తెలుగు న్యూస్  /  ఫోటో  /  Telangana Toursim : కొండల నడుమ అందాల జలదృశ్యం - మధ్యలో మినీ ఐల్యాండ్, ఒక్క రోజులోనే ఈ టూరిస్ట్ ప్లేస్ చూసి రావొచ్చు!

Telangana Toursim : కొండల నడుమ అందాల జలదృశ్యం - మధ్యలో మినీ ఐల్యాండ్, ఒక్క రోజులోనే ఈ టూరిస్ట్ ప్లేస్ చూసి రావొచ్చు!

14 August 2024, 15:20 IST

Vizag Colony Tour Spot in Telangana: చుట్టూ కొండలు, ఆపై సాగర్ బ్యాక్ వాటర్.. మధ్యలో మినీ ఐల్యాండ్ తో కూడిన జలదృశ్యాలను చూడాలంటే వైజాగ్ కాలనీ వెళ్లాల్సిందే. హైదరాబాద్ నగరానికి సమీపంలోనే ఈ ప్లేస్ ఉంది. ఇక్కడి ప్రకృతి అందాలను చూడాలంటే రెండు కళ్లు చాలవేమో అన్నట్లు ఉంటుంది…!

  • Vizag Colony Tour Spot in Telangana: చుట్టూ కొండలు, ఆపై సాగర్ బ్యాక్ వాటర్.. మధ్యలో మినీ ఐల్యాండ్ తో కూడిన జలదృశ్యాలను చూడాలంటే వైజాగ్ కాలనీ వెళ్లాల్సిందే. హైదరాబాద్ నగరానికి సమీపంలోనే ఈ ప్లేస్ ఉంది. ఇక్కడి ప్రకృతి అందాలను చూడాలంటే రెండు కళ్లు చాలవేమో అన్నట్లు ఉంటుంది…!
కృష్ణమ్మ పరుగులతో నాగార్జున సాగర్ కు పర్యాటకులు పొటెత్తుతున్నారు. సాగర్ డ్యామ్ మాత్రమే కాకుండా…. అక్కడ ఉన్న నాగార్జున కొండ, బుద్ధవనం వంటి వాటిని చూస్తున్నారు.
(1 / 6)
కృష్ణమ్మ పరుగులతో నాగార్జున సాగర్ కు పర్యాటకులు పొటెత్తుతున్నారు. సాగర్ డ్యామ్ మాత్రమే కాకుండా…. అక్కడ ఉన్న నాగార్జున కొండ, బుద్ధవనం వంటి వాటిని చూస్తున్నారు.(Image Source Twitter)
ఇదే సమయంలో సాగర్ బ్యాక్ వాటర్ అందాలను చూసేందుకు కూడా ఆసక్తి చూపుతున్నారు పర్యాటకులు.  ఇందుకోసం వైజాగ్ కాలనీకి వెళ్తున్నారు. హైదరాబాద్ నగరం నుంచి అతి దగ్గర సమీపంలో ఉన్న ఈ స్పాట్….  ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని దేవరకొండకు సమీపంగా ఉంటుంది.
(2 / 6)
ఇదే సమయంలో సాగర్ బ్యాక్ వాటర్ అందాలను చూసేందుకు కూడా ఆసక్తి చూపుతున్నారు పర్యాటకులు.  ఇందుకోసం వైజాగ్ కాలనీకి వెళ్తున్నారు. హైదరాబాద్ నగరం నుంచి అతి దగ్గర సమీపంలో ఉన్న ఈ స్పాట్….  ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని దేవరకొండకు సమీపంగా ఉంటుంది.(Image Source Twitter)
నల్గొండ జిల్లా నేరేడిగొమ్ము మండలం ప్రాంతంలో ఈ ప్లేస్ ఉంటుంది. హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ వెళ్లేటప్పుడు ఈ ప్రాంతం కుడి వైపున ఉంటుంది.  గిరిజన తండాల మీదుగా సాగే ప్రయాణం అద్భుతంగా ఉంటుంది.
(3 / 6)
నల్గొండ జిల్లా నేరేడిగొమ్ము మండలం ప్రాంతంలో ఈ ప్లేస్ ఉంటుంది. హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ వెళ్లేటప్పుడు ఈ ప్రాంతం కుడి వైపున ఉంటుంది.  గిరిజన తండాల మీదుగా సాగే ప్రయాణం అద్భుతంగా ఉంటుంది.(Image Source Twitter)
నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ ఇక్కడ ఉంటుంది. చుట్టు కొండలు ఉంటాయి. కొండల మధ్య నీళ్లను చూడటమే కాదు… మధ్యలో ఓ మినీ ఐల్యాండ్ కూడా ఉంటుంది.  ఇక్కడికి వెళ్లేందుకు వీలుగా ఇక్కడ బోటింగ్ సౌకర్యం కూడా ఉంటుంది.
(4 / 6)
నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ ఇక్కడ ఉంటుంది. చుట్టు కొండలు ఉంటాయి. కొండల మధ్య నీళ్లను చూడటమే కాదు… మధ్యలో ఓ మినీ ఐల్యాండ్ కూడా ఉంటుంది.  ఇక్కడికి వెళ్లేందుకు వీలుగా ఇక్కడ బోటింగ్ సౌకర్యం కూడా ఉంటుంది.(Image Source Twitter)
వైజాగ్ కాలనీగా పిలిచే ఈ ప్రాంతానికి టూరిస్టులు పెద్ద ఎత్తున వెళ్తున్నారు. ఇక్కడ నైట్  కూడా ఉండేందుకు వీలుగా క్యాంపులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. వీలైతే ఇక్కడ స్టే చేసే అవకాశం ఉంటుంది.  ఇక్కడి రహదారులపై ఆరబోసిన చేపలు కుప్పలుకుప్పలుగా కనిపిస్తుంటాయి. మనకు కావాలంటే… వండి కూడా ఇస్తుంటారు. 
(5 / 6)
వైజాగ్ కాలనీగా పిలిచే ఈ ప్రాంతానికి టూరిస్టులు పెద్ద ఎత్తున వెళ్తున్నారు. ఇక్కడ నైట్  కూడా ఉండేందుకు వీలుగా క్యాంపులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. వీలైతే ఇక్కడ స్టే చేసే అవకాశం ఉంటుంది.  ఇక్కడి రహదారులపై ఆరబోసిన చేపలు కుప్పలుకుప్పలుగా కనిపిస్తుంటాయి. మనకు కావాలంటే… వండి కూడా ఇస్తుంటారు. 
నాగార్జున సాగర్ హైవేపై ఉండే మల్లేపల్లి నుంచి 32 కి.మీ. దూరంలో ఈ వైజాగ్ కాలనీ ఉంటుంది. ఇక్కడ నైట్ క్యాంపులను కూడా ఏర్పాట్లు చేసుకోవచ్చు.  వీకెండ్ లో ప్రకృతి ఒడిలో గడిపేందుకు ఈ ప్లేస్ ను ఎంచుకోవచ్చు. కేవలం ఒక్క రోజులోనే చూసి రావొచ్చు.
(6 / 6)
నాగార్జున సాగర్ హైవేపై ఉండే మల్లేపల్లి నుంచి 32 కి.మీ. దూరంలో ఈ వైజాగ్ కాలనీ ఉంటుంది. ఇక్కడ నైట్ క్యాంపులను కూడా ఏర్పాట్లు చేసుకోవచ్చు.  వీకెండ్ లో ప్రకృతి ఒడిలో గడిపేందుకు ఈ ప్లేస్ ను ఎంచుకోవచ్చు. కేవలం ఒక్క రోజులోనే చూసి రావొచ్చు.

    ఆర్టికల్ షేర్ చేయండి