తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ott Releases: ఈవారం ఓటీటీలోకి రానున్న టాప్ 5 సినిమాలు.. ఎక్కడ చూడాలంటే?

OTT Releases: ఈవారం ఓటీటీలోకి రానున్న టాప్ 5 సినిమాలు.. ఎక్కడ చూడాలంటే?

24 September 2024, 15:07 IST

OTT Release This Week: ఈసారి డిఫరెంట్ జానర్ సినిమాలు ఓటీటీలోకి అడుగు పెట్టనున్నాయి. అయితే, వీటిలో అందరి దృష్టి నేచురల్ స్టార్ నాని నటించిన సరిపోదా శనివారం మూవీపై ఉంది. అలాగే ఈవారం ఓటీటీ రిలీజ్ కానున్న టాప్ 5 సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

ఈవారం 24 వరకు సినిమాలు, వెబ్ సిరీసులు ఓటీటీలోకి రానున్నాయి. వాటిలో టాప్ 5 సినిమాలు, వెబ్ సిరీసులు ఏంటో లుక్కేద్దాం. 
(1 / 6)

సరిపోదా శనివారం ఓటీటీ: నేచురల్ స్టార్ హీరో నాని నటించిన యాక్షన్ డ్రామా చిత్రం సరిపోదా శనివారం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఆగస్టు 27న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు ఈ వారం ఓటీటీలోకి రానుంది. గురువారం (సెప్టెంబర్ 26) నెట్ ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ ఫామ్‌లో సరిపోదా శనివారం సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. 
(2 / 6)

తాజా ఖబర్ సీజన్ 2 ఓటీటీ: 'తాజా ఖబర్ 2' వెబ్ సిరీస్‌లో భవిష్యత్తును అంచనా వేసే ఓ వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. ఈ సిరీస్‌లో భువన్ బామ్, శ్రియా పిల్గావ్కర్, జెడి చక్రవర్తి, దేవన్ భోజని, ప్రథమ్ పరాబ్, నిత్యా మాథుర్, శిల్పా శుక్లా ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ తాజా ఖబర్ 2 సీజన్ సెప్టెంబర్ 27 న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఓటీటీ రిలీజ్ కానుంది.   
(3 / 6)

లవ్ సితార ఓటీటీ: శోభితా ధూళిపాళ నటించిన 'లవ్ సితార' చిత్రం నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ శుక్రవారం అంటే సెప్టెంబర్ 27న జీ5 ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ రొమాంటిక్ డ్రామా చిత్రానికి వందనా కటారియా దర్శకత్వం వహించారు. రాజీవ్ సిద్ధార్థ్ ప్రధాన పాత్రలో నటించారు.
(4 / 6)

కోలీవుడ్‌లో ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వాళై చిత్రం సెప్టెంబర్ 27న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. గతంలో కరణం, మామన్నన్ చిత్రాలకు దర్శకత్వం వహించిన మారి సెల్వరాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా కథ పిల్లల మధ్య ఉంటుంది. వాళై చిత్రం ఆగస్టు 23న థియేటర్లలో విడుదలైంది. 
(5 / 6)

హారర్ థ్రిల్లర్ మూవీ 'డెమోంటి కాలనీ 2' సెప్టెంబర్ 27న జీ5 ఓటీటీలో డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రం తమిళంలో ఆగస్టు 15న విడుదలైంది. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటించింది. 
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి