తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Brahma Kapalam In Telugu: బ్రహ్మకపాలం ఎక్కడ ఉన్నది? దాని విశిష్టత ఏమిటి?

brahma kapalam in telugu: బ్రహ్మకపాలం ఎక్కడ ఉన్నది? దాని విశిష్టత ఏమిటి?

HT Telugu Desk HT Telugu

06 May 2023, 4:00 IST

    • చార్ ధామ్‌లో ఒకటైన బద్రీనాథ్ పుణ్యక్షేత్రానికి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలోనే ఈ బ్రహ్మకపాలం ఉంది. ఇక్కడ పితృదేవతలకు పిండప్రదానం చేస్తే మోక్షం లభిస్తుందని హిందూ పురాణాలు చెబుతున్నాయి.
బద్రీనాథ్ ఆలయం. బద్రీనాథ్‌కు రెండు కిలోమీటర్ల దూరలో బ్రహ్మకపాలం క్షేత్రం ఉంటుంది
బద్రీనాథ్ ఆలయం. బద్రీనాథ్‌కు రెండు కిలోమీటర్ల దూరలో బ్రహ్మకపాలం క్షేత్రం ఉంటుంది (ANI Pic Service)

బద్రీనాథ్ ఆలయం. బద్రీనాథ్‌కు రెండు కిలోమీటర్ల దూరలో బ్రహ్మకపాలం క్షేత్రం ఉంటుంది

బ్రహ్మకపాలం అనే చోట బ్రహ్మ ఐదో తల పడిందని చెబుతారు. ఈ బ్రహ్మకపాలంలోనే బ్రహ్మ ఐదో తల మోక్షం పొందిందనేది పురాణ కథనం అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. చార్ ధామ్‌లో ఒకటైన బద్రీనాథ్ పుణ్యక్షేత్రానికి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలోనే ఈ బ్రహ్మకపాలం ఉంది. ఇక్కడ పితృదేవతలకు పిండప్రదానం చేస్తే మోక్షం లభిస్తుందని హిందూ పురాణాలు చెబుతున్నాయి. దేశ విదేశాల నుంచి ఇక్కడకు పిండప్రదానం చేయడానికి వస్తుంటారు.

లేటెస్ట్ ఫోటోలు

Mohini Ekadashi : మోహిని ఏకాదశి రోజున ఈ రాశులపై లక్ష్మీదేవి అనుగ్రహం

May 18, 2024, 08:31 AM

మే 18, రేపటి రాశి ఫలాలు.. రేపు విలువైన వస్తువులు పోయే అవకాశం ఉంది, జాగ్రత్త

May 17, 2024, 08:25 PM

Sukraditya yogam: శుక్రాదిత్య యోగం.. ఈ మూడు రాశుల వారికి ఆదాయం పెరుగుతుంది, ఐశ్వర్యం వస్తుంది

May 17, 2024, 02:37 PM

ఈ రాశుల వారికి భారీ ధన లాభం- ఇంకొన్ని రోజుల్లో ప్రమోషన్​!

May 17, 2024, 12:21 PM

saturn Retrograde 2024 : శని తిరోగమనంతో రాజయోగం.. మంచి మంచి ఆఫర్లు వీరి సొంతం

May 17, 2024, 08:14 AM

3 రోజుల్లో వృషభ రాశిలోకి శుక్రుడు.. వీరి కష్టాలు తీరిపోతాయి

May 16, 2024, 04:45 PM

బ్రహ్మ ఐదో తలను శివుడు ఖండించడం వల్లే బ్రహ్మకు నాలుగు తలలు మాత్రమే కనిపిస్తాయి. అంతే కాకుండా బ్రహ్మకు దేవాలయాలు లేకపోవడానికి ఈ తలను ఖండించడానికి మధ్య ఒక ఘటన కూడా ఉందని పురాణాలు చెబుతాయి. ఆ పురాణ కథనంతో పాటు బ్రహ్మకపాలం హిందువులకు పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం కావడానికి గల కారణాలు గురించి చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

ఈ క్షేత్రాన్ని దర్శిస్తే సంతాన, పెళ్లి, వాస్తు దోషాలన్నీ పరిసమాప్తం అవుతాయని నమ్ముతారు. ఎందుకంటే పురాణాల ప్రకారం బ్రహ్మను సృష్టికర్తగా భావిస్తారు. అంటే అతను సమస్త జీవ రాశుల పుట్టుకకు మూలం. అదే విధంగా విష్ణువును స్థితికారకుడని అంటారు. అంటే విష్ణువు ఈ జీవరాసులకు ఎప్పుడు ఏమి ఇవ్వాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటారు. పరమశివుడిని లయకారకుడిగా పేర్కొంటారు. అంటే ఆయన ఏ ఏ జీవరాశిని ఎప్పుడు అంతం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనే విషయంపై నిర్ణయం తీసుకుంటారు. అందువల్లే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను సృష్టి, స్థితి, లయకారకులుగా హిందూ పురాణాలు పేర్కొంటాయి.

బ్రహ్మ కపాలం వెనక పురాణ కథలు

సాధారణంగా బ్రహ్మకు ఐదు తలలు ఉంటాయి. ఇందులో నాలుగు నలుదిక్కులను చూస్తూ ఉంటే ఐదో తల మాత్రం పై వైపునకు ఉంటుంది. అందువల్లే బ్రహ్మకు పంచముఖుడని కూడా పేరు. ఒకసారి బ్రహ్మకు విపరీతమైన గర్వం తలెత్తుతుంది. తానే త్రిమూర్తుల్లో గొప్పవాడనే ఆలోచన తలెత్తుతుంది. తాను జీవరాసులను సృష్టించకపోతే అటు విష్ణువుతో పాటు ఇటు పరమ శివుడికి పని ఏమి ఉండదని తన చుట్టూ ఉన్న మిగిలిన దేవతలు, మునులతో అంటాడు. విష్ణువుతో వాదనకు దిగుతాడు. బ్రహ్మకు విధేయులైన కొంతమంది దేవుళ్లు, మునులు బ్రహ్మ చెప్పినది అక్షరాల సత్యం అని బ్రహ్మను పొగుడుతారు. దీంతో బ్రహ్మ మరింత గర్వంతో రెచ్చిపోతాడు.

ఈ సమయంలోనే బ్రహ్మ విధేయులైన కొంతమంది వైకుంఠానికి వెళ్లి విషయాన్ని విష్ణువుతో చెబుతారు. దీంతో బ్రహ్మ విధేయులకు, విష్ణు భక్తులకు తీవ్ర వాగ్వాదం చెలరేగుతుంది. విష్ణువు బ్రహ్మకు ఎంత సర్ధిచెప్పినా ప్రయోజనం లేకపోతుంది. త్రిమూర్తుల్లో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అన్న భేద భావం ఉండదని ముగ్గురూ సమానమని చెప్పినా బ్రహ్మ వినిపించుకోడు. దీంతో అన్యమనస్కంగానే విష్ణువు త్రిమూర్తుల్లో బ్రహ్మ గొప్పవాడని ఒప్పుకొంటాడు. దీంతో విజయ గర్వంతో బ్రహ్మ కైలాసానికి వెళ్లి త్రిమూర్తుల్లో తానే గొప్పవాడని వాదనకు దిగుతాడు. దీంతో అటు కైలాసవాసులకు, ఇటు బ్రహ్మ విధేయులకు మధ్య తీవ్రమైన గొడవ ప్రారంభమవుతుంది.

ఈ సమయంలో పరమశివుడు బ్రహ్మతో వాదనకు దిగి త్రిమూర్తుల్లో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అన్న భేదం ఉండబోదని ఒప్పిస్తాడు. పైకి త్రిమూర్తులు ముగ్గురూ సమానమేనని ఒప్పుకొంటాడు. అయితే బ్రహ్మకు ఉన్న ఐదో తలలో మాత్రం తాను గొప్పవాడని భావిస్తూ ఉంటాడు. ఈ విషయాన్ని పరమశివుడు పసిగట్టుతాడు. ఇక వేళ ఈ ఆలోచనా ఇలాగే కొనసాగితే సృష్టిలో అల్లకల్లోలం జరుగుతుందని భావిస్తాడు. దీంతో రానున్న ఉపద్రవాన్ని తప్పించడం కోసం పరమశివుడు తన త్రిశూలంతో బ్రహ్మ ఐదో తలను ఖండించి వేస్తాడు.

ఆ తల ప్రస్తుతం బద్రీనాథ్ పుణ్యక్షేత్రం ఉన్న ప్రాంతానికి దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న అలకనంద నదీ తీరంలో పడిపోయిందని చెబుతారు. అటుపై మోక్షం పొందిందని పురాణ కథనం. ఇది జరిగిన తర్వాత బ్రహ్మకు గర్వం తగ్గిపోతుందని పురాణాలు చెబుతున్నాయని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

మన్మథుడి తపస్సుకు మెచ్చి

మరో కథనం ప్రకారం బ్రహ్మ మన్మథుడి తపస్సుకు మెచ్చి మూడు బాణాలు అందజేస్తాడు. వాటిని ఎవరిపై ప్రయోగించినా సమ్మోహనానికి గురయ్యి వారిలో శృంగార కోర్కెలు పెరిగిపోతాయని చెబుతాడు. బాణాలు పనిచేస్తాయో లేదో తెలుసుకోవడం కోసం మన్మథుడు అందులో ఒక బాణాన్ని బ్రహ్మ దేవుడిపైనే ప్రయోగిస్తాడు. దీంతో బ్రహ్మలో కూడా ఆ కోర్కెలు పెరిగిపోతాయి. దీంతో బ్రహ్మే తన పనిలో సాయం చేయడం కోసం సృష్టించిన శతరూప అనే అందమైన యువతిని మోహిస్తాడు. ఆమె ఎక్కడికి పోయినా తన కామపు కోరికలతో ఆమెను చూస్తూ ఉంటాడు. చివరికి బ్రహ్మ నుంచి తప్పించుకోవాలని ఆమె ఆకాశంలోకి వెళుతుంది. బ్రహ్మ తనకు ఉన్న ఐదో శిరస్సుతో ఆమెను కామించడం మొదలు పెడుతాడు. దీంతో సృష్టి కార్యం మొత్తం నిలిచిపోతుంది. విషయం గ్రహించిన పరమశివుడు తన అంశ అయిన వీరభద్రుడిని సృష్టించి బ్రహ్మ ఐదో తలను ఖండించాల్సిందిగా ఆదేశిస్తాడు. వీరభద్రుడు పరమశివుడి ఆదేశాలను అనుసరించి బ్రహ్మ ఐదవ శిరస్సును ఖండిస్తాడు. ఆ తలను బద్రీనాథ్ పుణ్యక్షేత్రం దగ్గరగా ఉన్న అలకనంద నదీ తీరంలో విసిరి వేస్తాడు. అలా బ్రహ్మ శిరస్సు పడిన ప్రాంతమే బ్రహ్మ కపాలంగా చెబుతారు.

ఇదిలా ఉండగా బ్రహ్మ వావివరసలు మరిచి కన్న కూతురు లాంటి శతరూపను కోరుకోవడం వల్ల భూమండలంలో బ్రహ్మకు దేవాలయాలు ఉండకూడదని శివుడు శాపం పెడుతాడు. అందువల్లే బ్రహ్మకు కేవలం రెండు చోట్ల మాత్రమే దేవాలయాలు ఉన్నాయని చెబుతారు. ఈ ఘటనకు జరగడానికి ముందే అక్కడ దేవాలయాలు వెలిసినట్లు పురాణ కథనం. ఇక చేసిన తప్పు పోగొట్టుకోవడానికి బ్రహ్మ ఎల్లవేళలా మిగిలిన నాలుగు తలలతో నాలుగు వేదాలు చదువుతూ ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా బ్రహ్మ శిరస్సు పడి ఆ శిరస్సుకు మోక్షం కలిగినందువల్లే ఈ బ్రహ్మ కపాలం హిందువులకు అత్యంత పవిత్రమైన ప్రాంతంగా చెబుతారు. ఇక్కడ పితృదేవతలకు పిండప్రదానం చేస్తే వారికి కూడా మోక్షం కలుగుతుందని భక్తుల నమ్మకం. అంతే కాకుండా మరెక్కడా పిండ ప్రదానం చేయాల్సిన అవసరం లేదని, సంవత్సరీకం చేయకపోయినా పర్వాలేదని చెబుతారు. అందువల్లే ఈ బ్రహ్మకపాలం వద్ద పెద్ద వారికి శ్రాద్ధ కర్మలు నిర్వహించడానికి హిందువులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు.

చార్ ధామ్ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన బద్రీనాథ్‌కు కేవలం రెండు కిలోమీటర్ల దూరంలోనే బ్రహ్మకపాలం ఉంది. బద్రీనాథ్ వరకూ వాహనాలు వెళతాయి. అక్కడి నుంచి నడక దారిన బ్రహ్మ కపాలం చేరుకోవచ్చు.

- బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
తదుపరి వ్యాసం