తెలుగు న్యూస్  /  ఫోటో  /  Tirumala Brahmotsavam : ముత్యపుపందిరి వాహనంపై మలయప్పస్వామి, బకాసుర వధ అలంకారంలో భక్తులకు దర్శనం

Tirumala Brahmotsavam : ముత్యపుపందిరి వాహనంపై మలయప్పస్వామి, బకాసుర వధ అలంకారంలో భక్తులకు దర్శనం

06 October 2024, 22:09 IST

Tirumala Brahmotsavam : తిరుమల శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు ఆదివారం రాత్రి శ్రీ మలయప్పస్వామి శ్రీదేవి, భూదేవితో కలిసి బకాసుర వధ అలంకారంలో దర్శనమిచ్చారు. మాడ వీధుల్లో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగిన వాహ‌న‌సేవ‌లో వివిధ క‌ళాబృందాల ప్రద‌ర్శన‌లు భ‌క్తుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి.

  • Tirumala Brahmotsavam : తిరుమల శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు ఆదివారం రాత్రి శ్రీ మలయప్పస్వామి శ్రీదేవి, భూదేవితో కలిసి బకాసుర వధ అలంకారంలో దర్శనమిచ్చారు. మాడ వీధుల్లో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగిన వాహ‌న‌సేవ‌లో వివిధ క‌ళాబృందాల ప్రద‌ర్శన‌లు భ‌క్తుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి.
తిరుమల శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు ఆదివారం రాత్రి శ్రీ మలయప్పస్వామి శ్రీదేవి, భూదేవితో కలిసి బకాసుర వధ అలంకారంలో దర్శనమిచ్చారు. 
(1 / 8)

మాడ వీధుల్లో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగిన వాహ‌న‌సేవ‌లో వివిధ క‌ళాబృందాల ప్రద‌ర్శన‌లు భ‌క్తుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. పెద్ద సంఖ్యలో భ‌క్తులు స్వామివారిని వాహ‌న‌సేవ‌లో ద‌ర్శించుకున్నారు.
(2 / 8)

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు రాత్రి మలయప్పస్వామి ముత్యపుపందిరి వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. జ్యోతిషశాస్త్రం చంద్రునికి ప్రతీకగా ముత్యాలను తెలియజేస్తుంది. శ్రీకృష్ణుడు ముక్కుపై, మెడలో ముత్యాల ఆభరణాలు ధరించినట్టు పురాణాల్లో ఉంది. 
(3 / 8)

ముత్యపు పందిరి వాహనసేవలో వివిధ రాష్ట్రాల‌ నుంచి విచ్చేసిన కళాబృందాలు అద్భుత‌ ప్రదర్శనలిచ్చారు. టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో 20 కళాబృందాలు, 541 మంది కళాకారులు పాల్గొని తమ సంగీత నృత్య ప్రదర్శనలతో భక్తులను పరవసింప చేశారు.
(4 / 8)

ఆంధ్రప్రదేశ్ తో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గ‌ఢ్, తమిళనాడు, పంజాబ్, కర్నాటక రాష్టాలకు చెందిన కళా బృందాలు ప్రదర్శించిన తీరు భక్తులకు నయనానందం కలిగించాయి. 
(5 / 8)

మణిపూర్, రాజస్థాన్, పంజాబ్, మధ్యప్రదేశ్, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలకు చెందిన జానపద సంప్రదాయ నృత్యాలు అలరించాయి. తిరుపతికి చెందిన డా. మురళీ కృష్ణ బృందం ప్రదర్శించిన శ్రీకృష్ణావతారం రూపకం, బెంగళూరుకు చెందిన దివ్యశ్రీ బృందం ప్రదర్శించిన దశావతార మహోత్సవం, విశాఖపట్నంకు చెందిన మర్రి లలితా బృందం ప్రదర్శించిన శ్రీ నరసింహోద్భవ ఘట్టం, మధ్యప్రదేశ్ రాష్టానికి చెందిన హర్సింగ్ వర్మ ప్రదర్శించిన గిరిజన జానపద నృత్యాలు ఎంతగానో అలరించాయి.
(6 / 8)

తిరుపతి శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల విద్యార్థుల భరతనాట్యం, కూచిపూడి నృత్య ప్రదర్శన అబ్బురపరిచింది. శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి, మచిలీపట్నం, అన్నమ‌య్య, తిరుపతి జిల్లాలకు చెందిన కోలాటాలు భ‌క్తుల‌ను ఆక‌ట్టుకున్నాయి.
(7 / 8)

తిరుమ‌ల శ్రీ‌వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 8వ‌ తేదీ సాయంత్రం మలయప్ప స్వామి గరుడ వాహనంపై సాయంత్రం 6:30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు విహరిస్తారని టీటీడీ ఈవో జె శ్యామలరావు తెలిపారు. గరుడ సేవ కోసం దాదాపు 2 లక్షల మంది భక్తులు గ్యాలరీల్లో వేచి ఉంటారని, గరుడ సేవ దర్శనం కోసం ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, ఔటర్‌ రింగ్‌ రోడ్లలో వేచి ఉండే భక్తులను సుపథం, సౌత్‌ వెస్ట్‌ కార్నర్‌, గోవిందనిలయం నార్త్‌ వెస్ట్‌ గేట్‌, నార్త్‌ ఈస్ట్‌ గేట్ల ద్వారా ద‌ర్శనం క‌ల్పిస్తామన్నారు.  వారి సౌకర్యార్థం అన్ని పాయింట్ల వద్ద అవసరమైన సైన్ బోర్డులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
(8 / 8)

    ఆర్టికల్ షేర్ చేయండి