తెలుగు న్యూస్  /  ఫోటో  /  Radish: ముల్లంగి వల్ల ఆరోగ్యానికి కలిగే ఈ ప్రయోజనాల గురించి తెలుసా?

Radish: ముల్లంగి వల్ల ఆరోగ్యానికి కలిగే ఈ ప్రయోజనాల గురించి తెలుసా?

25 November 2024, 20:06 IST

ముల్లంగి పోషకాలతో నిండి ఉంటుంది. దీన్ని తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా శీతాకాలంలో ముల్లంగిని తినడం చాలా ముఖ్యం. దీని వల్ల కలిగే ముఖ్యమైన లాభాలు ఏవంటే..

ముల్లంగిని తినేందుకు ఎక్కువ మంది ఇష్టపడరు. దూరంగా ఉంచుతుంటారు. ముల్లంగి వల్ల కలిగే ప్రయోజనాలు తెలియక అలా చేస్తుంటారు. పోషకాలతో నిండిన ముల్లంగిని రెగ్యులర్‌గా తింటే ఆరోగ్యానికి చాలా లాభాలు ఉంటాయి. ఆ వివరాలు ఇక్కడ చూడండి. 
(1 / 6)

ముల్లంగిలో విటమిన్ సీ, బీ6, ఐరన్, కాల్షియం, ఫైబర్, ఫోలిక్ యాసిడ్ సహా మరిన్ని పోషకాలు మెండుగా ఉంటాయి. దీని వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. 
(2 / 6)

శరీరంలోని వ్యర్థాలు సులువుగా బయటికి వెళ్లేందుకు ముల్లంగి తోడ్పడుతుంది. శరీరాన్ని డీటాక్సిఫై చేస్తుంది. శరీరంలో ఆక్సిజన్ సరఫరాను పెంచుతుంది. చాలా అవయవాల పనితీరును మెరుగుపరుస్తుంది. 
(3 / 6)

క్యాన్సర్ రిస్క్‌ను ముల్లంగి తగ్గించగలదు. దీన్ని రెగ్యులర్‌గా తీసుకుంటే కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం బాగా తగ్గుతుంది. క్యాన్సర్ కణాల పెరుగుదలను ఇది నిరోధించగలదు. 
(4 / 6)

ముల్లంగిలో ఉండే పొటాషియం.. బ్లడ్ ప్రెజర్‌ నియంత్రణలో ఉండేందుకు సహకరిస్తుంది. ఇందులోని విటమిన్ సీ రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. అందుకే ఇన్ఫెక్షన్లు, వ్యాధుల రిస్క్ ఎక్కువగా ఉండే చలికాలంలో ముల్లంగి తరచూ తింటూ ఉండాలి. 
(5 / 6)

బరువు తగ్గాలనుకునే వారికి కూడా ముల్లంగి సహకరిస్తుంది. జీర్ణక్రియను ఇది మెరుగుపరుస్తుంది. దీంట్లో ఉండే ఫైబర్ ఇందుకు తోడ్పడుతుంది. ఎక్కువసేపు కడుపు నిండిన ఫీలింగ్ ఇస్తుంది. దీంతో ఎక్కువ ఆహారం తీసుకోకుండా చేస్తుంది. మలబద్ధకం తగ్గేలా కూడా చేయగలదు. 
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి