తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Virat Kohli Century: విరాట్ వీరవిహారం.. సెంచరీతో కదంతొక్కిన కోహ్లీ.. మరో రికార్డు కూడా..

Virat Kohli Century: విరాట్ వీరవిహారం.. సెంచరీతో కదంతొక్కిన కోహ్లీ.. మరో రికార్డు కూడా..

06 April 2024, 21:45 IST

Virat Kohli Century - RCB vs RR: ఐపీఎల్‍ 2024లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) స్టార్ బ్యాటర్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ మరోసారి అద్భుత బ్యాటింగ్‍తో మెప్పించాడు. ఐపీఎల్‍లో 8వ శతకం చేశాడు. మరొక మైల్‍స్టోర్ కూడా దాటేసి రికార్డు సృష్టించాడు.

  • Virat Kohli Century - RCB vs RR: ఐపీఎల్‍ 2024లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) స్టార్ బ్యాటర్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ మరోసారి అద్భుత బ్యాటింగ్‍తో మెప్పించాడు. ఐపీఎల్‍లో 8వ శతకం చేశాడు. మరొక మైల్‍స్టోర్ కూడా దాటేసి రికార్డు సృష్టించాడు.
ఐపీఎల్ 2024 సీజన్‍లో రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) జట్టుతో నేడు (ఏప్రిల్ 6) జరిగిన మ్యాచ్‍లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్, భారత స్టార్ విరాట్ కోహ్లీ దుమ్మురేపాడు. అజేయ శతకంతో విరుచుకుపడ్డాడు. 
(1 / 5)
ఐపీఎల్ 2024 సీజన్‍లో రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) జట్టుతో నేడు (ఏప్రిల్ 6) జరిగిన మ్యాచ్‍లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్, భారత స్టార్ విరాట్ కోహ్లీ దుమ్మురేపాడు. అజేయ శతకంతో విరుచుకుపడ్డాడు. (AFP)
ఈ మ్యాచ్‍లో విరాట్ కోహ్లీ సూపర్ హిట్టింగ్‍తో 72 బంతుల్లోనే 113 పరుగులు చేశాడు. 12 ఫోర్లు, 4 సిక్సర్లతో విరాట్ వీరవిహారం చేశాడు. అజేయ శతకంతో విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్‍లో 67 బంతుల్లోనే సెంచరీ మార్కును చేరాడు విరాట్. 
(2 / 5)
ఈ మ్యాచ్‍లో విరాట్ కోహ్లీ సూపర్ హిట్టింగ్‍తో 72 బంతుల్లోనే 113 పరుగులు చేశాడు. 12 ఫోర్లు, 4 సిక్సర్లతో విరాట్ వీరవిహారం చేశాడు. అజేయ శతకంతో విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్‍లో 67 బంతుల్లోనే సెంచరీ మార్కును చేరాడు విరాట్. (AP)
ఐపీఎల్‍లో విరాట్ కోహ్లీకి ఇది 8వ శతకంగా ఉంది. ఇప్పటికే ఐపీఎల్‍లో అత్యధిక సెంచరీల రికార్డు కోహ్లీ పేరిటే ఉంది. ఈ జాబితాలో కోహ్లీ తర్వాతి స్థానంలో క్రిస్ గేల్ (6), జోస్ బట్లర్ (5), కేఎల్ రాహుల్ (4) ఉన్నారు. 
(3 / 5)
ఐపీఎల్‍లో విరాట్ కోహ్లీకి ఇది 8వ శతకంగా ఉంది. ఇప్పటికే ఐపీఎల్‍లో అత్యధిక సెంచరీల రికార్డు కోహ్లీ పేరిటే ఉంది. ఈ జాబితాలో కోహ్లీ తర్వాతి స్థానంలో క్రిస్ గేల్ (6), జోస్ బట్లర్ (5), కేఎల్ రాహుల్ (4) ఉన్నారు. (AFP)
ఐపీఎల్‍లో 7,500 పరుగుల మార్కు దాటిన తొలి ప్లేయర్‌గా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకు 242 ఐపీఎల్ మ్యాచ్‍ల్లో 7,579 రన్స్ చేశాడు. ఐపీఎల్‍లో అత్యధిక పరుగుల రికార్డు కూడా విరాట్ పేరిటే ఉంది.
(4 / 5)
ఐపీఎల్‍లో 7,500 పరుగుల మార్కు దాటిన తొలి ప్లేయర్‌గా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకు 242 ఐపీఎల్ మ్యాచ్‍ల్లో 7,579 రన్స్ చేశాడు. ఐపీఎల్‍లో అత్యధిక పరుగుల రికార్డు కూడా విరాట్ పేరిటే ఉంది.(ANI )
విరాట్ కోహ్లీ సెంచరీతో చివరి వరకు నిలిచి దుమ్మురేపగా.. ఫాఫ్ డుప్లెసిస్ (44) రాణించడంతో ఈ మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 3 వికెట్లకు 183 రన్స్ చేసింది. రాజస్థాన్ రాయల్స్ ముందు 184 పరుగుల టార్గెట్ ఉంది. 
(5 / 5)
విరాట్ కోహ్లీ సెంచరీతో చివరి వరకు నిలిచి దుమ్మురేపగా.. ఫాఫ్ డుప్లెసిస్ (44) రాణించడంతో ఈ మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 3 వికెట్లకు 183 రన్స్ చేసింది. రాజస్థాన్ రాయల్స్ ముందు 184 పరుగుల టార్గెట్ ఉంది. (AFP)

    ఆర్టికల్ షేర్ చేయండి