తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Karthika Purnima Pooja: పూర్తి శ్లోకాలు, మంత్రాలతో.. వివరంగా కార్తీక పూర్ణిమ పూజా విధానం..

Karthika Purnima Pooja: పూర్తి శ్లోకాలు, మంత్రాలతో.. వివరంగా కార్తీక పూర్ణిమ పూజా విధానం..

26 November 2023, 15:46 IST

  • Karthika Purnima Pooja: కార్తీక పూర్ణిమ రోజు పూజ చేసే విధానం, పూజా సమయంలో తప్పకుండా చదవాల్సిన శ్లోకాలు, పూర్తి పద్ధతి వివరంగా పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు. 

కార్తీకపూర్ణిమ పూజా విధానం
కార్తీకపూర్ణిమ పూజా విధానం (freepik)

కార్తీకపూర్ణిమ పూజా విధానం

శివునకు ఎక్కువ ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం. హరిహరాదులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తకోటి యావత్తు కఠిన నిష్టతో చేపట్టే వ్రతములకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ఈ మాసంలో పాడ్యమి, చవితి, పౌర్ణమి, చతుర్దశి, ఏకాదశి, ద్వాదశి తిథుల్లో శివపార్వతుల అనుగ్రహం కోసం పూజలు చేస్తుంటారు. ఈ మాసమందు వచ్చే సోమవారములు, చవితి, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి అత్యంత పుణ్యప్రదమైనవి. నెల అంతా సాధ్యపడని భక్తులు కనీసం ఆయా దినములలో పవిత్ర పుణ్య నదీ స్నానమాచరించి, ఉపవాస దీక్షలు చేస్తూ మహాన్యాసపూర్వక మహా రుద్రాభిషేకములు, లక్ష బిల్వార్చనలు, లక్ష కుంకుమార్చనలు, లలిత, విష్ణుసహస్రనామపారాయణలు, ప్రతినిత్యము ఉభయ సంధ్యలలో దీపారాధన చేయువారికి విశేష పుణ్యఫలం లభిస్తుంది. ఈ కార్తీక మాసం ముప్ఫయి దినములు ఆచరించినవార్కి అనంతకోటి పుణ్యఫలం లభిస్తుంది.

లేటెస్ట్ ఫోటోలు

మే 14, రేపటి రాశి ఫలాలు.. రేపు శత్రువుల నుంచి వీరికి ఆర్థిక లాభాలు

May 13, 2024, 08:09 PM

Rahu transit: రాహు గ్రహ అనుగ్రహం.. 2025 వరకు ఈ రాశుల వారికి దేనికి ఢోకా లేదు

May 13, 2024, 06:27 PM

వృషభ రాశిలో 4 గ్రహాల కలియిక.. ఈ రాశుల వారికి డబ్బే-డబ్బు.. కొత్త ఇల్లు కొంటారు!

May 13, 2024, 05:20 PM

కుబేరుడి ఆశిస్సులతో ఈ రాశుల వారికి భారీ ధన లాభం- జీవితంలో విజయం!

May 13, 2024, 09:28 AM

Venus Transit : శుక్రుడి నక్షత్ర మార్పు.. వీరి జీవితంలో అన్నీ అద్భుతాలే ఇక!

May 12, 2024, 08:50 AM

ఈ రాశుల వారికి అదృష్టం కలిసి రాబోతోంది.. డబ్బు సహా చాలా ప్రయోజనాలు

May 11, 2024, 02:05 PM

కార్తీక పౌర్ణమి పూజా విధానము:

శ్రీ శివ పూజా విధిః

దీపారాధనం కృత్వా- ఆచమ్య, ప్రాణాయామ్య- దేశకాలౌ సంకీర్త శా మమ ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ భవానీశంకర దేవతా ప్రీత్యర్థం, శ్రీ భవానీశంకర దేవతా పూజాం కరిష్యే- అంటూ పళ్ళెములో నీరు వదలవలెను. ముందుగా కలశం పెట్టి, అలంకరించి..

శ్లోకం: కలశస్య ముఖే విష్ణుః, కంఠేరుద్ర స్సమాశ్రితః

మూలేతత్ర స్థితో బ్రహ్మా మధ్యేమాతృ గణాఃసృతాః॥॥

కుక్షౌతు సాగరా స్సర్వే సప్తద్వీపా వసుంధరా

బుగ్వేదోధ యజుర్వేద స్సామవేదోహ్యధర్వణః

అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాథ్రితాః॥।

గంగేచ యమునేచైవ గోదావరీ సరస్వతి

నర్మదే సింధు కావేరి జలేస్మిన్‌ సన్నిధిం కురు॥

పూర్వోక్త సంకల్ప ప్రకారేణ శ్రీ భవానీశంకర దేవతా పూజాం కరిష్యే. అదౌ నిర్విఘ్నేన పరిసమాప్త శరం శ్రీ మహాగణపతి పూజాం కరిష్యే అని పసుపు గణపతి పూజ చేయాలి.

పసుపు గణపతి పూజ :

ఒక పళ్ళెములో బియ్యం పోసి తమలపాకు కొస తూర్పుగా ఉంచి దానిమీద పసుపుతో చేసిన విఘ్నేశ్వరుని ఉంచి కుంకుమతో అలంకరించి దానిమీద పుష్పం, అక్షితలు కుడి చేతిలో పట్టుకొని

శ్లోకం: శుక్షాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం

ప్రసన్న వదనం ధ్యాయేత్‌సర్వ విఘ్నేపశాన్నయే॥

శ్లోకం: వాగీశాద్యాః సుమనసః సర్వార్ధానాముపక్రమే

యంనత్వా కృతకృత్యాసుః తంనమామిగజాననం॥

శ్రీ మహాగణాధిపతిం సాంగం సాయుధం

సశక్తి పత్నీపరివార సమేతం గణపతి ఆవాహయామి, స్థాపయామి పూజయామి అని చెబుతూ పుష్పం అక్షితలు గణపతిమీద ఉంచవలెను. పిమ్మట శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి, ఆవాహయామి ఆవాహనం సమర్పయామి, నవరత్నఖచిత సింహాసనం సమర్పయామి.. అని చెబుతూ అక్షతలు చల్లవలెను.

శ్రీ మహాగణాధిపతయేనమః పాదయోః పాద్యం సమర్పయామి.

శ్రీ మహాగణాధిపతయేనమః హస్తయోః అర్ధ్యం సమర్పయామి.

శ్రీ మహాగణాధిపతయేనమః ముఖే ఆచమనీయం సమర్పయామి.

శ్రీ మహాగణాధిపతయేనమః శుద్దోదక స్నానం సమర్పయామి.

స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి.

శ్రీ మహాగణాధిపతయేనమః వస్త్రయుగ్మం సమర్పయామి.

శ్రీ మహాగణాధిపతయేనమః యజ్ఞోపవీతం సమర్పయామి.

శ్రీ మహాగణాధిపతయేనమః శ్రీగంధం సమర్పయామి.

శ్రీ మహాగణాధిపతయేనమః గంధస్యోపరి అలంకారార్థం అక్షతాన్‌ సమర్పయామి.

శ్రీ మహాగణాధిపతయేనమః పుష్పై పూజయామి.

శ్రీ మహా గణాధిపతి షోడశనామములు :

ఓం సుముఖాయ నమః

ఓం ఏకదంతాయ నమః

ఓం కపిలాయ నమః

ఓం గజకర్ణాయ నమః

ఓం లంబోదరాయ నమః

ఓం వికటాయ నమః

ఓం విఘ్నరాజాయ నమః

ఓం గణాధిపాయ నమః

ఓం ధూమకేతవే నమః

ఓం గణాధ్యక్షాయ నమః

ఓం ఫాలచంద్రాయ నమః

ఓం గజాననాయ నమః

ఓం వక్రతుండాయ నమః

ఓం శూర్చకర్ణాయ నమః

ఓం హేరంభాయ నమః

ఓం స్కంధపూర్వజాయ నమః

శ్రీ సర్వసిద్ధి ప్రదాయకాయ నమః

శ్రీ మహాగణాధిపతయే నమః

షోదశనామఖిః పూజాం సమర్ప్చయామి, శ్రీ మహాగణాధిపతయే నమః ధూపమాఘ్రాపయామి, శ్రీ మహాగణాధిపతయే నమః దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి.

బెల్లంముక్క లేక అరటిపండు లేక కొబ్బరికాయ పసుపు గణపతి వద్ద ఉంచి దానిమీద నీళ్ళు చిలకరించాలి.

శ్రీ మహాగణాధిపతయే నమః యథాభాగం గుదోపహార, కదళీఫల, నారికేళ శకలాన్‌ నివేదయామి అని చేతితో ఐదు సార్లు చూపుతూ ఓం ప్రాణాయస్వాహా, ఓం వ్యానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా అంటూ నివేదన చేయాలి.

ఆ తరువాత శ్రీ మహాగణాధిపతయే నమః నైవేద్యానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. అని నీళ్ళు ఉద్దరిణెతో స్వామికి చూపించి పళ్ళెంలో వదలాలి.

పూగీ ఫలైస్స కర్పూరైః నాగవల్లి దళైర్యుతం ముక్తా చూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగుహ్యతాం

అంటూ తాంబూలం సమర్పించి అనంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి అంటూ పళ్ళెంలో నీరు వదలవలెను.

శ్లోకం: ఘృతవర్తి సహ(్రైశ్చ కర్పూర శకలై స్తథాః నీరాజనం మయాదత్తం గృహాణ వరదోభవ శ్రీమహాగణాధిపతయేనమః కర్పూర నీరాజనం సమర్పయామి

నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి

(గణపతికి ఉదకముచూపించి పళ్ళెములోవదలవలెను. )

శ్రీ మహాగణాధిపతయే నమః దివ్యసువర్జ మంత్రపుష్పం సమర్పయామి అంటూ పుష్పం, అక్షతలు స్వామి పాదాలపై ఉంచవలెను.

శ్రీ మహాగణాధిపతయే నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్‌ సమర్పయామి అంటూ నమస్మారం చేసి

శ్లోకం: వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ।

నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా!

అంటూ ప్రార్ధన నమస్కారం చేసి అక్షతలు, ఉదకం చేతిలోకి తీసుకొని అనేన మయాకృతేన ధ్యాన ఆవాహనాది షోడదపశోచార పూజయాచ శ్రీ మహాగణాధిపతిః సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు అంటూ పళ్ళెంలో నీళ్ళు వదలాలి. ఆ తర్వాత శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసాగృహ్టామి అంటూ స్వామికి పూజ చేసిన అక్షతలు తీసుకొని శిరస్సుమీద వేసుకోవలెను. పిమ్మట స్వామిమీద అక్షతలు చల్లుతూ శ్రీ మహాగణాధిపతిం యథాస్థానం ప్రవేశయామి క్షేమార్ధం పునరాగమనాయచ అంటూ స్వామిని ఉంచిన పళ్ళెమును జరిపి దానిని ఒక పక్కగా ఉంచి ప్రధాన దేవతా పూజ ప్రారంభించవలెను.

ధ్యానం:

శ్లోకం: కైలాసే కమనీయ రత్న ఖచితే కల్చద్రుమూలే స్థితమ్‌

కర్పూర సృటికేందు సుందర తనుం కాత్యాయినీ సేవితం!

గంగాతుంగ తరంగ రంజిత జటాభారమ్‌ కృపాసాగరమ్‌।

కంఠాలంకృత శేషభూషణ మహామృత్యుంజయం భావయే॥

శ్రీ భవానీశంకరదేవతాభ్యో నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి.

ఆవాహనమ్‌

శ్లోకం: ఆగచ్చ మృత్యుంజయ చంద్రమౌళే వ్యాఘ్రాజినాలంకృత శూలపాణే।

స్వభక్తి సంరక్షణ కామధేనో ప్రసీద సర్వేశ్వర పార్వతీశ!

శ్రీ భవానీశంకరదేవతాభ్యో నమః ఆవాహనమ్‌ సమర్పయామి.

ఆసనమ్‌

శ్లోకం: భాస్వన్మాక్తికతోరణై ర్మరకత స్తంభాయుతాలంకృతే।

సాధే ధూప సువాసితే మణిమయే మాణిక్య దీపాంచితే॥

బ్రహ్మేంద్రామర యోగిపుంగవగణై రానీత కల్పద్రుమైః।

శ్రీ మృత్యుంజయ! సుస్థిరో భవవిభో! మాణిక్య సింహాసినే॥

శ్రీ భవానీశంకరదేవతాఖ్యో నమః నవరత్నఖచిత హేమసింహాసనం సమర్పయామి.

పాద్యమ్‌

శ్లోకం: మందారమల్లీ కరవీరమాధవీ పున్నాగనీలోత్సల పంకజాన్నితైః॥

కర్పూర పాటీర సువాసితేర్ణలైరాధత్స మృత్యుంజయ! పాద్యముత్తమమ్‌॥

శ్రీ భవానీశంకరదేవతాభ్యో నమః పాదయోః పాద్యమ్‌ సమర్పయామి.

అర్ధ్యమ్‌

శ్లోకం: సుగంధ పుష్పప్రకరై స్సువాసితై ర్వియన్నదీ శీతలవారిభి శుభైః

శ్రలోతనాథార హరార్థ్య యాదరాధదృహాణ మృత్యుంజయ! సర్వవందిత॥

శ్రీ భవానీశంకరదేవతాఖ్యో నమః హస్తయోః అర్ధ్యమ్‌ సమర్పయామి.

ఆచమనమ్‌

శ్లోకం: హిమాంబువాసితై స్తోయై శృీతలైరతిపావనైః।

మృత్యుంజయ మహాదేవ శుద్ధాచమన మాచర॥

శ్రీ భవానీశంకరదేవతాభ్యో నమః ముఖే ఆచమనీయమ్‌ సమర్పయామి.

మధుపర్మమ్‌

శ్లోకం: దధిగుడసహితం మధుప్రకీర్ణం సుఘృతసమన్వితం ధేనుదుగ్ధయుక్తం!

శుభకర మధుపర్మమహరత్వం త్రినయన మృత్యుంజయ కవంద్య॥

శ్రీ భవానీశంకరదేవతాభ్యో నమః మధుపర్మమ్‌ సమర్పయామి.

పంచామృతస్పానమ్‌

శ్లోకం: పంచాస్త్ర శాస్త పంచాస్య పంచపాతక సంహార।

పంచామృత స్నానమిదం కురు మృత్యుంజయ ప్రభో!

శ్రీ భవానీశంకరదేవతాభ్యో నమః పంచామృతస్నానమ్‌ సమర్పయామి.

(ఇక్కడ ఆవుపాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదారలతో కూడిన మిశ్రమాన్ని శివునకు అభిషేకింపవలెను. )

శుద్ధోదక స్నానమ్‌

శ్లోకం: జగత్రయఖ్యాత సమస్త తీర్శైః సమాహృతైః కల్మషహారిభిశ్చ।

స్నానం సుతోయైస్సముదాచేరత్వం మృత్యుంజయానంత గుణాభిరామ।।

శ్రీ భవానీశంకరదేవతాభ్యో నమః అభిషేకస్నానమ్‌ సమర్పయామి.

శుద్దోదక స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి.

శోభనవస్తమ్‌

శ్లోకం: అనీతే నాతి స్వచ్చేన కౌశేయే నామరద్రూమాత్‌!

మార్దయామి జటాజూటం మృత్యుంజయ మహాప్రభో॥

శ్రీ భవానీశంకరదేవతాభ్యో నమః శోభనవస్త్రమ్‌ సమర్పయామి.

వస్తమ్‌

శ్లోకం: నానాహేమ విచిత్రాణి చీనచీనాంబరానిచ।

వివిధానిచ దివ్యాని మృత్యుంజయ సుధారయ॥।

శ్రీ భవానీశంకరదేవతాభ్యో నమః వస్త్రయుగ్మం సమర్పయామి.

వస్తాంతే ఆచమనీయం సమర్పయామి.

యజ్ఞోపవీతమ్‌

శ్లోకం: విశుద్ధ ముక్తాఫలజాలరమ్యం మనోహరం కాంచనసూత్రయుక్త్షమ్‌।

యజ్ఞోపవీతం పరమంపవిత్రయాధత్స్వ మృత్యుంజయ మహాప్రభో॥

శ్రీ భవానీశంకరదేవతాభ్యో నమః యజ్ఞోపవీతమ్‌ సమర్పయామి.

యజ్ఞోపవీతాంతే ఆచమనీయం సమర్పయామి.

విభూతి (భస్మలేపనమ్‌)

శ్లోకం: త్ర్రంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనమ్‌।

ఉర్వారుకమివ బంధనా న్మ అత్యోర్ముక్షీయ మా౭_మృతాత్‌॥

శ్రీ భవానీశంకరదేవతాభ్యో నమః భస్మవిలేపనమ్‌ సమర్పయామి.

ఆభరణమ్‌

శ్లోకం: మాణిక్య కేయూర కిరీట హారాన్‌ కాంచీమణి స్థాపిత కుండలైశ్చ।

మంజీరముక్తాభరణెర్మనోజ్నై రంగాని మృత్యుంజయ భూషయామి॥

శ్రీ భవానీశంకరదేవతాభ్యో నమః నానావిధ ఆభరణాని సమర్పయామి.

గంధమ్‌

శ్లోకం: శ్రీగంధం ఘనసార కుంకుమయుతం కస్తూరికాపూరితం।

కాలేయేన హిమాంబునా విరచితం మందార సంవాసితమ్‌।

దివ్యం దేవమనోహరం మణిమయేపాత్రే సమారోపితం।

సర్వాంగేషు విలేపయామి సతతం మృత్యుంజయ థ్రీవిభో॥॥

శ్రీ భవానీశంకరదేవతాభ్యో నమః శ్రీగంధం సమర్పయామి.

అక్షతాన్‌

శ్లోకం: అక్షతైర్ధవకైర్దివ్యై స్పమ్యక్‌తిల సమన్వితైః।

మృత్యుంజయ మహాదేవ పూజయామి వృషధ్వజ।॥

శ్రీ భవానీశంకరదేవతాభ్యో నమః శ్వేత అక్షతాన్‌ సమర్పయామి.

హరిద్రాచూర్ణ్జమ్‌

శ్లోకం: (ఓం) శ్రీం అహిరివభోగైః పర్యేతి బాహుం జ్యాయా।

హేతిం పరిబాధ మానః హస్తఘ్నో విశ్వావయునాని విద్వాన్‌!

శ్రీ భవానీశంకరదేవతాభ్యో నమః హరిద్రాచూర్ణమ్‌ సమర్పయామి.

కుంకుమవిలేపనమ్‌

శ్లోకం: శ్రీం యాగుంగూర్యా సినీవాలీ యారాకాయా సరస్వతీ

ఇంద్రాణీ మహ్వహరాతయే వరుణానీం స్వస్త,

శ్రీ భవానీశంకరదేవతాభ్యో నమః కుంకుమ విలేపనం సమర్పయామి.

సుగంధ ద్రవ్యాణి

శ్లోకం: శ్రీం సుమంగలీరియం వధూరిమాం సమేత పశ్యత।

సౌభాగ్య మస్యైదత్వా యథాస్తం విపరేతన॥

శ్రీ భవానీశంకరదేవతాభ్యో నమః సుగంధద్రవ్యాణి సమర్పయామి.

జిల్వపత్రమ్‌

శ్లోకం: త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధమ్‌!

త్రిజన్మ పాపసంహారం ఏకబిల్వం శివార్చణమ్‌॥

శ్రీ భవానీశంకరదేవతాభ్యో నమః బిల్వపత్రాణి సమర్పయామి.

శ్రీ శివ అష్టోత్తర శతనామావళి:

ఓం శివాయ నమః

ఓం మహేశ్వరాయ నమః

ఓం శంభవే నమః

ఓం పినాకినే నమః

ఓం శశిశేఖరాయ నమః

ఓం వాసుదేవాయ నమః

ఓం విరూపాక్షాయ నమః

ఓం కపర్దినే నమః

ఓం నీలలోహితాయ నమః

ఓం శంకరాయ నమః

ఓం శూలపాణినే నమః

ఓం ఖట్వాంగినే నమః

ఓం విష్ణువల్లభాయ నమః

ఓం శిపివిష్టాయ నమః

ఓం అంబికానాధాయ నమః

ఓం శ్రీకంఠతాయ నమః

ఓం భక్తవత్సలాయ నమః

ఓం భవాయ నమః

ఓం శర్వాయ నమః

ఓం త్రిలోకేశాయ నమః

ఓం శితికంఠాయ నమః

ఓం శివాప్రియాయ నమః

ఓం ఉగ్రాయ నమః

ఓం కపాలినే నమః

ఓం కామారియే నమః

ఓం అంధకాసుర సూదనాయ నమః

ఓం గంగాధరాయ నమః

ఓం లలాటాక్షాయ నమః

ఓం కాలకాలాయ నమః

ఓం కృషపానిధియే నమః

ఓం భీమాయ నమః

ఓం పరశుహస్తాయ నమః

ఓం మృగపాణినే నమః

ఓం జటాధరాయ నమః

ఓం కైలాసవాసినే నమః

ఓం కవచినే నమః

ఓం కఠోరాయ నమః

ఓం త్రిపురాంతకాయ నమః

ఓం వృషాంకాయ నమః

ఓం వృషభారూఢాయ నమః

ఓం భస్మోద్ధూళిత విగ్రహాయ నమః

ఓం సామప్రియాయ నమః

ఓం సర్వమయాయ నమః

ఓం త్రయీమూర్తయే నమః

ఓం అనీశ్వరాయ నమః

ఓం సర్వజ్ఞాయ నమః

ఓం పరమాత్మాయ నమః

ఓం సోమసూర్యాగ్ని లోచనాయ నమః

ఓం హవిషే నమః

ఓం యజ్ఞమయాయ నమః

ఓం సోమాయ నమః

ఓం పంచవక్రాయ నమః

ఓం సదాశివాయ నమః

ఓం విశ్వేశ్వరాయ నమః

ఓం వీరభద్రాయ నమః

ఓం గణనాథాయ నమః

ఓం ప్రజాపతయే నమః

ఓం హిరణ్యరేతాయ నమః

ఓం దుర్దర్నాయ నమః

ఓం గిరీశాయ నమః

ఓం గిరిశాయ నమః

ఓం అనఘాయ నమః

ఓం భుజంగ భూషణాయ నమః

ఓం భర్గాయ నమః

ఓం గిరిధన్వినే నమః

ఓం గిరిప్రియాయ నమః

ఓం కృత్తివాసాయ నమః

ఓం పురారాతయే నమః

ఓం భగవతే నమః

ఓం ప్రమధాధిపాయ నమః

ఓం మృత్యుంజయాయ నమః

ఓం సూక్ష్మతనివే నమః

ఓం జగద్వ్యాపినే నమః

ఓం జగద్గురవే నమః

ఓం వ్యోమకేశాయనమః

ఓంమహాసేనజనకాయనమః

ఓం చారువిక్రమాయ నమః

ఓం రుద్రాయ నమః

ఓం భూతపతయే నమః

ఓం స్థాణవే నమః

ఓం అహిర్భుధద్నాయ నమః

ఓం దిగంబరాయ నమః

ఓం అష్టమూర్తయేనమః

ఓం అనేకాత్మాయనమః

ఓం సాత్త్వికాయ నమః

ఓం శుద్ధవిగ్రహాయ నమః

ఓం శాశ్వతాయ నమః

ఓం ఖండపరశవే నమః

ఓం అజాయ నమః

ఓం పాశవిమోచ కాయనమః

ఓం మృడాయ నమః

ఓం పశుపతయే నమః

ఓం దేవాయ నమః

ఓం మహాదేవాయనమః

ఓం అవ్యయాయ నమః

ఓం హరయే నమః

ఓం పూషదంతఖిదేనమః

ఓం అవ్యగ్రాయ నమః

ఓం దక్షాధ్వరహరాయ నమః

ఓం భగనేత్రఖిదే నమః

ఓం అవ్యక్తాయ నమః

ఓం సహస్రాక్షాయనమః

ఓం సహస్రపాదనేనమః

ఓం అపవర్గప్రదాయ నమః

ఓం అనంతాయ నమః

ఓం తారకాయ నమః

ఓంపరమేశ్వరాయనమః

శివ అష్టోత్తర శతనామావళి సమాప్తం

దివ్యపాదుకే

శ్లోకం: మాణిక్యపాదుకా ద్వంద్వౌ మౌనిహృత్పద్మమందిరే

పాదౌ సత్పద్మసుహృదౌ కురుమృత్యుంజయ ప్రభో॥

శ్రీ భవానీశంకర దేవతాభ్యో నమః - దివ్యపాదుకే సమర్పయామి.

చామరమ్‌

శ్లోకం: గజవందనస్కంద ధృతేనాతిస్వచ్చేన చామరయుగళేన।

అచల కానవ పద్మం మృత్యుంజయ భావయామి హృత్బద్మే॥

శ్రీ భవానీశంకర దేవతాభ్యో నమః - చామరయుగళాభ్యాం సమర్పయామి.

ఛత్రమ్‌

శ్లోకం: ముక్తాతపత్రం శతకోటి శుభ్రం శుభప్రదం త్వత్తను కాంతియుక్తం।

మాణిక్య సంస్థాపిత 'హేమదండం సురేశ మృత్యుంజయతే౨_ రృయామి॥శ్రీ భవానీశంకర దేవతాభ్యో నమః - ఛత్రం సమర్పయామి.

ధూపమ్‌

శ్లోకం: కర్పూరచూర్మైః కపిలాజ్యపూతైర్జాస్యామి కాలేయ సమన్వితైశ్చ।

సముదృవాన్సావనగంధ ధూపా న్మృత్యుంజయాఘ్రావణమాచరామి॥

శ్రీ భవానీశంకర దేవతాభ్యో నమః - ధూపమాఘ్రాపయామి.

దీపమ్‌

శ్లోకం: వర్తితయోపేత మఖండదీప్త్యా తమోపహారం బాహ్యమథాంతరం చ।

సాజ్యం సమస్తామరవర్గహృద్యం సురేశ మృత్యుంజయ పశ్యదీపమ్‌॥

శ్రీ భవానీశంకర దేవతాభ్యో నమః - దీపం దర్శయామి.

ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి.

నైవేద్యమ్‌

శ్లోకం: రాజాన్నం మధురాన్వితాని మృదులం మాణిక్యపాత్రే స్థితమ్‌!

హింగూజీరక సన్మరీచిమిళితై శ్యాకైరనీకై శ్చుభైః॥॥

పాకం సమ్యగపూప సూపసహితం సద్యోఘృతేనాఫ్లతం।

శ్రీ మృత్యుంజయ పార్వతీవిభో! సోపోశనం భుజ్యతాం॥।

శ్లోకం: శర్మారామిళితం స్నిగ్గం దుగ్దాన్నం గోఘృతాన్వితమ్‌।

కదలీఫల సమ్మిత ఘుంజల సృత్యనంపర॥

శ్లోకం: శీతలం మధురం స్వచ్చం వాసితం పావనం లఘు!

మధ్యే స్వీకురు పానీయం హర! మృత్యుంజయ ప్రభో!

నైవేద్యం మీద ఉదకం చల్లి అమృతమస్తు అని స్వామికి ఉదకం ఇచ్చి ప్రాణాయ నమః, అపానాయ నమః, వ్యానాయ

నమః ఉదానాయ నమః, సమానాయ నమః అని ఐదు మార్లు స్వామికి చూపించి

శ్రీ భవానీశంకర దేవతాభ్యో నమః - నైవేద్యం సమర్పయామి. అనంతరం శుద్ధాచమనీయం సమర్పయామి.

తాంబూలమ్‌

శ్లోకం: మౌక్తికచూర్ణ సమేతై రృగమదఘనసార వాసితైః పూగైః।

పర్షె స్స్వర్ణసమానైర్‌ మృత్యుంజయతే౭_ ర్వయామి తాంబూలమ్‌॥

శ్రీ భవానీశంకర దేవతాభ్యో నమః - తాంబూలం సమర్ప్చయామి.

నీరాజనమ్‌

శ్లోకం: నీరాజనం నిర్మలదీప్తి మద్చిః దీపాంకురై రుజ్వల ముట్చితైశ్చ।

ఘంటానినాదేన సమర్పయామి మృత్యుంజయాయ త్రిపురాంతకాయ।॥।

శ్రీ భవానీశంకర దేవతాభ్యో నమః - దివ్యమంగళ కర్పూర ఆనంద నీరాజనం సమర్పయామి.

మంత్రపుష్పమ్‌

నమస్తే అస్తు భగవాన్‌ విశ్వేశ్వరాయ, మహాదేవాయ, త్ర్యంబకాయ, త్రిపురాంతకాయ, త్రికాగ్ని కాలాయ, కాలాగ్నిరుద్రాయ,

నీలకంఠాయ, మృత్యుంజయాయ సర్వేశ్వరాయ, సదాశివాయ ్రీమన్మహాదేవాయ నమః

శ్లోకం: పున్నాగ నీలోత్పల కుందజాతీ మందారమల్లీ కరవీర పంకజైః।

పుష్పాంజలిం బిల్వదకైస్తులస్యా మృత్యుంజయాం'ఘై వినివేశయామి॥

శ్రీ భవానీశంకర దేవతాభ్యో నమః - సువర్ణమంత్రపుష్పం సమర్పయామి.

పునరర్ధ్యమ్‌

శ్లోకం: విరించి ముఖ్యామరబృందవంతిదే సరోజమత్సా్యాంకిత చక్రచిహ్నితే।

దదామి మృత్యుంజయ పాదపంకజే ఫణీంద్రభూషే పునరర్హ్యమీశ్వర[॥

శ్రీ భవానీశంకర దేవతాభ్యో నమః - పునరర్భ్యం సమర్పయామి.

ప్రదక్షిణమ్‌

శ్లోకం: పదేపదే సర్వతమోనికృంతనం పదేపదే సర్వశుభప్రదాయకమ్‌।

ప్రదక్షిణం భక్తియుతేన చేతసా కరోమి మృత్యుంజయ రక్షరక్షమామ్‌।।

యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ! తానితాని ప్రణస్యంతే ప్రదక్షిణ పదేపదే!

పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ। పాహిమాం కృపయా దేవ శరణాగతవత్సల!

అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ। తస్మాత్‌ కారుణ్య భావేన రక్షరక్ష మహేశ్వర॥

శ్రీ భవానీశంకరదేవతాభ్యో నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్‌ సమర్పయామి.

నమస్కారం:

శ్లోకం: నమో గౌరీశాయ స్ఫటికధవళాంగాయ చ నమో। నమోలోకేశాయ స్తుతవిబుధలోకాయ చ నమః॥

నమః శ్రీకంఠాయ క్షపిత పురదైత్యాయ చ నమో। నమః ఫాలాక్షాయ స్మరమద వినాశాయచ నమః॥

శ్రీ భవానీశంకరదేవతాభ్యో నమః నమస్కారాన్‌ సమర్పయామి.

క్షమాప్రార్థన

శ్లోకం: సంసారే జనితాపరోగసహితే తాపత్రయాక్రందితే।

నిత్యం పుత్రకళత్ర విత్త విలసత్సాశైర్నిబద్ధం దృఢమ్‌॥

గర్వాంధం బహుపాపవర్గ సహితం కారుణ్య దృష్టా విభో!

శ్రీ మృత్యుంజయ, పార్వతీప్రియ సదా మాం పాహి పరమేశ్వర॥

శ్లోకం: సౌధే రత్నమయే నవోత్పలదళాకీర్ణే చతుష్కాంతరే।

కౌశేయేన మనోహరేణ ధవళే నాచ్చాదితే సర్వశః॥

కర్చూరాంచిత దీపదీప్తిమిళితే రమ్యోపధానద్వయే!

పార్వత్యాః కరపద్మలాలిత పదం మృత్యుంజయం భావయే॥

శ్లోకం: ప్రాతర్లింగముమాపతే రహరహ స్సందర్శనాస్స ్వర్గదం।

మధ్యాహ్నే హయమేధ తుల్యఫలదం సాయంతనే మోక్షదం॥

భానోరస్తమయే ప్రదోషసమయే పంచాక్షరారాధనమ్‌।

తత్కాల త్రయ తుల్యమిష్టఫలదం సద్యో_ నవద్యే ధృతమ్‌!

శ్రీ భవానీశంకరదేవతాభ్యో నమః క్షమాయాచనపూర్వక నమస్కారాన్‌ సమర్పయామి.

పూజాసమర్పణమ్‌

శ్లోకం: మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సదాశివ యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే!

అనయా శ్రీమదాద్యశంకర భగవత్పాద విరచిత చతుశ్చత్వారింశ దుపచారపూర్వక సమస్త రాజోపచార, శక్తుుపచార, భక్తు

గ్రపచార పూజయాచ భగవాన్‌ సర్వాత్మకః శ్రీ భవానీశంకరదేవతా సుప్రీతా సుప్రసన్నో వరదోభవతు. సర్వం శ్రీ పరమేశ్వరార్చణమస్తు.

తీర్థస్వీకరణ

శ్లోకం: అకాలమృత్యుహరణం సర్వవ్యాధినివారణం।

సమస్తపాపక్షయకరం శ్రీ భవానీశంకర పాదోదకం పావనం శుభమ్‌

ఉద్వాసన

శ్లోకం: గచ్చగచ్చ పరం స్థానం స్వస్థానం మహేశ్వర। యత్ర బ్రహ్మాదయోదేవా నవిదుః పరమం పదం॥

శ్రీ శివపూజావిధి సమాప్తః

తదుపరి వ్యాసం