తెలుగు న్యూస్  /  ఫోటో  /  Vijayawada Rains : విజయవాడలో విరిగిపడిన కొండ చరియలు- ఓ బాలిక సహా నలుగురు మృతి!

Vijayawada Rains : విజయవాడలో విరిగిపడిన కొండ చరియలు- ఓ బాలిక సహా నలుగురు మృతి!

31 August 2024, 14:27 IST

Vijayawada Rains : విజయవాడలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మొగల్రాజపురం సున్నపుబట్టి సెంటర్ వద్ద కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఓ బాలిక సహా నలుగురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. లోతట్టు ప్రాంతాలు, కొండ ప్రదేశాల్లో ఉన్న వారిని అధికారులు సురక్షిత ప్రదేశాలకు తరలించారు.  

  • Vijayawada Rains : విజయవాడలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మొగల్రాజపురం సున్నపుబట్టి సెంటర్ వద్ద కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఓ బాలిక సహా నలుగురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. లోతట్టు ప్రాంతాలు, కొండ ప్రదేశాల్లో ఉన్న వారిని అధికారులు సురక్షిత ప్రదేశాలకు తరలించారు.  
ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలకు విజయవాడ మొగల్రాజపురం సున్నపుబట్టి సెంటర్ వద్ద కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. పోలీసులు సహాయచర్యలు చేపట్టారు. 
(1 / 8)

కొండ చరియలు విరిగిపడిన ఘటనలో ఓ ఇల్లు పూర్తిగా ధ్వంసం అవ్వగా మరో మూడు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో గాయపడ్డ వారిని పోలీసులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒక బాలిక మృతి చెందింది. 
(2 / 8)

కొండ చరియలు విరిగిపడిన ఘటనలో ఓ ఇల్లు పూర్తిగా ధ్వంసం అవ్వగా మరో మూడు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో గాయపడ్డ వారిని పోలీసులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఓ బాలిక సహా నలుగురు మృతి చెందారు.  
(3 / 8)

శుక్రవారం సాయంత్రం నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తోన్న భారీ వర్షాలకు విజయవాడలోని లోతట్టు ప్రాంతాలు అన్ని జలమయమయ్యాయి. రాగల 2 రోజులు భారీ వర్షాలు పడే అందని వాతావరణ శాఖ హెచ్చరికలతో లోతట్టు, కొండ ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలందరూ సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర కోరారు.
(4 / 8)

భారీ వర్షాలు కురుస్తోన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇళ్ల నుంచి బయటకు రావద్దని కమిషనర్ ధ్యాచంద్ర సూచించారు. ప్రజలు తమ ప్రయాణాలను రద్దు చేసుకోవాలని,  ఎక్కడైనా ఇళ్లు బలహీనంగా ఉన్నట్లయితే వెంటనే ఆ కుటుంబాలు సమీపంలోని పునరావాస కేంద్రానికి తరలి వెళ్లాలని తెలిపారు.  
(5 / 8)

విజయవాడ మున్సిపాలిటీలో 24x7 కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశామని కమిషనర్ తెలిపారు. వరదలకు సంబంధించి ఎటువంటి సమస్యలైనా ప్రజలు ఈ ఫోన్ నెంబర్లకు 0866-2424172, 0866-2427485 ఫోన్ చేసి తెలపాలని కోరారు. 8181960909 ఫోన్ నెంబర్ కు వాట్సాప్ ద్వారా సమస్యను తెలపవచ్చని, అధికారులు తగిన చర్యలు తీసుకుంటారని కమిషనర్ ధ్యానచంద్ర  అన్నారు. 
(6 / 8)

 విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలతో లోతట్టు ప్రాంతాల్లో, కొండలు ఉన్న ప్రదేశాలలో నివసిస్తున్న ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.  15, 16, 17, 18, డివిజన్, కొండ ప్రాంత ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు వాళ్లని వెంటనే పునరావస కేంద్రాలకు తరలించారు.    
(7 / 8)

విజయవాడలో భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయం అయ్యాయి. పండిత్ నెహ్రూ బస్టాండ్ పరిసర ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో వాహనదారులు, స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. రామవరప్పాడు రింగ్ రోడ్డు వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. నిడమానూరు వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. నగరంలోని పలు ప్రాంతాల్లో రహదారులు నీట మునిగి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 
(8 / 8)

    ఆర్టికల్ షేర్ చేయండి