Lakshmi Narayana Yogam: లక్ష్మీనారాయణ యోగం.. మీ రాశి ఇదే అయితే ధనంతో ఖజానా నిండిపోతుంది
06 December 2023, 10:00 IST
- Lakshmi Narayana Yogam: వృశ్చికంలో బుధుడు, శుక్రుడు కలయిక వల్ల లక్ష్మీనారాయణ యోగం ఏర్పడబోతోంది. దీని వల్ల ఈ మూడు రాశుల వారిని అదృష్టం వరిస్తుంది.
వృశ్చికంలో బుధుడు, శుక్రుడు కలయిక వల్ల లక్ష్మీనారాయణ యోగం
మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరంలోకి వెళ్లబోతున్నాం. ఈలోపు కొన్ని రాశుల వారికి అదృష్టం వరించబోతుంది. ఈ ఏడాది చివరి నెల డిసెంబర్ లో అనేక పెద్ద గ్రహాల సంచారం జరుగుతుంది. గ్రహాల కదలికలు మారడం వల్ల అనేక యోగాలు కూడా ఏర్పడతాయి. సంవత్సరం చివరి నెలలో లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడబోతోంది.
జ్యోతిష్య శాస్త్రంలో లక్ష్మీనారాయణ యోగానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇది చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. డిసెంబర్ 28న బుధుడు తిరోగమన దిశలోకి వెళ్తూ శుక్రుడు కూర్చున్న వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది అత్యంత శక్తివంతమైన యోగం. శుక్రుడు, బుధుడు కలిసి ఉన్నపుడు ఈ శుభ యోగం ఏర్పడుతుంది.
శుక్రుడు విలాసాలు, ప్రేమానుబంధాలు, సంతోషం, అందానికి సూచికగా చెప్తారు. బుధుడు మేధస్సు, వ్యాపారాలు వృద్ధి గ్రహంగా చెప్తారు. అందుకే ఈ రెండింటికీ కలయిక వల్ల పలు రాశుల వారికి ఊహించని రీతిలో అదృష్టాన్ని తీసుకొస్తుంది. ఈ రాజయోగ ప్రయోజనాన్ని పొందే రాశులు గురించి తెలుసుకుందాం..
మిథున రాశి
మిథున రాశి వారికి లక్ష్మీ నారాయణ యోగం ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపారస్థులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడులు రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో భారీగా లాభాలు వస్తాయి. ఎన్నో రోజులుగా ఉద్యోగాల కోసం ఎదురు చూసి నిరాశ చెందిన వారికి ఈ లక్ష్మీనారాయణ యోగం వల్ల కొత్తగా ఉద్యోగాల ఆఫర్లు పొందుతారు. కుటుంబంలో ప్రశాంతమైన, సంతోషకరమైన వాతారణం నెలకొంటుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది.
వృశ్చిక రాశి
బుధుడు, శుక్రుడు కూర్చున్న వృశ్చిక రాశిలోకి రావడం వల్ల లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతోంది. దాని ఫలితంగా ఈ రాశి వారి ఆదాయం వృద్ధి చెందుతుంది. అదే విధంగా అనుకోని రీతిగా ధనార్జన పొందుతారు. భార్యాభర్తల మధ్య ప్రేమ మరింత పెరుగుతుంది. వారి బంధం బలపడుతుంది. కెరీర్ పరంగా ఒడుదొడుకులు ఎదుర్కొంటున్న వారికి ఈ సమయంలో సమస్యలన్నీ తొలగిపోతాయి. కెరీర్ లో ముందుకు సాగుతారు.
కుంభ రాశి
కుంభ రాశి వారికి లక్ష్మీనారాయణ యోగం శుభప్రదంగా ఉంటుంది. జీవితంలో ఎదురయ్యే సమస్యలు సద్దుమణుగుతాయి. సంతానానికి సంబంధించి శుభ వార్తలు వింటారు. ఆరోగ్యం భేషుగ్గా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆదాయం సమకూరుతుంది.
లక్ష్మీనారాయణ యోగం సమయంలో లక్ష్మీదేవిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడం కోసం ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అమ్మవారికి ఇష్టమైన పూలతో పూజ చేస్తూ లక్ష్మీదేవి మంత్రం జపించాలి. అలాగే పెళ్లికాని ఆడపిల్లలకు, బాలికలకు మిఠాయిలు పంచి పెట్టడం మంచిది.
టాపిక్