తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Makara Jyothi 2024 : శబరిమల మకరజ్యోతి దర్శన సమయం ఎప్పుడు? వివరాలు ఇలా?

Makara Jyothi 2024 : శబరిమల మకరజ్యోతి దర్శన సమయం ఎప్పుడు? వివరాలు ఇలా?

14 January 2024, 20:07 IST

google News
    • Makara Jyothi 2024 : శబరిమల మకరజ్యోతి దర్శనం రేపు సాయంత్రం 6.30 నుంచి 7.00 గంటల మధ్య ఉంటుంది ఆలయ బోర్డు ప్రకటించింది. భక్తుల కోసం ప్రత్యేకంగా వ్యూ పాయింట్లు ఏర్పాటు చేసింది. టీవీలలో లైవ్ ప్రసారాలు కూడా చేయనున్నట్లు తెలిపింది.
శబరిమల మకరజ్యోతి
శబరిమల మకరజ్యోతి

శబరిమల మకరజ్యోతి

Makara Jyothi 2024 : శబరిమల మకరజ్యోతి లేదా మకరవిళక్కు ప్రతి ఏడాది మకర సంక్రాంతి రోజున...శబరిమల ఆలయంలో నిర్వహించే కార్యక్రమం. మకర సంక్రాంతి నాడు ఈ జ్యోతి దర్శనం ఇస్తుంది కాబట్టి శబరిమల మకరవిళక్కు లేదా శబరిమల మకర జ్యోతి అని పిలుస్తుంటారు. మకరజ్యోతి దర్శనానికి లక్షలాది మంది భక్తులు శబరిమల ఆలయానికి వస్తుంటారు. జ్యోతి దర్శనం కోసం అయ్యప్పస్వామి భక్తులు పోటెత్తుతారు. దీంతో శబరిమల మకరజ్యోతి సమయంలో రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే జ్యోతి దర్శనానికి వచ్చే భక్తులు తమ దర్శనాన్ని సరిగ్గా ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే శబరిమల మకరజ్యోతి ఘట్టం 2-3 నిమిషాల పాటు నిర్వహించే కార్యక్రమం. శబరిమల కొండపై శబరిమల మకరజ్యోతి దర్శనం రోజున యాత్రికుల ఆలయ నిర్వాహకులు మూడుసార్లు మాత్రమే దీపాలు వెలిగిస్తారు. ఆ సమయంలో మాత్రమే జ్యోతి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది.

శబరిమల మకరజ్యోతి దర్శన తేదీ, సమయం ఎప్పుడంటే?

జనవరి 15వ తేదీ సంక్రాంతి పండుగ నాడు శబరిమల మకరజ్యోతిని భక్తులు దర్శించుకోవచ్చు. శబరిమల మకరజ్యోతి దర్శన సమయం సోమవారం(జనవరి 15) సాయంత్రం 6.30 నుంచి 07.00 గంటల మధ్య ఉంటుందని ఆలయ బోర్డు తెలిపింది. శబరిమల మకరవిళక్కు... శబరిమల ఆలయ బోర్డు నిర్వహించబడే ఒక కార్యక్రమం, భక్తులు శబరిమల ఆలయం నుంచి నేరుగా శబరిమల మకరజ్యోతిని వీక్షించవచ్చు. మకర జ్యోతి వీక్షించేందుకు భక్తుల కోసం ఆలయ అధికారులు వివిధ వ్యూ పాయింట్‌లను ఏర్పాటు చేశారు. భక్తులు శబరిమల మకరవిళక్కును టీవీలలో వీక్షించేందుకు లైవ్ కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తారు. అయితే జ్యోతి దర్శనానికి వచ్చే భక్తులు ఆన్ లైన్ ముందస్తుగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఆన్ లైన్ బుకింగ్ తప్పనిసరి

భక్తులు కనీసం 3-4 నెలల ముందు మకరజ్యోతి దర్శనం కోసం బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. భక్తుల రద్దీ కారణంగా బుకింగ్ కూడా కష్టంగా ఉంటుంది. శబరిమల మకరజ్యోతి కార్యక్రమం ఒక్కరోజు మాత్రమే నిర్వహిస్తారు. అయ్యప్ప భక్తులు ఆ రోజు శబరిమల ఆలయంలో నేరుగా మాల సమర్పించేందుకు అవకాశం ఉంటుంది.

తదుపరి వ్యాసం