బ్రహ్మముహూర్తం ఎప్పుడు? ఈ సమయంలో ఎందుకు నిద్ర లేవాలి?
18 May 2023, 10:55 IST
- బ్రహ్మముహూర్తం, బ్రాహ్మీ ముహూర్తం నందు నిద్ర లేచి ఉండాలని అంటారు. మరి బ్రహ్మముహూర్తం ఏ సమయంలో వస్తుంది?
బ్రాహ్మీముహూర్తం అంటే ఏ సమయమో తెలుసా?
బ్రహ్మముహూర్తం నందు నిద్ర లేచి ఉండాలని అంటారు. మరి బ్రాహ్మీ ముహూర్తం ఏ సమయంలో వస్తుంది? సూర్యోదయం సమయానికి సరిగ్గా 88 నిమిషాల ముందు.. అంటే 1 గంటా 22 నిమిషాల ముందు బ్రహ్మముహూర్తం వస్తుంది. దీనినే ప్రాత:కాలం అని అంటారు. సూర్యనారాయణుడి సారథుడే అరుణుడు. ఎర్రటి కాంతితో సారథి అరుణుడు కనిపిస్తాడు. దీనినే అరుణోదయం అంటారు. ఆ తరువాత బంగారు కాంతితో సూర్య భగవానుడు దర్శనమిస్తాడు. సూర్యోదయ, సూర్యాస్తమయ వేళలు తెలుగు క్యాలెండర్‌లో మనం తెలుసుకోవచ్చు. వీటి ఆధారంగా ప్రతి రోజు బ్రహ్మముహూర్త సమయాన్ని మనం లెక్కించవచ్చు.
బ్రహ్మ ముహూర్త సమయంలో నిద్ర లేవడం వల్ల కలిగే లాభాలు
వివాహాది శుభకార్యాలతో పాటు అన్ని శుభకార్యాలకు బ్రహ్మ ముహూర్తాన్ని అనువైన సమయంగా ఎంచుకుంటారు. లోకం అంతటికీ కాంతి ఇవ్వగలిగిన వారు సూర్యభగవానులు. ఈ కాంతి ఇవ్వడానికి 88 నిమిషాల ముందుగా ఉన్న ప్రభాత కాలంలో ప్రకృతి అంతా భగవత్ శక్తితో నిండిఉంటుంది. దీనినే బ్రాహ్మీ ముహూర్తం అంటారు. సరస్వతీ దేవి అనుగ్రహం ప్రసరణ కలిగే సమయం.
ఈ బ్రహ్మ ముహూర్తం మనస్సులో తలెత్తే సమస్యలను తొలగించడానికి , దైవిక ఆలోచనను మనస్సులో ఉంచడానికి భగవంతుడు ఇచ్చిన అద్భుతమైన సమయం అని చెబుతారు. ఇంత యోగ్యమైన కాలం కాబట్టే దీనికి ప్రభాతకాలం అంటారు.
ఈ సమయంలో శివుడిని ఆరాధిస్తే జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయని చెబుతారు. ఈ సమయంలో శివుడిని పూజించడం ద్వారా బ్రహ్మదేవుడు అనేక వరాలను పొందాడని కూడా చెబుతారు. అందుకే ఈ సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అని పిలిచేవారని పురాణాలు చెబుతున్నాయి.
ఈ సమయంలో మనం కూడా నిద్రలేచి స్నానం చేసి మనకు కావలసిన పనులు మొదలుపెడితే అది విజయంతో ముగుస్తుందని చెబుతారు. స్నానం చేయలేని వారు పళ్లు తోముకుంటే కనీసం చేతులు, కాళ్లు శుభ్రం చేసుకోవచ్చని చెబుతున్నారు. బ్రహ్మ ముహూర్తం సమయం గురించి ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి.
సూర్యోదయానికి 88 నిమిషాల ముందు బ్రాహ్మీ ముహూర్తం ప్రారంభమవుతుందని చదువుకున్నాం కదా.. ఇది అత్యంత పవిత్రమైన ముహూర్తంగా భావిస్తారు. ఈ బ్రహ్మ ముహూర్త సమయంలో వివాహం, గృహ ప్రవేశం వంటి అన్ని శుభకార్యాలు జరిగితే, ఇంటికి శుభ స్వభావం కొనసాగుతుందని చెబుతారు.
బ్రహ్మముహూర్త సమయంలో నక్షత్ర, యోగ దోషాలు ఉండవని, ఆ సమయం ఎల్లప్పుడూ శుభకార్యాలకు ముహూర్తం అని చెబుతారు. బ్రహ్మ ముహూర్తంలో ఈ శుభసమయంలో ఇంట్లోని పూజగదిలో దీపం వెలిగించి పూజిస్తే సకల సుఖసంతోషాలు కలుగుతాయని విశ్వాసం.
టాపిక్