తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Navaratri 6th Day 2023: నవరాత్రులలో ఆరో రోజు శ్రీ సరస్వతీ దేవి అవతార విశిష్టత

Navaratri 6th day 2023: నవరాత్రులలో ఆరో రోజు శ్రీ సరస్వతీ దేవి అవతార విశిష్టత

HT Telugu Desk HT Telugu

20 October 2023, 5:04 IST

    • Navaratri 6th day 2023:శరన్నవరాత్రులలో ఆరో రోజు ఆశ్వయుజ మాసం శుద్ధ షష్టి తిథి నాడు సాధారణంగా మూలా నక్షత్రం వస్తుంది. ఈరోజు జగన్మాత చదువుల తల్లి సరస్వతీ రూపంలో దర్శనమిచ్చే రోజని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
గురువారం శ్రీ మహా చండీదేవిగా దర్శనం ఇచ్చిన విజయవాడ కనక దుర్గమ్మ తల్లి
గురువారం శ్రీ మహా చండీదేవిగా దర్శనం ఇచ్చిన విజయవాడ కనక దుర్గమ్మ తల్లి

గురువారం శ్రీ మహా చండీదేవిగా దర్శనం ఇచ్చిన విజయవాడ కనక దుర్గమ్మ తల్లి

శరన్నవరాత్రులలో ఆరో రోజు ఆశ్వయుజ మాసం శుద్ధ షష్టి తిథి మూలా నక్షత్రం సమయంలో చదువుల తల్లి సరస్వతీ రూపంలో దర్శనమిచ్చే రోజని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. 

లేటెస్ట్ ఫోటోలు

Mohini Ekadashi : మోహిని ఏకాదశి రోజున ఈ రాశులపై లక్ష్మీదేవి అనుగ్రహం

May 18, 2024, 08:31 AM

మే 18, రేపటి రాశి ఫలాలు.. రేపు విలువైన వస్తువులు పోయే అవకాశం ఉంది, జాగ్రత్త

May 17, 2024, 08:25 PM

Sukraditya yogam: శుక్రాదిత్య యోగం.. ఈ మూడు రాశుల వారికి ఆదాయం పెరుగుతుంది, ఐశ్వర్యం వస్తుంది

May 17, 2024, 02:37 PM

ఈ రాశుల వారికి భారీ ధన లాభం- ఇంకొన్ని రోజుల్లో ప్రమోషన్​!

May 17, 2024, 12:21 PM

saturn Retrograde 2024 : శని తిరోగమనంతో రాజయోగం.. మంచి మంచి ఆఫర్లు వీరి సొంతం

May 17, 2024, 08:14 AM

3 రోజుల్లో వృషభ రాశిలోకి శుక్రుడు.. వీరి కష్టాలు తీరిపోతాయి

May 16, 2024, 04:45 PM

బ్రహ్మ చైతన్య స్వరూపిణిగా సరస్వతీదేవిని పురాణాలు అభివర్ణించాయి. త్రిశక్తి స్వరూపాల్లో సరస్వతి మూడో శక్తి రూపం. సంగీత సాహిత్యాలకు అధిష్టాన దేవత. ఈ తల్లిని ఆరాధించడం వలన బుద్ధి, వికాసం, విద్యాలాభం కలుగుతాయని చిలకమర్తి తెలిపారు. 

మూలా నక్షత్రము రోజున అమ్మవారిని శ్వేతపద్మాన్ని అధిష్టించి, వీణ, కమండలం, అక్షరమాలను ధరించి, అభయముద్రతో విరాజిల్లే శ్రీ సరస్వతీదేవి అలంకరణలో దర్శనమిస్తుంది. ఈ దేవికున్న అనేక నామాలలో శ్రీ శారదాదేవి అతి విశిష్టమైనది. ఈరోజు తల్లిదండ్రులు తమ పిల్లల చేత విద్యాబుద్దులకై సరస్వతీ పూజ తప్పకుండా చేయిస్తారు. చిన్నపిల్లలకు అక్షరాభాస్యం కూడా చేస్తారు. దేవీ నవరాత్రులలో చివరి మూడు రాత్రులూ చేసే త్రిరాత్ర వ్రతం ఈరోజే ప్రారంభిస్తారని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

వీణాధరే! విపుల మంగళ దానశీలే! 

భక్తార్తినాశిని! విరించి హరీశ వంద్యే |

కీర్తిప్రదే! అఖిల మనోరదే! 

మహర్షే విద్యాప్రదాయిని! 

సరస్వతి! నౌమి నిత్యం!

అని మనసారా స్తుతిస్తే భక్తుల అజ్ఞాన తిమిరాలను తొలగించి, వారి హృదయాల్లో జ్ఞానజ్యోతులను ప్రకాశింపచేస్తుంది. వాక్‌ శక్తిని, స్ఫూర్తిని ప్రసాదిస్తుంది. సరస్వతీ దేవి త్రిశక్తి రూపాల్లో మూడవ రూపం. ప్రాణకోటి జిహ్వాగ్రంపై నివసిస్తుంది. వ్యాసుడు, వాల్మీకి మరియు కాళిదాసులను అనుగ్రహించి వారి వాక్‌ వైభవాన్ని విశ్వ విఖ్యాతి చెందేలా చేసింది ఈ వాణీ పుస్తకధారిణి. 

శ్రీ సరస్వతీదేవిని శక్తికొలదీ అర్చించి, షోడశోపచారాలతో అష్టోత్తర నామాలతో కుంకుమపూజ గావించి విద్యాబుద్ధులను పెంపొందించుకోవాలని చిలకమర్తి సూచించారు.

ఈరోజు నైవేద్యంగా వడపప్పు, చలిమిడి, పానకం, అటుకులు, బెల్లం, అన్నం, పరమాన్నం, దద్యోదనం నివేదన చేయాలి. ఈరోజు ధరించవలసిన వర్ణం తెలుపు. 

విద్య ఏదైనా సరస్వతీదేవి జ్ఞానానికి ప్రతీక. ప్రతి మనిషికీ ఈ అమ్మే జ్ఞానదేవత అనే సందేశాన్ని ఈ అవతారం అందిస్తుందని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

తదుపరి వ్యాసం