తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Iphone Passcode Security: 4 అంకెల ఐఫోన్ పాస్ కోడ్ తో చాలా డేంజర్; ఐ ఫోన్ లోని మీ డేటా సేఫ్టీ కోసం ఇలా చేయండి..

iPhone passcode security: 4 అంకెల ఐఫోన్ పాస్ కోడ్ తో చాలా డేంజర్; ఐ ఫోన్ లోని మీ డేటా సేఫ్టీ కోసం ఇలా చేయండి..

22 December 2023, 17:54 IST

iPhone passcode security: ఐ ఫోన్ వాడుతున్నారా? పాస్ కోడ్ గా 4 అంకెల సంఖ్యను వాడుతున్నారా? మీ ఫోన్ లోని డేటా ఈజీగా తస్కరించేస్తారు. ఆ సమస్య నుంచి తప్పించుకోవడానికి ఈ టిప్స్ ఫాలో కండి..

iPhone passcode security: ఐ ఫోన్ వాడుతున్నారా? పాస్ కోడ్ గా 4 అంకెల సంఖ్యను వాడుతున్నారా? మీ ఫోన్ లోని డేటా ఈజీగా తస్కరించేస్తారు. ఆ సమస్య నుంచి తప్పించుకోవడానికి ఈ టిప్స్ ఫాలో కండి..
ఈ రోజుల్లో, దొంగలు ఎక్కువగా ఐఫోన్‌ లను లక్ష్యంగా చేసుకుంటున్నారు. మనం మన వ్యక్తిగత, వృత్తిగత, ఆర్థిక వివరాలన్నీ ఫోన్ లోనే సేవ్ చేసుకుని ఉంటాం. ఒకవేళ ఆ ఫోన్ పోతే, ఆ సమాచారం వారికి అందితే చాలా సమస్యలు, నష్టాలు ఎదురవుతాయి. టెక్ దొంగలకు మీ 4-అంకెల ఐఫోన్ పాస్‌కోడ్‌ను ఛేదించడం పెద్ద కష్టమేం కాదు.
(1 / 5)
ఈ రోజుల్లో, దొంగలు ఎక్కువగా ఐఫోన్‌ లను లక్ష్యంగా చేసుకుంటున్నారు. మనం మన వ్యక్తిగత, వృత్తిగత, ఆర్థిక వివరాలన్నీ ఫోన్ లోనే సేవ్ చేసుకుని ఉంటాం. ఒకవేళ ఆ ఫోన్ పోతే, ఆ సమాచారం వారికి అందితే చాలా సమస్యలు, నష్టాలు ఎదురవుతాయి. టెక్ దొంగలకు మీ 4-అంకెల ఐఫోన్ పాస్‌కోడ్‌ను ఛేదించడం పెద్ద కష్టమేం కాదు.(Pixabay)
అందువల్ల, ఐఫోన్ వినియోగదారులు 4-అంకెల పాస్‌కోడ్‌తో తమ ఐఫోన్‌లను ఎప్పుడు, ఎలా అన్‌లాక్ చేస్తున్నారనే విషయంపై అప్రమత్తంగా ఉండాలి. అదనంగా, వినియోగదారులు 4-అంకెల iPhone పాస్‌కోడ్‌ స్థానంలో మరింత సంక్లిష్టమైన iPhone లాక్‌ని ఏర్పాటు చేసుకోవాలి. మీ ఫోన్ పోయినా,  ఎవరూ ఛేదించలేనంత స్ట్రాంగ్ గా ఆ ఫోన్ లాక్ ఉండాలి. 
(2 / 5)
అందువల్ల, ఐఫోన్ వినియోగదారులు 4-అంకెల పాస్‌కోడ్‌తో తమ ఐఫోన్‌లను ఎప్పుడు, ఎలా అన్‌లాక్ చేస్తున్నారనే విషయంపై అప్రమత్తంగా ఉండాలి. అదనంగా, వినియోగదారులు 4-అంకెల iPhone పాస్‌కోడ్‌ స్థానంలో మరింత సంక్లిష్టమైన iPhone లాక్‌ని ఏర్పాటు చేసుకోవాలి. మీ ఫోన్ పోయినా,  ఎవరూ ఛేదించలేనంత స్ట్రాంగ్ గా ఆ ఫోన్ లాక్ ఉండాలి. (AP)
సంక్లిష్టమైన iPhone పాస్‌వర్డ్‌ను ఏర్పాటు చేసుకోవడానికి, ముందుగా ఫోన్ లోని సెట్టింగ్స్ లోకి వెళ్లాలి. అందులోని "ఫేస్ ID & పాస్‌వర్డ్"కి వెళ్లి, ఆపై "పాస్‌వర్డ్ మార్చు"కి వెళ్లండి. కొత్త పాస్‌వర్డ్‌ను రూపొందించే ముందు మీ పాత పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయమని అడుగుతారు. ఆపై “పాస్కోడ్ ఎంపికకు వెళ్లి, “కస్టమ్ ఆల్ఫాన్యూమరిక్ కోడ్” ఎంచుకోండి.
(3 / 5)
సంక్లిష్టమైన iPhone పాస్‌వర్డ్‌ను ఏర్పాటు చేసుకోవడానికి, ముందుగా ఫోన్ లోని సెట్టింగ్స్ లోకి వెళ్లాలి. అందులోని "ఫేస్ ID & పాస్‌వర్డ్"కి వెళ్లి, ఆపై "పాస్‌వర్డ్ మార్చు"కి వెళ్లండి. కొత్త పాస్‌వర్డ్‌ను రూపొందించే ముందు మీ పాత పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయమని అడుగుతారు. ఆపై “పాస్కోడ్ ఎంపికకు వెళ్లి, “కస్టమ్ ఆల్ఫాన్యూమరిక్ కోడ్” ఎంచుకోండి.(Unsplash)
ఈ ఆల్ఫాన్యూమరిక్ కోడ్ అక్షరాలు, సంఖ్యలు, ప్రత్యేక సంకేతాల(@, #, &, ! మొదలైనవి)ను ఉపయోగించి ఏర్పాటు చేసుకోవాలి. ఇవి కనీసం ఆరు నుండి పది వరకు ఉండాలి.
(4 / 5)
ఈ ఆల్ఫాన్యూమరిక్ కోడ్ అక్షరాలు, సంఖ్యలు, ప్రత్యేక సంకేతాల(@, #, &, ! మొదలైనవి)ను ఉపయోగించి ఏర్పాటు చేసుకోవాలి. ఇవి కనీసం ఆరు నుండి పది వరకు ఉండాలి.(Bloomberg)
పాస్ కోడ్ కు బదులుగా FaceID లేదా TouchID వంటి బయోమెట్రిక్ విధానాన్ని వాడడం మంచిది. ఒకవేళ, ఈ 4 అంకెల పాస్ కోడ్ కే మీరు అలవాటు అయితే, ఆ పాస్ కోడ్ ను ఎంటర్ చేసే సమయంలో ఎవరూ చూడకుండా జాగ్రత్త పడండి.
(5 / 5)
పాస్ కోడ్ కు బదులుగా FaceID లేదా TouchID వంటి బయోమెట్రిక్ విధానాన్ని వాడడం మంచిది. ఒకవేళ, ఈ 4 అంకెల పాస్ కోడ్ కే మీరు అలవాటు అయితే, ఆ పాస్ కోడ్ ను ఎంటర్ చేసే సమయంలో ఎవరూ చూడకుండా జాగ్రత్త పడండి.(Unsplash)

    ఆర్టికల్ షేర్ చేయండి