తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Rahu Transit: కుంభ రాశిలోకి రాహువు.. 2026 నాటికి ఈ రాశుల వారి సంపద రెట్టింపు అవుతుంది

Rahu transit: కుంభ రాశిలోకి రాహువు.. 2026 నాటికి ఈ రాశుల వారి సంపద రెట్టింపు అవుతుంది

Gunti Soundarya HT Telugu

08 August 2024, 6:57 IST

google News
    • Rahu transit: రాహువు ప్రస్తుతం బృహస్పతి మీనరాశిలో కూర్చున్నాడు. రాహువు త్వరలో శని రాశిలో సంచరిస్తాడు. రాహువు మారడం వల్ల కొన్ని రాశుల అదృష్టం బంగారంలా మెరిసిపోనుంది.
కుంభ రాశిలోకి రాహువు
కుంభ రాశిలోకి రాహువు

కుంభ రాశిలోకి రాహువు

Rahu transit: రాహువు ఒక అంతుచిక్కని గ్రహం. నవగ్రహాలకు సొంత రాశి ఉన్నప్పటికీ రాహు, కేతువులకు మాత్రం లేదు. ఏ రాశిలో ఉంటే దాని మీద ఆధిపత్యం చూపిస్తుంది. న్యాయదేవుడు శని మాదిరిగానే రాహువు కూడా నెమ్మదిగా కదిలే గ్రహం. అందుకే రాహువు రాశిని మార్చుకునేందుకు పద్దెనిమిది నెలలు సమయం పడుతుంది.

గత సంవత్సరం 2023లో రాహువు మీన రాశిలో ప్రవేశించాడు. దీని పాలక గ్రహం బృహస్పతి. ఈ సంవత్సరం రాహువు రాశిని మార్చలేదు కానీ నక్షత్రాన్ని మారుస్తూ ప్రభావాన్ని చూపించాయి. రాహు గ్రహం ఎప్పుడూ వ్యతిరేక దిశలో కదులుతుంది. అదే సమయంలో రాహువు వచ్చే ఏడాది 2025లో రాశిని మార్చబోతున్నాడు.

మే 18 న రాహువు శని దేవుడికి చెందిన కుంభ రాశిలోకి తిరోగమన దశలోనే ప్రవేశిస్తాడు. రాహువు 2026 వరకు శని కుంభ రాశిలో ఉండబోతున్నాడు. దీని వల్ల రాహు దృష్టితో పాటు శని చూపు కూడా కొన్ని రాశుల మీద పడుతుంది. అటువంటి పరిస్థితిలో రాహువు ఈ సంచారము వలన 3 రాశుల అదృష్టం మారుతుంది. 2026 నాటికి కుంభ రాశిలో రాహు సంచారం ద్వారా ఏ రాశుల వారు ధనవంతులు కాబోతున్నారో తెలుసుకుందాం.

మేష రాశి

శని రాశిలో రాహువు సంచరించడం వల్ల మేష రాశి వారికి శుభాలు కలుగుతాయి. వ్యాపార పరిస్థితి బలంగా ఉంటుంది. అదే సమయంలో వ్యాపారస్తులు మంచి ఒప్పందం కూడా చేసుకుంటారు. విద్యార్థులకు ఇది శుభ సమయంగా పరిగణిస్తారు. అదే సమయంలో డబ్బు వచ్చే అవకాశం కూడా ఉంది. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.

కుంభ రాశి

కుంభ రాశికి అధిపతి శని. రాహువు ప్రవేశం కూడా ఇదే రాశిలో జరుగుతుంది. అందువల్ల రాహు సంచారం కుంభ రాశి వారికి శుభప్రదంగా ఉండబోతుంది. జీవితంలో వచ్చే అడ్డంకులు తొలగిపోతాయి. మీరు కుటుంబ సభ్యుల నుండి పూర్తి మద్దతు పొందుతారు. మీరు మీ భాగస్వామితో ప్రశాంతమైన క్షణాలను గడుపుతారు. ఆరోగ్యం బాగానే కనిపిస్తుంది. అదే సమయంలో మీరు సుదీర్ఘ ప్రయాణానికి ప్లాన్ చేసుకోవచ్చు. 2026 వరకు ఈ రాశి వారికి సంపదకు ఎటువంటి లోటు ఉండదు.

మకర రాశి

కుంభ రాశిలోకి రాహువు సంచారం మకర రాశి వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రాహువు రాశిని మార్చిన తరువాత మీరు విజయం సాధించడానికి కష్టపడాల్సిన అవసరం లేదు. అన్నీ అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. మీరు వ్యాపారానికి సంబంధించిన కొన్ని శుభవార్తలను కూడా అందుకుంటారు. కుటుంబంలో సంతోషం, శాంతి వాతావరణం నెలకొంటుంది. ఆర్థికంగా లాభపడే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు పాత స్నేహితుడిని కలుసుకుంటారు. వారితో అనేక జ్ఞాపకాలను పంచుకుంటూ ఆనందంగా జీవిస్తారు.

నిరాకరణ: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వివరణాత్మక మరియు మరింత సమాచారం కోసం, దయచేసి సంబంధిత రంగంలో నిపుణుడిని సంప్రదించండి.

తదుపరి వ్యాసం