తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ind Vs Nz Women T20 World Cup: మహిళల టీ20 ప్రపంచకప్‍లో భారత్ తొలి మ్యాచ్ ఎప్పుడు? లైవ్ ఎక్కడ చూడొచ్చంటే..

IND vs NZ Women T20 World Cup: మహిళల టీ20 ప్రపంచకప్‍లో భారత్ తొలి మ్యాచ్ ఎప్పుడు? లైవ్ ఎక్కడ చూడొచ్చంటే..

02 October 2024, 16:50 IST

IND vs NZ Women's T20 World Cup: మహిళల టీ20 ప్రపంచకప్ టోర్నీలో సత్తాచాటేందుకు భారత్ సిద్ధమైంది. ఈ మెగాటోర్నీలో తన తొలి మ్యాచ్‍ను అక్టోబర్ 4న న్యూజిలాండ్‍తో టీమిండియా ఆడనుంది. ఆ వివరాలు ఇవే.

  • IND vs NZ Women's T20 World Cup: మహిళల టీ20 ప్రపంచకప్ టోర్నీలో సత్తాచాటేందుకు భారత్ సిద్ధమైంది. ఈ మెగాటోర్నీలో తన తొలి మ్యాచ్‍ను అక్టోబర్ 4న న్యూజిలాండ్‍తో టీమిండియా ఆడనుంది. ఆ వివరాలు ఇవే.
మహిళల టీ20 ప్రపంచకప్ యూఏఈ వేదికగా గురువారం (అక్టోబర్ 3) షురూ కానుంది. న్యూజిలాండ్‍తో మ్యాచ్‍తో ఈ మెగాటోర్నీలో తన వేటను టీమిండియా షురూ చేయనుంది. భారత్, న్యూజిలాండ్ మధ్య శుక్రవారం (అక్టోబర్ 4) గ్రూప్-ఏ మ్యాచ్ జరగనుంది. 
(1 / 6)
మహిళల టీ20 ప్రపంచకప్ యూఏఈ వేదికగా గురువారం (అక్టోబర్ 3) షురూ కానుంది. న్యూజిలాండ్‍తో మ్యాచ్‍తో ఈ మెగాటోర్నీలో తన వేటను టీమిండియా షురూ చేయనుంది. భారత్, న్యూజిలాండ్ మధ్య శుక్రవారం (అక్టోబర్ 4) గ్రూప్-ఏ మ్యాచ్ జరగనుంది. (BCCIWomen - X)
భారత్, న్యూజిలాండ్ మధ్య అక్టోబర్  4న ఈ మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరగనుంది. హర్మన్‍ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత్ ఈ టోర్నీకి పూర్తిగా సిద్ధమైంది. ఈ తొలి మ్యాచ్ గెలిసి శుభారంభం చేయాలని పట్టుదలతో ఉంది. అలాగే, తొలిసారి ఐసీసీ టోర్నీ పట్టాలనే కసితో టోర్నీలో భారత్ బరికి తిగుతోంది. టోర్నీకి ముందు జరిగిన రెండు వామప్ మ్యాచ్‍ల్లోనూ టీమిండియా గెలిచింది.  
(2 / 6)
భారత్, న్యూజిలాండ్ మధ్య అక్టోబర్  4న ఈ మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరగనుంది. హర్మన్‍ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత్ ఈ టోర్నీకి పూర్తిగా సిద్ధమైంది. ఈ తొలి మ్యాచ్ గెలిసి శుభారంభం చేయాలని పట్టుదలతో ఉంది. అలాగే, తొలిసారి ఐసీసీ టోర్నీ పట్టాలనే కసితో టోర్నీలో భారత్ బరికి తిగుతోంది. టోర్నీకి ముందు జరిగిన రెండు వామప్ మ్యాచ్‍ల్లోనూ టీమిండియా గెలిచింది.  (BCCI Women-X)
టీమిండియా, న్యూజిలాండ్ మధ్య ఈ మ్యాచ్ అక్టోబర్ 4వ తేదీ సాయంత్రం 7 గంటల 30 నిమిషాలకు మొదలవుతుంది. అందుకు అరగంట ముందు టాస్ పడుతుంది. 
(3 / 6)
టీమిండియా, న్యూజిలాండ్ మధ్య ఈ మ్యాచ్ అక్టోబర్ 4వ తేదీ సాయంత్రం 7 గంటల 30 నిమిషాలకు మొదలవుతుంది. అందుకు అరగంట ముందు టాస్ పడుతుంది. (Nepal Cricket- X)
మహిళల టీ20 ప్రపంచకప్ టోర్నీ స్టార్ స్పోర్ట్ నెట్‍వర్క్ టీవీ ఛానెళ్లలో లైవ్ టెలికాస్ట్ అవనుంది. డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ చూడొచ్చు. 
(4 / 6)
మహిళల టీ20 ప్రపంచకప్ టోర్నీ స్టార్ స్పోర్ట్ నెట్‍వర్క్ టీవీ ఛానెళ్లలో లైవ్ టెలికాస్ట్ అవనుంది. డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ చూడొచ్చు. (BCCI-X)
టీ20 ప్రపంచకప్‍కు ఎంపికైన భారత మహిళల జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్,  రిచా ఘోష్, దీప్తి శర్మ, యస్తిక భాటియా, పూజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్, దయాలన్ హేమలత, ఆశా శోభన, రాధా యాదవ్, సజన సజీవన్, శ్రేయాంక పాటిల్
(5 / 6)
టీ20 ప్రపంచకప్‍కు ఎంపికైన భారత మహిళల జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్,  రిచా ఘోష్, దీప్తి శర్మ, యస్తిక భాటియా, పూజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్, దయాలన్ హేమలత, ఆశా శోభన, రాధా యాదవ్, సజన సజీవన్, శ్రేయాంక పాటిల్(PTI)
మహిళల టీ20 ప్రపంచకప్ గ్రూప్-ఏలో భారత్ నాలుగు మ్యాచ్‍లు ఆడనుంది. అక్టోబర్ 4న న్యూజిలాండ్‍తో, అక్టోబర్ 6న పాకిస్థాన్‍తో, అక్టోబర్ 9న శ్రీలంకతో, అక్టోబర్ 13న ఆస్ట్రేలియాతో టీమిండియా తలపడనుంది. గ్రూప్-ఏలో టాప్-2లో నిలిస్తే సెమీస్ చేరుతుంది. 
(6 / 6)
మహిళల టీ20 ప్రపంచకప్ గ్రూప్-ఏలో భారత్ నాలుగు మ్యాచ్‍లు ఆడనుంది. అక్టోబర్ 4న న్యూజిలాండ్‍తో, అక్టోబర్ 6న పాకిస్థాన్‍తో, అక్టోబర్ 9న శ్రీలంకతో, అక్టోబర్ 13న ఆస్ట్రేలియాతో టీమిండియా తలపడనుంది. గ్రూప్-ఏలో టాప్-2లో నిలిస్తే సెమీస్ చేరుతుంది. (PTI)

    ఆర్టికల్ షేర్ చేయండి