తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Kuja Dosha Nivarana: కుజ దోష నివారణ పరిహారాలు ఇలా చేయండి

kuja dosha nivarana: కుజ దోష నివారణ పరిహారాలు ఇలా చేయండి

HT Telugu Desk HT Telugu

18 January 2023, 11:07 IST

google News
    • kuja dosha nivarana: కుజ దోషం వల్ల చాలా మంది ప్రభావితమవుతారని జ్యోతిష్యులు చెబుతుంటారు. నివారణకు తగిన పరిహారాలు అనుసరించాలని చెబుతుంటారు. ఎలాంటి ఖర్చు లేని పరిహారాలు మీకోసం..
కుజ దోష నివారణకు పరిహారాలు
కుజ దోష నివారణకు పరిహారాలు

కుజ దోష నివారణకు పరిహారాలు

కుజదోషం ఉంటే జీవితంలో పలు సమస్యలు సంభవిస్తాయంటారు. కుజ దోష నివారణకు అనేక పరిహారాలు ప్రచారంలో ఉన్నాయి. జ్యోతిష్య శాస్త్ర నిపుణుల సలహా మేరకు ఆయా పరిహారాలు చేయడం వల్ల కుజ దోషం నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది. కుజ దోషం వల్ల ఎక్కువ వైవాహిక జీవితంలో సమస్యలు, వివాహం కావడం ఆలస్యమవడం, సంతానం పొందడంలో సమస్యలు ఏర్పడుతాయి. మానసిక ఉద్రిక్తతలు, దంపతుల మధ్య గొడవలు, సంతాన లేమి, విడాకులు వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుందని చెబుతారు. కుజ మంత్రాలను పఠించడం ద్వారా కుజ దోషం నుంచి ఉపశమనం పొందవచ్చు.

కుజ దోష నివారణకు పరిహారాలు

  1. కుజ దోష నివారణకు 12 రోజుల పాటు రోజుకు 9 సార్లు సుబ్రమణ్య అష్టోత్తర శతనామావళి పారాయణం చేయాలి. అలాగే ఒకసారి వల్లీ, దేవసేన అష్టోత్తర శతనామాలు చదవాలి.
  2. అష్టమూలికా తైలంతో సుబ్రమణ్య స్వామికి దీపారాధన చేయాలి. శని, ఆది, సోమ వారాల్లో రాహు కాలంలో ఇలా చేయాలి. దీపం వెలిగించేందుకు ఎర్రటి వత్తులు వాడాలి. 
  3. కుజ దోష నివారణకు సుబ్రమణ్యమాలా మంత్రం 42 రోజుల పాటు రోజుకు ఒకసారి పారాయణం చేయాలి.
  4. సుబ్రమణ్య కరవలాంబ స్తోత్రం 11 రోజుల పాటు రోజుకు 80 సార్లు చదవాలి.
  5. కుజ దోష నివారణకు శివాలయంలో ఏకరుద్రాభిషేకం చేయించాలి. ఏడు మంగళ వారాలు ఇలా చేయాలి. ఉదయం 7 గంటల లోపు ఇలా చేయించాలి.
  6. ఆదివారం రాహుకాలం (సాయంత్రం 4.30 నుంచి 6 గంటలలోపు) నిమ్మ కాయ డొప్పలో దీపారాధన చేయాలి. తదుపరి సుబ్రమణ్య అష్టకం చదవాలి.
  7. నాగుల పుట్టను దర్శించుకున్నప్పుడు పుట్టమన్ను చెవికి ధరించాలి.
  8. అష్టమూలికా తైలంతో సుబ్రమణ్య స్వామికి దీపారాధన చేయాలి. శని, ఆది, సోమ వారాల్లో రాహు కాలంలో ఇలా చేయాలి. దీపం వెలిగించేందుకు ఎర్రటి వత్తులు వాడాలి.
  9. కుజ దోషం ఉన్నప్పుడు పెళ్లి సంబంధ విషయాలపై మీకు తెలిసిన జ్యోతిష్య శాస్త్ర నిపుణుడిని సంప్రదించడం మంచిది. వారు తగిన రత్నాన్ని సూచిస్తారు. అలాగే జ్యోతిష శాస్త్రం ప్రకారం చెట్టుతో వివాహం జరిపిస్తారు.

టాపిక్

తదుపరి వ్యాసం