తెలుగు న్యూస్  /  ఫోటో  /  Tg Indiramma Housing Survey : 'ఇందిరమ్మ' ఇళ్ల సర్వే అప్డేట్ - దరఖాస్తుదారుడి వద్ద ఉండాల్సిన వివరాలు, పత్రాలివే..!

TG Indiramma Housing Survey : 'ఇందిరమ్మ' ఇళ్ల సర్వే అప్డేట్ - దరఖాస్తుదారుడి వద్ద ఉండాల్సిన వివరాలు, పత్రాలివే..!

24 December 2024, 5:02 IST

TG Indiramma Housing Survey Updates : 'ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గుర్తింపు కోసం సర్వే నడుస్తోంది. ఈనెలాఖారులోపు సర్వే పూర్తి చేయాలని సర్కార్ భావిస్తోంది.  ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారి వద్దకు వెళ్లి వివరాలను సేకరిస్తున్నారు. అయితే దరఖాస్తుదారుడి దగ్గర ఏ వివరాలు ఉండాలో ఇక్కడ చూడండి….

  • TG Indiramma Housing Survey Updates : 'ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గుర్తింపు కోసం సర్వే నడుస్తోంది. ఈనెలాఖారులోపు సర్వే పూర్తి చేయాలని సర్కార్ భావిస్తోంది.  ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారి వద్దకు వెళ్లి వివరాలను సేకరిస్తున్నారు. అయితే దరఖాస్తుదారుడి దగ్గర ఏ వివరాలు ఉండాలో ఇక్కడ చూడండి….
తెలంగాణ వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను గుర్తించటంలో భాగంగా...సర్వే నడుస్తోంది.   ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్ ద్వారా వివరాలను సేకరిస్తున్నారు. 
(1 / 8)

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ సర్వే... ఈనెలఖారు నాటికి పూర్తి చేయనున్నారు. సాంకేతిక ఇబ్బందుల నేపథ్యంలో అవసరమైతే జనవరి మొదటి వారంలోనైనా పూర్తి కావొచ్చు. సర్వే గడువుపై ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం ఉంది.
(2 / 8)

గ్రామాలు, పట్టణాల్లోని వార్డుల్లో ఈ సర్వే కొనసాగుతోంది.  ప్రజాపాలనలో స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి… వారి ఇంటి వద్దకు వెళ్తున్నారు. సర్వేకు ఒక రోజు ముందే దరఖాస్తుదారుడికి సమాచారం ఇస్తున్నారు. ప్రతి దరఖాస్తును క్లుప్తంగా పరిశీలించి… వివరాలను సేకరిస్తున్నారు.  
(3 / 8)

సర్వేలో భాగంగా దరఖాస్తుదారుడి దగ్గర కొన్ని ముఖ్యమైన వివరాలు ఉండాల్సి ఉంటుంది. ఇదే విషయంపై  రంగారెడ్డి జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న ఓ సర్వేయర్ తో హిందుస్తాన్ టైమ్స్ తెలుగు మాట్లాడింది. సర్వేయర్ చెప్పిన వివరాల ప్రకారం.... యాప్ లో ప్రధానంగా ఏడు ప్రశ్నలు ఉంటాయి. వీటికి మరికొన్ని అనుబంధ ప్రశ్నలు కూడా ఉంటాయి.
(4 / 8)

ప్రస్తుతం ఎక్కడ నివాసం ఉంటున్నారు..? ఒకవేళ కిరాయి ఇంట్లో ఉంటే ఆ ఇంటి స్వభావం ఏంటి..? వంటి ప్రశ్నలు అడుగుతారు.ఇంటి పన్ను రశీదు లేదా కరెంట్ బిల్లు చూపించవచ్చు. అంతేకాకుండా ఖాళీస్థలం ఉంటే... అందుకు సంబంధించి రిజిస్ట్రేషన్ ధ్రువపత్రాలు లేదా సాదాబైనామా పత్రం ఉన్నా సరిపోతుంది. జీవో 58 ద్వారా స్థలాన్నిరెగ్యులరైజేషన్ చేసుకుంటే వాటి వివరాలు కూడా చెప్పొచ్చు. గ్రామ పంచాయతీ ద్వారా పొందే పొజిషన్ సర్టిఫికెట్ వంటి వివరాలను తెలపవచ్చు. ఖాళీ స్థలం వద్ద లేదా కిరాయి ఉంటున్న ఇంటి వద్దనైనా సరే ఫొటో దింపుతారు.  
(5 / 8)

యాప్ లో వికలాంగులు/అనాథలు/ ఒంటరి మహిళలు/వితంతువులు/ ట్రాన్సో జెండర్లు, పారిశుద్ధ్య కార్మికులు వంటి వారి కోసం ప్రత్యేక కాలం ఉంటుంది. ఇందిరమ్మ ఇళ్లలో వీరికి  ప్రాధాన్యం ఉంటుందని సర్వేయర్ చెప్పారు.  ఇదే విషయం ప్రభుత్వం కూడా చెప్పింది.  వీరిని కూడా యాప్ ద్వారానే గుర్తిస్తున్నారు, 
(6 / 8)

మొదటి విడతలో సొంత స్థలం ఉన్న నిరు పేదలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనుంది. ప్రతి 500 దరఖాస్తులకు ఒక సర్వేయర్‌ను ఏర్పాటు చేశారు. ఒక సర్వేయర్ రోజుకు కనీసం 20 దరఖాస్తులను సర్వే చేయాలని టార్గెట్‌గా పెట్టారు. సర్కార్ లక్ష్యానికి అనుగుణంగా… అధికారులు పని చేస్తున్నారు.  
(7 / 8)

మరోవైపు యాప్ సర్వే పూర్తి అయిన వెంటనే లబ్ధిదారులను గుర్తిస్తామని రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటన చేశారు. ఇందిరమ్మ ఇళ్ల మోడల్ హౌజ్ ను ప్రతి మండలంలో కడుతున్నట్లు చెప్పారు. ఇప్పటికే కొన్నిచోట్ల వీటి నిర్మాణం కోసం భూమి పూజ చేశారు.
(8 / 8)

    ఆర్టికల్ షేర్ చేయండి