తెలుగు న్యూస్  /  ఫోటో  /  Tirumala : తిరుమలలో కన్నుల పండుగగా చక్రస్నానం

Tirumala : తిరుమలలో కన్నుల పండుగగా చక్రస్నానం

23 October 2023, 17:48 IST

Tirumala : తిరుమలలో తొమ్మిది రోజుల పాటు ఎంతో వైభవంగా జరిగిన శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. చివరి రోజు శ్రీవారికి స్నపనతిరుమంజనం అనంతరం చక్రస్నానం నిర్వహించారు.

  • Tirumala : తిరుమలలో తొమ్మిది రోజుల పాటు ఎంతో వైభవంగా జరిగిన శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. చివరి రోజు శ్రీవారికి స్నపనతిరుమంజనం అనంతరం చక్రస్నానం నిర్వహించారు.
తిరుమల శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన సోమ‌వారం ఉదయం చక్రస్నానం శాస్త్రోక్తంగా జరిగింది. 
(1 / 7)

పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసి శ్రీవారి పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. 
(2 / 7)

తొమ్మిది రోజుల పాటు జ‌రిగిన న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాలు సోమవారంతో ముగిశాయి. 
(3 / 7)

సోమవారం తెల్లవారుజామున 4 నుంచి 6 గంటల వరకు స్వామివారికి పల్లకీ ఉత్సవం వైభవంగా జరిగింది. 
(4 / 7)

ఉదయం 6 నుంచి 9 గంటల నడుమ శ్రీ భూవరాహస్వామి ఆలయం ముఖ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపనతిరుమంజనం వైభవంగా నిర్వహించారు. 
(5 / 7)

స్నపనతిరుమంజనంలో ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం, ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, రాజోపచారం నిర్వహించారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా పాలు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు.  
(6 / 7)

తొమ్మిదిరోజుల ఉత్సవాలలో జరిగిన అన్ని సేవలు సఫలమై లోకం క్షేమంగా ఉండడానికి, భక్తులు సుఖశాంతుల్తో ఉండడానికి చక్రస్నానం నిర్వహించారు.   
(7 / 7)

    ఆర్టికల్ షేర్ చేయండి