తెలుగు న్యూస్  /  ఫోటో  /  Yadadri Temple : యాదాద్రి భక్తులకు శుభవార్త - అరుణాచలం తరహాలో 'గిరి ప్రదక్షిణ' సేవ, తొలి ఆలయం ఇదే..!

Yadadri Temple : యాదాద్రి భక్తులకు శుభవార్త - అరుణాచలం తరహాలో 'గిరి ప్రదక్షిణ' సేవ, తొలి ఆలయం ఇదే..!

19 June 2024, 18:05 IST

Giri Pradakshina at Yadadri Temple : యాదాద్రి భక్తులకు శుభవార్త చెప్పింది దేవాదాయశాఖ. అరుణాచలం తరహాలోనే యాదగిరిగుట్టలోనూ 'గిరి ప్రదక్షిణ' సేవ అందుబాటులోకి వచ్చింది. జూన్ 18వ తేదీన ఈ క్రతువు ప్రారంభం కాగా… ఇక నుంచి ప్రతి నెలా గిరి ప్రదక్షిణ పర్వాన్ని కొనసాగించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

  • Giri Pradakshina at Yadadri Temple : యాదాద్రి భక్తులకు శుభవార్త చెప్పింది దేవాదాయశాఖ. అరుణాచలం తరహాలోనే యాదగిరిగుట్టలోనూ 'గిరి ప్రదక్షిణ' సేవ అందుబాటులోకి వచ్చింది. జూన్ 18వ తేదీన ఈ క్రతువు ప్రారంభం కాగా… ఇక నుంచి ప్రతి నెలా గిరి ప్రదక్షిణ పర్వాన్ని కొనసాగించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
అరుణాచలం, సింహాచలం తరహాలో గిరి ప్రదక్షిణసేవను యాదగిరిగుట్ట దేవస్థానం అందుబాటులోకి తీసుకువచ్చింది. ”గిరి ప్రదక్షిణ”ను ప్రవేశపెట్టిన తెలంగాణలో మొట్టమొదటి ఆలయంగా యాదాద్రి దేవస్థానం నిలిచింది.
(1 / 7)
అరుణాచలం, సింహాచలం తరహాలో గిరి ప్రదక్షిణసేవను యాదగిరిగుట్ట దేవస్థానం అందుబాటులోకి తీసుకువచ్చింది. ”గిరి ప్రదక్షిణ”ను ప్రవేశపెట్టిన తెలంగాణలో మొట్టమొదటి ఆలయంగా యాదాద్రి దేవస్థానం నిలిచింది.(Image Source YTDA Website)
మంగళవారం(జూన్ 18, 2024) తొలిసారిగా యాదాద్రి ఆలయంలో ‘గిరి ప్రదక్షిణ’ వైభవంగా జరిగింది. స్వామి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా ఉదయం నిర్వహించిన ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, ఆలయ ఈవో భాస్కరరావు సమక్షంలో వైకుంఠ ద్వారం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొండ చుట్టూ ప్రదక్షిణ చేశారు.
(2 / 7)
మంగళవారం(జూన్ 18, 2024) తొలిసారిగా యాదాద్రి ఆలయంలో ‘గిరి ప్రదక్షిణ’ వైభవంగా జరిగింది. స్వామి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా ఉదయం నిర్వహించిన ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, ఆలయ ఈవో భాస్కరరావు సమక్షంలో వైకుంఠ ద్వారం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొండ చుట్టూ ప్రదక్షిణ చేశారు.
యాదాద్రీశుడి ఆలయం చుట్టూ ఐదున్నర కిలోమీటర్ల మేరకు భక్తులకు ఇబ్బంది కలగకుండా వీధిని ఏర్పాటు చేశారు. ఫలితంగా వేలాది వేల మంది భక్తులు గిరి ప్రదక్షిణ చేసుకునే అవకాశం లభించింది.,
(3 / 7)
యాదాద్రీశుడి ఆలయం చుట్టూ ఐదున్నర కిలోమీటర్ల మేరకు భక్తులకు ఇబ్బంది కలగకుండా వీధిని ఏర్పాటు చేశారు. ఫలితంగా వేలాది వేల మంది భక్తులు గిరి ప్రదక్షిణ చేసుకునే అవకాశం లభించింది.,(Image Source YTDA Website)
యాదాద్రిలోని లక్ష్మీనరసింహ స్వామివారికి ఇప్పటివరకు స్థానిక భక్తులే గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. కానీ ప్రస్తుతం అరుణాచలం, సింహాచలం తరహాలో భక్తులందరికీ గిరి ప్రదక్షిణ చేసే అవకాశం లభించింది. ఏ మాత్రం ఇబ్బుదుల తలెత్తకుండా ఈ ఏర్పాట్లు చేశారు.
(4 / 7)
యాదాద్రిలోని లక్ష్మీనరసింహ స్వామివారికి ఇప్పటివరకు స్థానిక భక్తులే గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. కానీ ప్రస్తుతం అరుణాచలం, సింహాచలం తరహాలో భక్తులందరికీ గిరి ప్రదక్షిణ చేసే అవకాశం లభించింది. ఏ మాత్రం ఇబ్బుదుల తలెత్తకుండా ఈ ఏర్పాట్లు చేశారు.(Image Source YTDA Website)
అరుణాచలంలో చూస్తే గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్లు ఉంటుంది. ఇక యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో మాత్రం గిరి ప్రదక్షిణ 5 కిలోమీటర్లు ఉంటుంది.
(5 / 7)
అరుణాచలంలో చూస్తే గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్లు ఉంటుంది. ఇక యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో మాత్రం గిరి ప్రదక్షిణ 5 కిలోమీటర్లు ఉంటుంది.(Image Source YTDA Website)
గిరి ప్రదక్షిణ అనంతరం భక్తులకు ఉచితంగా స్వామివారి దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. 
(6 / 7)
గిరి ప్రదక్షిణ అనంతరం భక్తులకు ఉచితంగా స్వామివారి దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. (Image Source Twitter)
తెలంగాణలో ఉన్న ఆలయాల్లో గిరి ప్రదక్షిణ”ను ప్రవేశపెట్టిన  మొట్టమొదటి ఆలయంగా యాదాద్రి దేవస్థానం రికార్డుల్లోకి ఎక్కింది. ఇక నుంచి ప్రతి నెలా గిరి ప్రదక్షిణ పర్వాన్ని కొనసాగించేందుకు యాదాద్రి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
(7 / 7)
తెలంగాణలో ఉన్న ఆలయాల్లో గిరి ప్రదక్షిణ”ను ప్రవేశపెట్టిన  మొట్టమొదటి ఆలయంగా యాదాద్రి దేవస్థానం రికార్డుల్లోకి ఎక్కింది. ఇక నుంచి ప్రతి నెలా గిరి ప్రదక్షిణ పర్వాన్ని కొనసాగించేందుకు యాదాద్రి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.(Image Source Twitter)

    ఆర్టికల్ షేర్ చేయండి