తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Mars Transit: అంగారకుడి సంచారం.. ఈ ఏడు రాశుల వాళ్ళు కెరీర్ లో ఉన్నత స్థానాలను అందుకుంటారు

Mars transit: అంగారకుడి సంచారం.. ఈ ఏడు రాశుల వాళ్ళు కెరీర్ లో ఉన్నత స్థానాలను అందుకుంటారు

Gunti Soundarya HT Telugu

10 April 2024, 17:51 IST

    • Mars transit: త్వరలో అంగారకుడు తన రాశిని మార్చుకోబోతున్నాడు. ఏప్రిల్ 23న మీన రాశిలోకి ప్రవేశించడంతో ఏడు రాశుల జాతకులకు కెరీర్ లో ఉన్నత శిఖరాలు చేరుకుంటారు. వృత్తి పరంగా సంతృప్తిగా ఉంటారు. 
కుజుడి సంచారం
కుజుడి సంచారం

కుజుడి సంచారం

Mars transit: మండుతున్న గ్రహంగా అంగారకుడిని భావిస్తారు. ధైర్యం, పరాక్రమం, శక్తి వంటి వాటికి కుజుడిని కారకుడిగా పరిగణిస్తారు. అంగారకుడు శుభ ప్రదేశంలో ఉంటే వారికి వృత్తిలో శుభ ఫలితాలు లభిస్తాయి.

లేటెస్ట్ ఫోటోలు

ఈ 3 రాశులకు అదృష్ట యోగం- డబ్బుకు డబ్బు, సక్సెస్​!

May 19, 2024, 01:24 PM

Lucky Zodiacs From May 19th : శుక్రాదిత్య యోగం.. వీరికి సంపద పరంగా భారీ లాభాలు.. ప్రేమ జీవితంలో అద్భుతాలు

May 19, 2024, 07:06 AM

Mercury transit: గ్రహాల రాకుమారుడు వచ్చేశాడు.. ఈ నెల అంతా వీరికి డబ్బే డబ్బు

May 18, 2024, 03:19 PM

Mohini Ekadashi : మోహిని ఏకాదశి రోజున ఈ రాశులపై లక్ష్మీదేవి అనుగ్రహం

May 18, 2024, 08:31 AM

మే 18, రేపటి రాశి ఫలాలు.. రేపు విలువైన వస్తువులు పోయే అవకాశం ఉంది, జాగ్రత్త

May 17, 2024, 08:25 PM

Sukraditya yogam: శుక్రాదిత్య యోగం.. ఈ మూడు రాశుల వారికి ఆదాయం పెరుగుతుంది, ఐశ్వర్యం వస్తుంది

May 17, 2024, 02:37 PM

ఏప్రిల్ 23న అంగారకుడు కుంభ రాశిని వీడి మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. తన అసలు త్రికోణ రాశిలోకి అంగారకుడు ప్రవేశించడం వల్ల కొన్ని రాశుల వారికి మంచి ఫలితాలు లభిస్తాయి. సమాజంలో గౌరవం, ఉన్నత స్థానం పొందే అవకాశాలు ఉన్నాయి. కుజుడు మీనరాశి 12వ ఇంటికి అధిపతి. కెరీర్, ఆర్థిక జీవితం మొదలైన వాటిలో మంచి ఫలితాలను ఇస్తాడు.

అదే కుజుడు అశుభ స్థానంలో ఉంటే ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది. ధైర్యం, పరాక్రమం, శక్తి కూడా తగ్గుతాయి. మీన రాశిలో ఇప్పటికే సూర్యుడు, బుధుడు, రాహువు సంచరిస్తున్నారు. మీన రాశిలో అంగారకుడి సంచారం వాళ్ళ కొన్ని రాశుల వాళ్ళు కెరీర్, వృత్తిపరమైన జీవితంలో సానుకూల ఫలితాలు పొందబోతున్నారు.

వృషభ రాశి

కుజుడి సంచారం వల్ల వృషభ రాశి వారికి వృత్తిలో అనుకూల ఫలితాలు ఉంటాయి. వృత్తి జీవితంలో వారి కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. పనిలో ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది. వివిధ ప్రాజెక్టులకు పూర్తి చేసేందుకు సహోద్యోగుల నుండి సహకారం లభిస్తుంది. కెరీర్ లో అపారమైన విజయాన్ని పొందుతారు. ఇది చాలా సంతోషాన్ని ఇస్తుంది.

మిథున రాశి 

మిథున రాశి జాతకుల కృషి, నిబద్ధత కారణంగా పని రంగంలో వృత్తిపరమైన విజయం ఉంటుంది. తమ ఉద్యోగాలలో ప్రమోషన్లు పొందుతారు. సామర్థ్యం, తెలివితేటలతో కెరీర్లో గొప్పగా ఎదుగుతారు. ఉద్యోగరీత్యా అనేక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఈ ప్రయాణాలు చాలా లాభదాయకంగా ఉంటాయి. ఈ సమయంలో శ్రమకు తగిన ఫలితాలు అందుకుంటారు. 

కర్కాటక రాశి 

కుజుడి సంచారం వల్ల కర్కాటక రాశి వాళ్ళు కెరీర్ లో పెద్ద విజయాలు సాధిస్తారు. సరైన మార్గాలు అనుసరించి తమ లక్ష్యాలను చేరుకుంటారు. ఉద్యోగంలో ప్రమోషన్  వచ్చే అవకాశాలు ఉన్నాయి.  కెరీర్ లో అనేక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. ఈ సమయంలో కెరీర్ లో ఇబ్బందులు లేదా అడ్డంకులు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. 

మీన రాశి

మీన రాశిలోనే కుజుడు సంచరించబోతున్నాడు. ఫలితంగా తమ వృత్తి జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోగలుగుతారు. ప్రమోషన్ లేదా జీతం పెరిగే అవకాశం ఉంది. అంగారకుడి అనుగ్రహంతో తమ లక్ష్యాలను సాధించగలుగుతారు. విజయాలు సాధించేందుకు పనిలో ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం ఉండదు. మీ కోరికలు ఈ సమయంలో నెరవేరుతాయి.

కుంభ రాశి

అంగారకుడి సంచారం కుంభ రాశి వారి అనుకూలంగా ఉంటుంది. కృషి, అంకిత భావంతో వృత్తిలో విజయ శిఖరాలను చేరుకుంటారు. విదేశాల్లో మంచి అవకాశాలు వచ్చే సూచనలు ఉన్నాయి. కెరీర్ పరంగా అనేక అవకాశాలు ఎదురుపడతాయి.

ధనుస్సు రాశి

అంగారకుడి సంచారం వల్ల ధనుస్సు రాశి వారు తమ వృత్తి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ సమయం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. పనిలో సానుకూల ఫలితాలు పొందుతారు.  కెరీర్ లో అదృష్టం అండగా నిలుస్తుంది. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. జీతం కూడా పెరగవచ్చు. మంచి ఫలితాలతో సంతోషంగా ఉంటారు. కొన్ని పనుల నిమిత్తం విదేశాలకు వెళ్లే అవకాశం వస్తుంది. ఉన్నతాధికారులు మీ పని పట్ల సంతోషంగా ఉంటారు. ఎదుటివారికి ఆదర్శవంతంగా నిలుస్తారు. 

కన్యా రాశి 

కుజుడి సంచారం కన్యా రాశి వారి జీవితాల్లో సానుకూల ఫలితాలు తీసుకొస్తుంది. ఉద్యోగరీత్యా ప్రయాణాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అవి విజయవంతం అవుతాయి. కెరీర్ లో శుభ ఫలితాలు పొందేందుకు ఉన్నతాధికారులతో సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించండి. వృత్తిపరంగా అనేక విజయాలు సాధించేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాలి. మీరు చేపట్టే పనుల్లో  ఆశించిన విజయాన్ని పొందుతారు. 

 

తదుపరి వ్యాసం