే ఎత్తుకొందు వరలక్ష్మి తల్లి పసిడి బుగ్గల పాలవెల్లి
పూవులు పండ్లు తోరణములతో పాలవెల్లి కట్టిన వేదికపై
కాలి అందియలు ఘల్లు ఘల్లు మన కలహంస నడకలతో రావమ్మా
ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా వరలక్ష్మీ తల్లి
ఎట్లా నిన్నెత్తుకొందుమ్మా
వేయి నామాల కల్పవల్లి వేయి మారు మాపై కరుణించి సాయము ఉండుము తల్లి
సామ్రాజ్య జనని మాపై వేమారు కరుణ కల్గి
ఆయుర్ వృద్ధి అష్టైశ్వర్యము సుఖము సంపదలిచ్చె తల్లి
ఆయుర్ వృద్ది అష్టైశ్వర్యము ఐదవతనములిచ్చే తల్లి
ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా వరలక్ష్మీ తల్లి
ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా
నవరత్నాలు నీ నగుమోమే తల్లి వరలక్ష్మీ కనకరాశులు కళ్యాణి
కుసుమ కోమల సౌందర్యరాశి లోకపావని శ్రీ వరలక్ష్మి
శ్రావణ పూర్ణిమ పూర్వార్ధ శుక్రవారము జగతిలో వెలిగే తల్లి
ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా వరలక్ష్మీ తల్లి
ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా
ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా
2. శ్రీలక్ష్మీ జయలక్ష్మీ
పెళ్లి పుస్తకం సినిమాలోని “శ్రీరస్తు.. శుభమస్తు..” పాట గుర్తే ఉండుంటుందిగా.. అచ్చం అదే స్టైల్‌లో ఈ హారతి పాట పాడేయొచ్చు.
పల్లవి: శ్రీలక్ష్మీ… జయలక్ష్మీ.. శ్రీలక్ష్మీ.. జయలక్ష్మీ
సిరులిచ్చే శ్రీలక్ష్మికి నీరాజనం, వరమిచ్చె వరలక్ష్మికి మా వందనం
చరణం:
గుడినిండా దీపాలు నీకు పెట్టినా, మెడనిండా పూదండలు నీకు వేసినా
నీకు హారతిచ్చినా నిలువెల్లా మ్రొక్కెద
నీపాద సన్నిదులే నిత్య సిరిసంపదలు
చరణం:
తలనిండా పూలుపెట్టి బొట్టుపెట్టినా చేయినిండ గాజు లేసి గజ్జకట్టినా
పట్టుచీర కట్టినా పగడాలు పెట్టినా
ముదము గొలుపు నీమోమే మెరిసేటీతారలు
చరణం:
అడుగడుగున మాకండగ నువ్వు ఉండనే
తప్పైన, ఒప్పైన మమ్ము కానవే
జగములోని వైభోగం నీరూపములో నిండి..
నీ దివ్య హారతులే గైకొనగ రావే
3. వరలక్ష్మీదేవి.. దీవించవమ్మ:
నువ్వు లేక నేను లేను సినిమాలో “నిండు గోదారి కదా ఈ ప్రేమ..” పాట స్టైల్‌లో సాగే ఈ పాట వినసొంపుగా ఉంటుంది. సులువుగానూ పాడేయొచ్చు. లిరిక్స్ చూసేయండి.
పల్లవి: వరలక్ష్మీదేవి.. దీవించవమ్మ
మా ఇంట కొలువుండవే ..
శ్రావణమొచ్చెను వ్రతములనిచ్చెను
శ్రీ లక్ష్మి కలశంతో నిండుగా..
చరణం:
పట్టం అంచు చీరలతో, ఎదనిండా దండలతో
ఎన్నెన్నో హంగులతో నిన్ను పూజించి, గాజులు వేసి గంధము పూసి...
దీపాలేన్నో ధూపాలేన్నో…
తాంబూల ఫలములనే నీకర్పించి
మనసారా నీకు నైవేద్యముంచి
వరలక్ష్మి నిన్ను ఘనముగ పూజించి
నిను వేడినాము కరుణించవమ్మా
చరణం:
శ్రీ విష్ణు హృదయమున వెలసిన శ్రీ మహాలక్ష్మీ
రావమ్మా జయలక్ష్మి మా ధనలక్ష్మి
నీ పూజలతో పులకించితిమి నీ రూపమునే యద నింపితిమి
కుంకుమతో అష్టోత్తర అర్చన చేసి హారతులే ఇచ్చి నిలువెల్ల కొలచి..
పిలిచాము తల్లి శ్రీలక్ష్మి రావే..
కాపాడమ్మా మా తల్లి నీవై