తెలుగు న్యూస్  /  ఫోటో  /  Wtc Points Table: డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‍కు టీమిండియా.. న్యూజిలాండ్ ఓటమితో..

WTC Points Table: డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‍కు టీమిండియా.. న్యూజిలాండ్ ఓటమితో..

03 March 2024, 19:26 IST

WTC Points Table - Team India: ప్రపంచ టెస్టు చాంపియన్‍షిప్ 2023-25 పాయింట్ల టేబుల్‍లో భారత జట్టు టాప్ ప్లేస్‍కు చేరుకుంది. ఆస్ట్రేలియా చేతిలో న్యూజిలాండ్ ఓడిపోవటంతో టీమిండియా పైకి వెళ్లింది. ఆ వివరాలివే..

  • WTC Points Table - Team India: ప్రపంచ టెస్టు చాంపియన్‍షిప్ 2023-25 పాయింట్ల టేబుల్‍లో భారత జట్టు టాప్ ప్లేస్‍కు చేరుకుంది. ఆస్ట్రేలియా చేతిలో న్యూజిలాండ్ ఓడిపోవటంతో టీమిండియా పైకి వెళ్లింది. ఆ వివరాలివే..
ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‍షిప్ (WTC) 2023-25 పాయింట్ల పట్టికలో టీమిండియా టాప్ ప్లేస్‍కు దూసుకెళ్లింది. ఈ డబ్ల్యూటీసీ సైకిల్‍లో ప్రస్తుతం 64.58 శాతం గెలుపులతో అగ్రస్థానానికి చేరింది. 
(1 / 5)
ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‍షిప్ (WTC) 2023-25 పాయింట్ల పట్టికలో టీమిండియా టాప్ ప్లేస్‍కు దూసుకెళ్లింది. ఈ డబ్ల్యూటీసీ సైకిల్‍లో ప్రస్తుతం 64.58 శాతం గెలుపులతో అగ్రస్థానానికి చేరింది. (ANI )
ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో నేడు న్యూజిలాండ్ 172 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. దీంతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో 60 శాతంతో రెండో స్థానానికి న్యూజిలాండ్ పడిపోయింది. టీమిండియా టాప్‍కు వెళ్లింది. 
(2 / 5)
ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో నేడు న్యూజిలాండ్ 172 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. దీంతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో 60 శాతంతో రెండో స్థానానికి న్యూజిలాండ్ పడిపోయింది. టీమిండియా టాప్‍కు వెళ్లింది. (AFP)
రెండు టెస్టుల సిరీస్‍లో భాగంగా వెల్లింగ్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో హోం టీమ్ న్యూజిలాండ్‍కు షాక్ ఎదురైంది. ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లయన్ ఆరు వికెట్లతో విజృంభించడంతో రెండో ఇన్నింగ్స్‌లో కివీస్ 196 పరుగులకే ఆలౌటై.. పరాజయం పాలైంది. 
(3 / 5)
రెండు టెస్టుల సిరీస్‍లో భాగంగా వెల్లింగ్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో హోం టీమ్ న్యూజిలాండ్‍కు షాక్ ఎదురైంది. ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లయన్ ఆరు వికెట్లతో విజృంభించడంతో రెండో ఇన్నింగ్స్‌లో కివీస్ 196 పరుగులకే ఆలౌటై.. పరాజయం పాలైంది. (AFP)
డబ్ల్యూటీసీ 2023-25 సైకిల్ పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఆస్ట్రేలియా (59 శాతం), బంగ్లాదేశ్ (50 శాతం), పాకిస్థాన్ (36.66) ప్రస్తుతం మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి. వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, శ్రీలంక ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా ఉన్నాయి. 
(4 / 5)
డబ్ల్యూటీసీ 2023-25 సైకిల్ పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఆస్ట్రేలియా (59 శాతం), బంగ్లాదేశ్ (50 శాతం), పాకిస్థాన్ (36.66) ప్రస్తుతం మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి. వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, శ్రీలంక ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా ఉన్నాయి. (AFP)
భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదో టెస్టు మార్చి 7వ తేదీన ధర్మశాల వేదికగా మొదలుకానుంది. ఇప్పటికే ఈ టెస్టు సిరీస్‍ను 3-1తో భారత్ దక్కించుకుంది. ఈ ఐదో టెస్టు కూడా గెలిస్తే డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‍ను మరింత పదిలం చేసుకుంటుంది రోహిత్ సేన. 
(5 / 5)
భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదో టెస్టు మార్చి 7వ తేదీన ధర్మశాల వేదికగా మొదలుకానుంది. ఇప్పటికే ఈ టెస్టు సిరీస్‍ను 3-1తో భారత్ దక్కించుకుంది. ఈ ఐదో టెస్టు కూడా గెలిస్తే డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‍ను మరింత పదిలం చేసుకుంటుంది రోహిత్ సేన. (PTI)

    ఆర్టికల్ షేర్ చేయండి