మీరు ఆఫీసుకు ఆలస్యంగా వెళ్లారనుకోండి మీ మేనేజర్ మిమ్మల్ని తిడతారు. ఈ విషయాన్ని మీరు రోజంతా ఆలోచిస్తూ ఉంటే అది మరింత నిరుత్సాహానికి దారితీస్తుంది.  

pexels

By Bandaru Satyaprasad
Jan 06, 2024

Hindustan Times
Telugu

మనల్ని అందరూ గౌరవించాలని భావిస్తుంటారు కొందరు. కానీ అన్ని సందర్భాల్లో సాధ్యం కాదు. ఇతరుల కొన్ని వ్యాఖ్యలు లేదా చర్యలు మనల్ని మానసికంగా బాధిస్తుంటాయి. అయితే అన్ని విషయాలను మరింత వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన అవసరంలేదంటున్నారు నిపుణులు.   

pexels

అన్ని విషయాలను వ్యక్తిగతంగా తీసుకోవడం, ఎక్కువగా ఆలోచించడం...అదుపు చేసేందుకు ఆరోగ్య నిపుణులు కొన్ని చిట్కాలు సూచిస్తున్నారు.  

pexels

మిమల్ని మీరు విశ్వసించండి- వర్కింగ్ ప్రదేశాల్లో కొన్ని సార్లు ఇతర మాటలు మిమల్ని బాధిస్తుంటాయి. మిమ్మల్ని మీరు విశ్వసించడం నేర్చుకోండి. మిమల్ని మీరు తక్కువ చేసుకోకండి. మీ సామర్థ్యాలపై నమ్మకం ఉంచండి.   

pexels

కమ్యూనికేషన్-  మనం ఎవరితోనైనా గొడవ పడితే..దానికి మన కమ్యూనికేషన్ ఒక కారణం కావొచ్చు. సమస్యను రెండు వైపుల నుంచి ఆలోచించాలి. గొడవకు దారితీసే తప్పు కమ్యూనికేషన్ ఉందని మీరు భావిస్తే, దానిని మార్చుకోవడానికి ప్రయత్నించండి.  

pexels

జర్నలింగ్- మీ ఆలోచనలను పుస్తకంలో రాయండి. ఇలా రాస్తే మీపై మీకు మరింత స్పష్టత వస్తుంది. ఏ సమస్యలను గురించి మీరు అతిగా ఆలోచిస్తున్నారో తెలుస్తుంది. చెడు ఆలోచనలను తగ్గించుకునేందుకు  ఒక పరిష్కారం దొరుకుతుంది.   

pexels

వృత్తిపరమైన సహాయం కోరండి- వృత్తిపర ఒత్తిడి ఉంటే సహోద్యోగులు, సీనియర్లతో కూర్చొని మాట్లాడండి. ఆలోచన తీవ్రత మరింత పెరిగితే ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.  

pexels

లెట్స్ గో- జీవితం అంటేనే ఒడిదుడుకుల కలయిక. జీవితం ముందుకు సాగడానికి మంచి విషయాలను స్వీకరించి, ప్రతికూల  భావోద్వేగాలను విడిచిపెట్టడం మంచిది.  ప్రతీ విషయాన్ని వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన అవసరంలేదు. అనవసరమైన వాటిని లెట్స్ గో అనే ధోరణిలో వదిలేయండి.   

pexels

పరీక్షల సమయంలో పిల్లలకు ఎలాంటి ఆహారం పెట్టాలి?

Image Source From unsplash