Hanuman Puja : ఇలా హనుమంతుడిని పూజించడి.. మీ కష్టాలు పోతాయి!
21 February 2023, 13:46 IST
- Hanuman puja Details : హనుమంతుడిని పూజిస్తే.. కష్టాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. అందుకోసమే.. భక్తులు రామ భక్తుడి ప్రసన్నం చేసుకునేందుకు పూజలు చేస్తుంటారు. అయితే హనుమంతుడి పూజ చేసేప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
హనుమాన్ పూజ
హనుమంతుని పూజ చేస్తే.. అన్ని కష్టాలు తొలగిపోతాయి. కష్టాలు తొలగిపోవడానికి హనుమంతుని ఆరాధన చాలా ప్రత్యేకమైనదిగా పరిగణిస్తారు. ఆంజనేయుడిని స్మరించుకోవడం ద్వారా అన్ని వ్యాధులు, దోషాలు ముగుస్తాయి. కొన్ని నమ్మకాల ప్రకారం, జ్యోతిషశాస్త్రంలో అనేక సమస్యలను పరిష్కరించడానికి సుందరకాండ ఉపయోగపడుతుంది. సుందరకాండ పారాయణం హనుమాన్ ఆరాధనలో చాలా సానుకూల ఫలితాలను ఇస్తుందని తెలుసుకోండి.
అనేక సమస్యలను పరిష్కరించడానికి ఇది ఏకైక ఖచ్చితమైన మార్గంగా వర్ణించారు పూర్వీకులు. సాంప్రదాయ విశ్వాసాల ప్రకారం సుందరకాండను పఠించడం ద్వారా ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. గ్రంథాల ప్రకారం ఆంజనేయుడు ఈ పారాయణంతో త్వరగా సంతోషిస్తాడు. సుందరకాండ పారాయణం ద్వారా శుభ ఫలితాలు లభిస్తాయి.
ప్రతి శని, మంగళవారాల్లో సుందరకాండను పూర్తి భక్తితో పఠిస్తే, శని, కుజుడు మరియు రాహు-కేతువుల వంటి దుష్ప్రభావాల నుండి భక్తుడు రక్షించబడతారు. నిత్యం సుందరకాండ పఠించే భక్తులకు తమ జీవితాల్లో ఏ కొరతా ఉండదు. వారి దురదృష్టం శాశ్వతంగా పోతుంది. అఖండ లక్ష్మి ఇంటికి చేరుకుంటుంది. శత్రువులు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడితే, మీరు సుందరకాండను పఠించాలి. దీని కారణంగా, శత్రువులు సోమరితనం, నిరాశ చెందుతారు.
పూజా స్థలంలో లేదా ఆలయంలో హనుమంతుని విగ్రహం లేదా చిత్రం ముందు ఆసనంలో కూర్చుని వినాయకుడిని పూజించిన తర్వాత, రాముడిని పూజించాలి. దీని తరువాత హనుమంతుని పూజించండి. దేవతలందరికీ పూలు, దండలు, ప్రసాదాలు సమర్పించాలి. సుందరకాండను లయబద్ధంగా పఠించండి. చివరలో ప్రసాదం పంచాలి. ఈ విధంగా పారాయణం చేయడం ద్వారా, అన్ని కష్టాల నుండి విముక్తి పొందుతాడు. సుందరకాండ పారాయణ క్రమం తప్పకుండా చేయాలి. లేదా శనివారం, మంగళవారం చేయాలి. దీని ద్వారా అన్ని రకాల బాధలు ముగుస్తాయని భక్తుల నమ్మకం.
హనుమాన్ ఆరాధన సమయంలో మీరు పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి. హనుమంతుడిని పూజించే ప్రదేశం శుభ్రంగా ఉంచుకోవాలి. పూజలో ఎరుపు రంగును ఉపయోగించాలి. పూజ చేసేప్పుడు కూడా మీరు ఎరుపు రంగు దుస్తులు ధరిస్తే మంచిది. హనుమంతుడిని పూజించే ముందు రోజు నుంచి మీరు బ్రహ్మచర్యం పాటించాలి. నిర్మలమైన మనసుతో ఉండాలి. మాంసం, మద్యం తీసుకోవద్దు. మసాలాల జోలికి కూడా పోవద్దు.
టాపిక్