తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Mars Transit: కుజ గ్రహ సంచారం.. ఈ రాశుల జాతకులకు ఆస్తులు దక్కేలా చేస్తుంది

Mars transit: కుజ గ్రహ సంచారం.. ఈ రాశుల జాతకులకు ఆస్తులు దక్కేలా చేస్తుంది

Gunti Soundarya HT Telugu

06 February 2024, 11:24 IST

    • Mars Transit: శనికి చెందిన మకర రాశిలో కుజుడి సంచారం కొన్ని రాశుల జాతకులకు ఆస్తులు దక్కేలా చేస్తుంది. మేష రాశి నుంచి మీన రాశి వరకు అంగారక సంచార ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం. 
కుజుడి సంచారం.. ఈ రాశులకు అదృష్టం
కుజుడి సంచారం.. ఈ రాశులకు అదృష్టం (pixabay)

కుజుడి సంచారం.. ఈ రాశులకు అదృష్టం

జ్యోతిష్య శాస్త్రంలో అంగారకుడికి ప్రత్యేక స్థానం ఉంటుంది. కుజ గ్రహ సంచారం మంగళ ప్రదంగా భావిస్తారు. ధైర్యం, శౌర్యం, పరాక్రమం వంటి వాటికి కారకుడిగా ఉండే అంగారకుడి సంచారం వల్ల కొన్ని రాశుల వాళ్ళు అదృష్టం పొందబోతున్నారు.

లేటెస్ట్ ఫోటోలు

ఈ 3 రాశులకు అదృష్ట యోగం- డబ్బుకు డబ్బు, సక్సెస్​!

May 19, 2024, 01:24 PM

Lucky Zodiacs From May 19th : శుక్రాదిత్య యోగం.. వీరికి సంపద పరంగా భారీ లాభాలు.. ప్రేమ జీవితంలో అద్భుతాలు

May 19, 2024, 07:06 AM

Mercury transit: గ్రహాల రాకుమారుడు వచ్చేశాడు.. ఈ నెల అంతా వీరికి డబ్బే డబ్బు

May 18, 2024, 03:19 PM

Mohini Ekadashi : మోహిని ఏకాదశి రోజున ఈ రాశులపై లక్ష్మీదేవి అనుగ్రహం

May 18, 2024, 08:31 AM

మే 18, రేపటి రాశి ఫలాలు.. రేపు విలువైన వస్తువులు పోయే అవకాశం ఉంది, జాగ్రత్త

May 17, 2024, 08:25 PM

Sukraditya yogam: శుక్రాదిత్య యోగం.. ఈ మూడు రాశుల వారికి ఆదాయం పెరుగుతుంది, ఐశ్వర్యం వస్తుంది

May 17, 2024, 02:37 PM

కుజుడు శుభ స్థానంలో ఉంటే ఆ వ్యక్తి ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు శుభం చేకూరుస్తాయి. ప్రస్తుతం కుజుడు ఫిబ్రవరి 5న మకర రాశిలో ప్రవేశం చేశాడు. 2024 మార్చి 15 వరకు మకర రాశిలోనే సంచరిస్తాడు. అంగారకుడు సంచారం మొత్తం పన్నెండు రాశుల మీద ప్రభావం చూపిస్తుంది. మేష రాశి నుంచి మీన రాశి వరకు కుజుడు సంచారం ఏ విధంగా ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం.

మేష రాశి

కుజుడి సంచారం మేష రాశి వారికి మేలు చేస్తుంది. అన్ని రంగాలలో పురోగతి సాధిస్తారు. ఆర్థికంగా లాభపడతారు. స్థిర, చరాస్తుల క్రయ విక్రయాలు జరుగుతాయి. యువతకు ఈ సమయం అత్యంత ప్రయోజనకమరగా ఉంటుంది. మీ నాయకత్వ లక్షణాలతో అందరి మన్ననలు పొందుతారు. మీ పనితనానికి అందరూ ఆకర్షితులు అవుతారు.

వృషభ రాశి

అదృష్టం మీ వెంటే ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. నిర్మాణ, మరమత్తుల పనులకి డబ్బు ఖర్చు చేస్తారు. చరాస్తులు పెరుగుతాయి. విదేశాలు వెళ్లాలని అనుకునే వారికి ఇది అనుకూలమైన సమయం. ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాల మీద దృష్టి సారిస్తారు.

మిథునం

మొదట్లో కొద్దిగా ఇబ్బందులు ఎదురైన కూడా చివర్లో లాభాలు చూస్తారు. ఆదాయం పెరుగుతుంది. ఏవైనా కొనుగోలు చేసేందుకు ఈ సమయం కలిసి వస్తుంది. ప్రయాణాలు చేసే వాళ్ళు కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి. సెల్ఫ్ డ్రైవ్ కు దూరంగా ఉండాలి.

కర్కాటకం

కుజ గ్రహ సంచారం కర్కాటక రాశి వారికి ఆశించిన ఫలితాలు ఉండవు. భాగస్వామ్య వ్యాపారం చేసే వారి మధ్య వివాదాలు నెలకొనే అవకాశం ఉంది. కుటుంబంలోని కలహాల వాతావరణం చికాకు పెడుతుంది. ఫలితంగా మనసు చికాకుగా, ఆందోళనగా ఉంటుంది.

సింహం

పోటీల్లో విజయం మిమ్మల్ని వరిస్తుంది. గతంలో ఉన్న వివాదాలు సద్దుమణుగుతాయి. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టాలని అనుకునే వారికి ఇది అనువైన సమయం. మీ మొండి వైఖరి వల్ల వివాదాల్లో చిక్కుకునే అవకాశం ఉంది.

కన్యా రాశి

విద్యార్థులకు, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి మంచి సమయం. విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారు. మీ శ్రమ వృథా కాదు. గతంలో ఆగిపోయిన పనులు పూర్తి చేస్తారు.

తులా రాశి

రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి ఇది అనుకూలమైన సమయం. ఈ రంగంలో పురోగతి సాధిస్తారు. వ్యక్తిగత విషయాల్లో విభేదాలు ఎదుర్కొంటారు. ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇంట్లో పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలి.

వృశ్చిక రాశి

అంగారకుడి సంచారంతో వృశ్చిక రాశి వారికి ఆత్మవిశ్వాసం, శక్తి పెరుగుతుంది. వివాదాస్పద కేసులో విజయం సాధిస్తారు. పని చేసే ప్రదేశంలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి.

ధనుస్సు రాశి

కుజుడి సంచారంతో ధనుస్సు రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు చేకూరతాయి. సంపద పోగు చేసుకుంటారు. వ్యాపారంలో పెట్టుబడులు కలిసి వస్తాయి. మాటల్లో కఠినత్వం కారణంగా కొందరు దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

మకర రాశి

అంగారక గ్రహ సంచారం మకర రాశికి వల్ల ఆత్మవిశ్వాసం, ధైర్యం, గౌరవం పెరుగుతాయి. చరాస్తులు, స్థిరాస్తుల్లో పెట్టుబడులు లాభాలని ఇస్తాయి. కొత్త బంధాలు ఏర్పడతాయి. న్యాయపరమైన కేసులో విజయం సాధిస్తారు.

కుంభం

కుజ గ్రహ సంచారం వల్ల న్యాయ పరమైన వివాదాలు, ఆరోగ్యం మీద అధికంగా ఖర్చు పెడతారు. వైద్యం, పరిశోధన, పరిపాలన, రవాణా, దిగుమతి, ఎగుమతి రంగాల వారికి మంచి లాభాలు వస్తాయి. శత్రువులు మీ చేతిలో ఓడిపోతారు.

మీనం

కుజుడి సంచారం వల్ల మీన రాశి వారికి ఆర్థికంగా లాభపడతారు. నూతన ఆదాయ వనరులు ఏర్పడతాయి. కొన్ని ముఖ్యమైన పనులు చక్కబెడతారు.

తదుపరి వ్యాసం