తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Shubha Raja Yogam: శతాబ్దం తర్వాత మే నెలలో ఒకేసారి రెండు రాజయోగాలు.. ఈ రాశుల వారికి వరాల జల్లు

Shubha raja yogam: శతాబ్దం తర్వాత మే నెలలో ఒకేసారి రెండు రాజయోగాలు.. ఈ రాశుల వారికి వరాల జల్లు

Gunti Soundarya HT Telugu

03 May 2024, 19:12 IST

google News
    • Shubha raja yogam: శతాబ్దం తర్వాత మే నెలలో రెండు శుభకరమైన రాజ యోగాలు ఏర్పడుతున్నాయి. వీటి ప్రభావంతో కొన్ని రాశుల వారికి విపరీతమైన లాభాలు కలుగుతాయి. 
మే నెలలో ఒకేసారి రెండు రాజయోగాలు
మే నెలలో ఒకేసారి రెండు రాజయోగాలు (stock photo)

మే నెలలో ఒకేసారి రెండు రాజయోగాలు

Shubha rajayogam: అన్ని గ్రహాలు నిర్దిష్ట విరామం తర్వాత తమ రాశి చక్రాన్ని మార్చుకుంటాయి. ఈ గ్రహాల సంచారం పన్నెండు రాశుల మీద ప్రభావం చూపిస్తుంది. 2024 మే నెలలో రెండు శుభయోగాలు ఏర్పడనున్నాయి. వాటి వల్ల మూడు రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి.

సుమారు శతాబ్దం తర్వాత మేష రాశిలో రెండు అద్భుతమైన రాజయోగాలు ఏర్పడుతున్నాయి. కుంభరాశిలో శని సంచరించడం వల్ల శశ రాజయోగం  ఏర్పడుతుంది. అలాగే వృషభ రాశిలో బృహస్పతి ప్రవేశం వల్ల గజకేసరి యోగం ఏర్పడుతుంది. ఈ రెండు యోగాలు కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని, ఆనందాన్ని ఇస్తాయి. 

గజకేసరి యోగం అంటే ఏంటి?

బృహస్పతి, చంద్రుడితో కలిసి కేంద్ర స్థానంలో ఉంటే ఈ యోగం ఏర్పడుతుంది.  అంటే మొదటి, నాలుగు, ఏడు, పదో ఇంట్లో బృహస్పతి, చంద్రుడు కలిసి ఉంటే గజకేసరి యోగం ఏర్పడుతుంది. ఈ రెండు గ్రహాలు ఉచ్చమైన స్థితిలో ఉంటేనే శుభ ఫలితాలు కలుగుతాయి. గజకేసరి యోగం ఒక వ్యక్తిని మేధావిగా చేస్తుంది. సమాజంలో ప్రతిష్ట, గౌరవం పెరుగుతాయి. జీవితంలో ఆపారమైన విజయాన్ని పొందుతారు. 

శశ రాజయోగం అంటే ఏంటి?

వైదిక జ్యోతిష్య శాస్త్రంలో శని అత్యంత శక్తివంతమైన, పవిత్రమైన గ్రహాలలో ఒకటిగా పరిగణిస్తారు. తరచుగా శనిని అశుభ గ్రహంగా పరిగణిస్తారు. కానీ నిజానికి శని దేవుడు ఎప్పుడు ప్రతికూల ప్రభావాలను అందించడం మాత్రమే కాదు శుభ ఫలితాలు ఇస్తాడు. 2025 వరకు శని కుంభ రాశిలోనే సంచరిస్తాడు. ఫలితంగా శశ మహాపురుష రాజయోగం ఏర్పడుతుంది.  ఈ రాజయోగం ఐదు మహారాజ యోగాలలో ఒకటి. ఇది అత్యంత శక్తివంతమైన పవిత్రమైన యోగం. 

అంగారకుడు, బృహస్పతి, శుక్రుడు లేదా శని తన సొంత రాశిలో ప్రవేశించినప్పుడు లేదా లగ్న గృహం లేదా ఉన్నప్పుడు ఇలాంటి యోగాలు ఏర్పడతాయి. దీని ప్రభావంతో ఒక వ్యక్తి తెలివితేటలు, ధైర్యం మెరుగుపడతాయి. నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. ఆరోగ్యం బాగుంటుంది. జీవితం అభివృద్ధి చెందుతుంది. వృత్తిలో అద్భుతమైన విజయాలు చేరుకుంటారు. ఈ ఏడాది మొత్తం శశ యోగం ఉంటుంది. 

జాతకంలో శశ రాజయోగం ఉన్న వ్యక్తులు సమాజంలో గౌరవాన్ని పొందుతారు. వృత్తిపరమైన జీవితంపై సానుకూల ప్రభావం చూపుతుంది. నిర్దేశించిన లక్ష్యాలను చేరుకుంటారు. ఈ రెండు రాజయోగాల వల్ల ఏయే రాశుల వారికి అదృష్టం కలుగుతుందో తెలుసుకుందాం. 

వృషభ రాశి

శశ రాజయోగం వృషభ రాశి వారికి చాలా మేలు చేస్తుంది. కర్మ గృహంలో శశ రాజ యోగం, లగ్న గృహంలో గజకేసరి యోగం ఏర్పడతాయి. ఈ సమయంలో వృత్తికి సంబంధించి విజయవంతమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. రెండింటి  ప్రభావంతో ఈ రాశి వారి వ్యక్తిత్వం మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక స్థితి బలపడుతుంది. భాగస్వాముల మధ్య సరైన సమన్వయంతో వ్యాపారం లాభాల బాట పడుతుంది. వివాహితులకు కాలం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు ఆశించిన ఫలితాలు పొందుతారు. ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం కూడా సానుకూలంగా ఉంటుంది. 

మకర రాశి

మకర రాశి వారికి ధన గృహంలో శశ యోగం ఏర్పడుతుంది. ఈ శుభ యోగం వల్ల ఆకస్మికంగా ఆర్థిక లాభాలు పొందుతారు. సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతుల కోరిక నెరవేరుతుంది. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఈ రాజయోగం వల్ల జీవిత భాగస్వామితో సంబంధం మెరుగుపడుతుంది. ఇద్దరి మధ్య అవగాహన ఉంటుంది. వ్యాపార ప్రణాళికలు అన్నీ విజయవంతంగా నెరవేర్చగలుగుతారు.

కుంభ రాశి

కుంభ రాశి లగ్న గృహంలోని శశ రాజ యోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో వ్యాపారవేత్తలకు అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఈ యోగం ప్రభావంతో అత్యధిక లాభాలు పొందుతారు. కొత్త ప్రణాళికలు రూపొందించి వాటిని అమలుపరిచేందుకు ఇది మంచి సమయం. వస్తు సౌఖ్యం కూడా పెరుగుతుంది. కొత్తగా ఆస్తి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది.  మీ వ్యూహాలను అమలుపరిచేందుకు ఇది మంచి సమయం. కొత్తగా ఆస్తి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఆదాయ వనరులు పెరగడంతో ఆర్థికంగా పుంజుకుంటారు.

 

 

తదుపరి వ్యాసం