తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Temples In India : ప్రతి లక్ష మంది భారతీయులకు 53 దేవాలయాలు.. మెుత్తం ఎన్ని?

Temples In India : ప్రతి లక్ష మంది భారతీయులకు 53 దేవాలయాలు.. మెుత్తం ఎన్ని?

HT Telugu Desk HT Telugu

17 February 2023, 10:05 IST

    • Hindu Temples : భారతదేశానికి ఘనమైన చరిత్ర ఉంది. హిందూమతం పురాతనమైనది. ఇక హిందూ దేవాలయాలకు వేల ఏళ్ల చరిత్ర ఉంది. ఇండియాలో మెుత్తం ఎన్ని ఆలయాలు ఉన్నాయి?
లక్ష్మీ నారాయణి గోల్డెన్ టెంపుల్, తమిళనాడు
లక్ష్మీ నారాయణి గోల్డెన్ టెంపుల్, తమిళనాడు (twitter)

లక్ష్మీ నారాయణి గోల్డెన్ టెంపుల్, తమిళనాడు

దేవాలయాలు భారతీయ సంస్కృతి, చరిత్ర(History)లో అంతర్భాగంగా ఉన్నాయి. మన దేశం ప్రపంచంలోని పురాతన నాగరికతలలో ఒకటిగా ఉంది. ఇక్కడ చాలా చరిత్ర, ఇతిహాసాలు, సంప్రదాయాలు ఉన్నాయి. భారతదేశంలో హిందూమతం చాలా పురాతనమైది. అనేక గ్రంథాలు ఇదే విషయాన్ని చెబుతాయి. ఇక హిందూ ఆలయాలు(Hindu Temples) చాలా ఉన్నాయి. వాటికి ఎప్పుడూ భక్తులు వెళ్తూనే ఉంటారు. వేదాలు హిందూమతానికి పురాతన గ్రంథాలుగా పరిగణిస్తారు. ఇతర దేశాల్లోనూ.. హిందూ మతాన్ని గౌరవించేవారు ఉన్నారు. దేవాలయాలూ ఉన్నాయి.

లేటెస్ట్ ఫోటోలు

ఈ రాశుల వారికి కష్టాలు తప్పవు! ఆర్థికంగా ఇబ్బందులు- జీవితంలో ఒడుదొడుకులు..

May 06, 2024, 09:45 AM

Saturn Retrograde : శని తిరోగమనం.. వీరికి జీతాల్లో పెంపు, అన్నీ శుభవార్తలే

May 06, 2024, 08:32 AM

ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి! ఆరోగ్య సమస్యలు- భారీ డబ్బు నష్టం..

May 05, 2024, 04:07 PM

Bad Luck Rasi : ఈ రాశులవారికి కష్టకాలం, ధన నష్టం జరిగే అవకాశం.. జాగ్రత్త

May 05, 2024, 08:38 AM

అదృష్టం అంతా ఈ రాశుల వారిదే.. భారీ ధన లాభం, ఉద్యోగంలో ప్రమోషన్​!

May 04, 2024, 01:28 PM

Lord Mars : కుజుడి కారణంగా ఈ రాశులవారు అన్ని విషయాల్లో జాగ్రత్త

May 04, 2024, 08:26 AM

దేవాలయాలు హిందువుల విశ్వాసంతో ముడిపడి ఉన్నాయి. పూజలు చేసేందుకు, దేవుళ్లను ఆరాధించడానికి ఆలయాలను సందర్శిస్తారు. కొంతమంది వ్యక్తులు ప్రతిరోజూ దేవాలయాలను సందర్శించడానికి ఇష్టపడతారు. అయితే, చాలా మంది ప్రజలు ప్రత్యేక సందర్భాలలో, పండుగల సమయంలో ఆలయాలకు వెళ్తారు. దేశంలో లక్షల సంఖ్యలో దేవాలయాలు ఉన్నాయి. కొన్ని దేవాలయాలు చాలా ప్రసిద్ధి చెందినవి. ఏది ఏమైనా.. దేశవ్యాప్తంగా దేవాలయాలు విస్తృతంగా సందర్శిస్తారు హిందూవులు.

India in Pixels by Ashris లెక్కల ప్రకారం.. భారతదేశంలో దాదాపు 6.48 లక్షల దేవాలయాలు ఉన్నాయి. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల జాబితాలో తమిళనాడు 79,154 దేవాలయాలతో అగ్రస్థానంలో ఉంది. తమిళనాడు తర్వాత 77,283 దేవాలయాలతో మహారాష్ట్ర, ఆ తర్వాత కర్ణాటక, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి. మిజోరాంలో అత్యల్ప సంఖ్యలో దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడ 32 దేవాలయాలు మాత్రమే ఉన్నాయి. ప్రతి రాష్ట్రంలో ప్రతి లక్ష మంది భారతీయులకు దాదాపు 53 హిందూ దేవాలయాలు ఉన్నాయని డేటా పేర్కొంది. తెలంగాణలో 28,312 ఆలయాలు ఉండగా.., ఏపీలో 47,152గా ఉన్నాయి.

హిందూ దేవాలయాలు