తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Budhaditya Raja Yogam: ఏడాది తర్వాత మీన రాశిలో బుధాదిత్య రాజయోగం.. ఈ రాశుల వారికి పండగే

Budhaditya raja yogam: ఏడాది తర్వాత మీన రాశిలో బుధాదిత్య రాజయోగం.. ఈ రాశుల వారికి పండగే

Gunti Soundarya HT Telugu

27 February 2024, 19:00 IST

google News
    • Budhaditya raja yogam: ఏడాది తర్వాత మీన రాశిలో బుధుడు, సూర్యుడు కలిసి ప్రయాణించబోతున్నారు. ఫలితంగా బుధాదిత్య రాజయోగం ఏర్పడనుంది. ఈ యోగం ప్రభావంతో కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి రానుంది. 
బుధుడు సూర్యుడు కలయికతో బుధాదిత్య రాజయోగం
బుధుడు సూర్యుడు కలయికతో బుధాదిత్య రాజయోగం

బుధుడు సూర్యుడు కలయికతో బుధాదిత్య రాజయోగం

Budhaditya raja yogam: గ్రహాల రాజు సూర్యుడు, గ్రహాల రాకుమారుడు బుధుడు త్వరలో కలవనున్నారు. మార్చి నెల 7న బుధుడు మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. వారం రోజుల తర్వాత అంటే మార్చి 14న సూర్యుడు కూడా మీనరాశి సంచారం చేస్తాడు. మీన రాశిలో బుద్ధుడు సూర్యుడు కలయిక బుధాదిత్య రాజయోగాన్ని ఏర్పరుస్తుంది. 

ఈ రెండు గ్రహాల కలయిక మార్చి 25 వరకు ఉంటుంది. నవగ్రహాలలో సూర్యుడు, బుధుడు మిత్ర గ్రహాలుగా పేర్కొంటారు. బుధుడు తెలివితేటలు, మేధస్సు, జ్ఞానం, కళలు, వాక్కు వంటి వాటికి కారకుడిగా వ్యవహరిస్తాడు. కుంభ రాశి నుంచి బుధుడు వెళ్లబోతున్న మీన రాశిలో ఇప్పటికే నీడ గ్రహంగా పరిగణించే రాహువు సంచరిస్తున్నాడు. సుమారు 18 సంవత్సరాల తర్వాత రాహు, బుధ కలయికతో జడత్వ యోగం ఏర్పడుతుంది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఈ యోగం అశుభ ఫలితాలు ఇస్తుంది. జాతకంలో జడత్వ యోగం ఉంటే అనేక సమస్యలు, కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. 

ధనస్సు రాశి 

ధనుస్సు రాశి వారికి బుధుడు, సూర్యుడు కలయిక వల్ల ఏర్పడే బుధాదిత్య రాజయోగం ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపార సంబంధిత ప్రణాళికలో పూర్తి చేస్తారు. వ్యాపార రంగంలో ఆశించిన మేర లాభాలు వస్తాయి. అదే సమయంలో సమాజంలో పేరు, గౌరవం లభిస్తాయి. ఉద్యోగం చేసే కార్యాలయంలో మీ నైపుణ్యాలకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతారు. ఆగిపోయిన పనులు కూడా పూర్తి చేయగలుగుతారు. మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపడతాయి. వ్యాపారంలో పురోగతి సాధించడంతో పాటు అనేక కొత్త విషయాలు నేర్చుకుంటారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి రాబడి పొందుతారు. వ్యాపార భాగస్వాముల మధ్య నెలకొన్న వివాదాలు పరిష్కారం అవుతాయి. 

మీన రాశి

బుధుడు, సూర్యుడు కలయిక మీన రాశిలోనే జరగబోతుంది. ఫలితంగా బుధాదిత్య రాజయోగం మీనరాశి వారికి ఎంతో పవిత్రమైనదిగా మారనుంది. వ్యాపారంలో ఇబ్బందులు తొలగుతాయి. సూర్య గ్రహం అనుగ్రహం వల్ల విద్యార్థులు చదువు మీద మనసు లగ్నం చేస్తారు. సంతానానికి సంబంధించి శుభవార్తలు అందుకుంటారు. ఆరోగ్యపరంగా ఉన్న సమస్యలు కూడా తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలు నుంచి విముక్తి కలుగుతుంది. ఆదాయం పెరుగుతుంది.

వృషభ రాశి

బుధాదిత్య రాజ యోగం వృషభ రాశి వారికి మేలు చేస్తుంది. ఉద్యోగ పరంగా వచ్చే సమస్యలు ఏమైనా తగ్గుతాయి. వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారులు, సహ ఉద్యోగుల మద్దతు లభిస్తుంది. కుటుంబంతో కలిసి విహార యాత్రకు వెళ్లే అవకాశం ఉంది. దాంపత్య జీవితం మధురంగా ఉంటుంది. రాబోయే కాలంలో మీరు వేసే ప్రతి అడుగు విజయానికి పునాది కాబోతుంది. పని కోసం ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కెరీర్ లో మీకోసం అద్భుత అవకాశాలు ఎదురుచూస్తున్నాయి. 

కుంభ రాశి

కుంభ రాశి వారికి బుధుడు సంచారం శుభ ఫలితాలు ఇస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు మంచి విజయాలు సాధిస్తారు. మెరుగైన ప్రణాళికలు అవలంభిస్తే వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తారు. ధన లాభం పొందే అవకాశం ఉంది. గతంలో నిలిచిపోయిన డబ్బును తిరిగి పొందుతారు.

 

తదుపరి వ్యాసం