తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Mars Venus Conjunction: కుజుడు, శుక్రుల కలయిక.. ఈ నాలుగు రాశుల వారిపై లక్ష్మీదేవి కటాక్షం

Mars venus conjunction: కుజుడు, శుక్రుల కలయిక.. ఈ నాలుగు రాశుల వారిపై లక్ష్మీదేవి కటాక్షం

Gunti Soundarya HT Telugu

28 February 2024, 12:45 IST

google News
    • Mars venus conjunction: ప్రస్తుతం మకర రాశిలో కుజుడు, శుక్రుడు కలిసి ప్రయాణిస్తున్నారు. ఫలితంగా కొన్ని రాశుల వారికి లక్ష్మీదేవి అనుగ్రహం లభించనుంది. ఆదాయం పెరగనుంది. 
కుజుడు శుక్రుడు కలయిక
కుజుడు శుక్రుడు కలయిక

కుజుడు శుక్రుడు కలయిక

Mars venus conjunction: వైదిక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మార్చి నెల చాలా మందికి పవిత్రంగా మారనుంది. ఈ నెలలో అనేక గ్రహాలు రాశులను మార్చుకుంటూ శుభ యోగాలు, అదృష్ట యోగాలను కలిగిస్తున్నాయి.

ప్రస్తుతం మకర రాశిలో అంగారకుడు, శుక్ర గ్రహాల కలిసి సంచరిస్తున్నాయి. శుక్రుడు స్థానం బలంగా ఉంటే ఆర్థిక సమస్యలు సమసిపోతాయి. ధైర్యం, ఆత్మవిశ్వాసం, పట్టుదల, బలం మొదలైన వాటికి కారకుడిగా కుజుడు నిలుస్తాడు.

రాశిలో కుజుడు ఉచ్ఛస్థితిలో ఉంటే మానసిక ధైర్యాన్ని పొందుతారని చెబుతారు. మార్చి 15 వరకు ఈ రెండు గ్రహాలు మకర రాశిలోనే సంచరిస్తాయి. ఈ రెండు గ్రహాల కలయిక మొత్తం 12 రాశుల మీద ప్రభావం చూపిస్తుంది. కానీ నాలుగు రాశుల వారికి మాత్రం గ్రహాల కలయికతోపాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉంటుంది. ఏయే రాశుల వారికి ఈ రెండు గ్రహాల కలయిక వల్ల లాభాలు కలుగుతాయో చూద్దాం.

మేష రాశి

కుజుడు, శుక్రుడు కలయిక మేష రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రెండు గ్రహాల సంయోగం మహా పురుష రాజయోగాన్ని ఏర్పరుస్తుంది. మార్చి 7వ తేదీ వరకు వారికి అదృష్టం కలిసి వస్తుంది. భాగస్వామ్య వ్యాపారం మీకు విజయాన్ని అందిస్తుంది. కెరీర్ ముందుకు సాగుతుంది. ఉన్నతాధికారులు మీ ప్రయత్నాలను గుర్తించే ప్రమోషన్ ఇస్తారు. ఈ సమయంలో ఆరోగ్యంగా ఉంటారు. వ్యక్తిగత సంబంధాలు బలపడతాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో వ్యాపారంలో పెట్టుబడులు పెడితే లాభాలను ఇస్తాయి.

కర్కాటక రాశి

ఈ రెండు గ్రహాల సంయోగం కర్కాటక రాశి వారికి ఏడో ఇంట్లో జరుగుతుంది. ఈ కాలం ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది. మంచి జీవితాన్ని పొందుతారు. సమాజంలో ప్రతిష్ట పెరుగుతుంది. పని కోసం వేరే ప్రదేశానికి ప్రయాణించాల్సి వస్తుంది. వ్యాపారస్తులకు ఈ సమయం ఉపయోగకరంగా ఉంటుంది.

డబ్బు సంపాదిస్తారు. నూతన ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. ఆర్థిక పరంగా డబ్బులు ఆదా చేయగలుగుతారు. వ్యక్తిగత జీవితానికి సంబంధించి మీ జీవిత భాగస్వామితో మధురమైన క్షణాలు గడుపుతారు. ఆరోగ్య సమస్యలు నయం అవుతాయి. కోపాన్ని కొంచెం నియంత్రించుకోవాల్సి ఉంటుంది.

తులా రాశి

కుజుడు, శుక్రుడు కలయిక వల్ల తులా రాశి వారి జీవితం ఆనందం, శ్రేయస్సుతో నిండిపోతుంది. పని వాతావరణం సానుకూలంగా ఉంటుంది. వృత్తిపరంగా కూడా అనుకూల ఫలితాలు పొందుతారు. వ్యాపారంలో లాభాలు గడిస్తారు. అన్ని విషయాలలో సంతోషంగా ఉండటం వల్ల ఆరోగ్యంగాను ఉంటారు. ఆర్థికంగా వివిధ మార్గాల నుంచి డబ్బు అందుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు అందుకుంటారు. డబ్బు ఆదాయ చేసుకునేందుకు అనువైన సమయం. లగ్జరీగా ఉండటం కోసం డబ్బు ఖర్చు చేస్తారు.

మకర రాశి

శుక్రుడు, కుజు సంయోగం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ రాశి వారికి గొప్ప ఆర్థిక ఫలితాలు కలుగుతాయి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే అందుకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఏమైనా పెట్టుబడులు పెడితే అవి మీకు లాభాలు ఇస్తాయి. కెరీర్ లో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. ఈ సమయంలో మీ ప్రతి కల నెరవేరుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆదాయాన్ని పెంచుకుంటారు. పదోన్నతి లభిస్తుంది. ఈ సమయంలో ఆర్థికపరమైన సమస్యలు ఎక్కువగా ఉండవు.

తదుపరి వ్యాసం