తెలుగు న్యూస్  /  ఫోటో  /  Harvik Desai: కొత్త ప్లేయర్‌ను తీసుకున్న ముంబై ఇండియన్స్.. ఎవరీ హర్విక్ దేశాయ్?

Harvik Desai: కొత్త ప్లేయర్‌ను తీసుకున్న ముంబై ఇండియన్స్.. ఎవరీ హర్విక్ దేశాయ్?

11 April 2024, 17:37 IST

Harvik Desai - Mumbai Indians: ప్రస్తుత ఐపీఎల్ 2024 సీజన్ కోసం యంగ్ వికెట్ కీపర్ బ్యాటర్ హర్విక్ దేశాయ్‍ను ముంబై ఇండియన్స్ తీసుకుంది. ఈ ప్లేయర్ ఎవరో ఇక్కడ చూడండి.

  • Harvik Desai - Mumbai Indians: ప్రస్తుత ఐపీఎల్ 2024 సీజన్ కోసం యంగ్ వికెట్ కీపర్ బ్యాటర్ హర్విక్ దేశాయ్‍ను ముంబై ఇండియన్స్ తీసుకుంది. ఈ ప్లేయర్ ఎవరో ఇక్కడ చూడండి.
సౌరాష్ట్ర వికెట్ కీపర్ బ్యాటర్ హర్విక్ దేశాయ్‍ను ముంబై ఇండియన్స్‌ ఫ్రాంచైజీ ఎంపిక చేసుకుంది. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2024 సీజన్ కోసం అతడిని తీసుకుంది. 
(1 / 5)
సౌరాష్ట్ర వికెట్ కీపర్ బ్యాటర్ హర్విక్ దేశాయ్‍ను ముంబై ఇండియన్స్‌ ఫ్రాంచైజీ ఎంపిక చేసుకుంది. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2024 సీజన్ కోసం అతడిని తీసుకుంది. (Photo: Mumbai Indians)
గాయం కారణంగా విష్ణు వినోద్ ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. దీంతో అతడి స్థానంలో 24ఏళ్ల హర్విక్ దేశాయ్‍ను ముంబై తీసుకుంది. 
(2 / 5)
గాయం కారణంగా విష్ణు వినోద్ ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. దీంతో అతడి స్థానంలో 24ఏళ్ల హర్విక్ దేశాయ్‍ను ముంబై తీసుకుంది. 
సౌరాష్ట్ర బ్యాటర్ హర్విక్ దేశాయ్.. దేశవాళీ టో20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2023 సీజన్‍లో 9 మ్యాచ్‍ల్లోనే 336 పరుగులతో అదరగొట్టాడు. సుమారు 175 స్ట్రయిక్ రేట్‍తో బిగ్ హిట్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఓ సెంచరీ కూడా చేశాడు. మొత్తంగా దేశవాళీ టీ20ల్లో ఇప్పటి వరకు 27 మ్యాచ్‍ల్లో 691 పరుగులు చేశాడు. దీంతో ముంబై ఇండియన్స్ అతడిని తీసుకుంది. 
(3 / 5)
సౌరాష్ట్ర బ్యాటర్ హర్విక్ దేశాయ్.. దేశవాళీ టో20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2023 సీజన్‍లో 9 మ్యాచ్‍ల్లోనే 336 పరుగులతో అదరగొట్టాడు. సుమారు 175 స్ట్రయిక్ రేట్‍తో బిగ్ హిట్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఓ సెంచరీ కూడా చేశాడు. మొత్తంగా దేశవాళీ టీ20ల్లో ఇప్పటి వరకు 27 మ్యాచ్‍ల్లో 691 పరుగులు చేశాడు. దీంతో ముంబై ఇండియన్స్ అతడిని తీసుకుంది. (Photo: BCCI)
2018లో అండర్-19 ప్రపంచకప్ టోర్నీ టైటిల్ గెలిచిన భారత జట్టులోనూ హర్విక్ దేశాయ్ ఉన్నాడు. ఫైనల్‍లో విన్నింగ్ రన్స్ కొట్టిందే హర్వికే (47 నాటౌట్). 
(4 / 5)
2018లో అండర్-19 ప్రపంచకప్ టోర్నీ టైటిల్ గెలిచిన భారత జట్టులోనూ హర్విక్ దేశాయ్ ఉన్నాడు. ఫైనల్‍లో విన్నింగ్ రన్స్ కొట్టిందే హర్వికే (47 నాటౌట్). 
2018లో సౌరాష్ట్ర తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్‍లో అరంగేట్రం చేశాడు హర్విక్ దేశాయ్. ఇప్పటి వరకు 46 రంజీ మ్యాచ్‍ల్లో 33.64 సగటుతో 2,658 పరుగులు చేశాడు. అందులో 5 సెంచరీలు, 16 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 
(5 / 5)
2018లో సౌరాష్ట్ర తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్‍లో అరంగేట్రం చేశాడు హర్విక్ దేశాయ్. ఇప్పటి వరకు 46 రంజీ మ్యాచ్‍ల్లో 33.64 సగటుతో 2,658 పరుగులు చేశాడు. అందులో 5 సెంచరీలు, 16 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. (Photo: BCCI)

    ఆర్టికల్ షేర్ చేయండి