తెలుగు న్యూస్  /  ఫోటో  /  తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు- శోభాయమానంగా స్నప‌న తిరుమంజ‌నం

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు- శోభాయమానంగా స్నప‌న తిరుమంజ‌నం

24 September 2023, 20:52 IST

తిరుమల శ్రీవారికి ఆదివారం స్నపన తిరుమంజనం నిర్వహించారు. రంగురంగుల గాజులు, ఆప్రికాట్ ఫలాలు, వట్టివేరు, కురువేరు, రోజామాలలతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ‌మ‌ల‌య‌ప్ప స్వామి వారికి స్నప‌న తిరుమంజ‌నం వేడుకగా జరిగింది.

  • తిరుమల శ్రీవారికి ఆదివారం స్నపన తిరుమంజనం నిర్వహించారు. రంగురంగుల గాజులు, ఆప్రికాట్ ఫలాలు, వట్టివేరు, కురువేరు, రోజామాలలతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ‌మ‌ల‌య‌ప్ప స్వామి వారికి స్నప‌న తిరుమంజ‌నం వేడుకగా జరిగింది.
 తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.  
(1 / 7)
 తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.  
రంగురంగుల గాజులు, ఆప్రికాట్ ఫలాలు, వట్టివేరు, కురువేరు, రోజామాలలతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ‌మ‌ల‌య‌ప్ప స్వామి వారికి స్నప‌న తిరుమంజ‌నం వేడుకగా జరిగింది. 
(2 / 7)

శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు అర్చక స్వాములు వేద మంత్రోచ్ఛారణ మధ్య స్నప‌న తిరుమంజ‌నం శాస్త్రోక్తంగా నిర్వహించారు.
(3 / 7)

శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్పస్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేక వేదికపై ఉండి వివిధ ర‌కాల సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం, ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, రాజోపచారం నిర్వహించారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా పాలు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు. వీటిని శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంభధారణలతో వైఖానస ఆగమోక్తంగా స్నపనం చేపట్టారు.
(4 / 7)

ఉపనిషత్తు మంత్రాలు, దశశాంతి మంత్రాలు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, విష్ణుసూక్తం వంటి పంచసూక్త మంత్రాలు, దివ్యప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానం చేసే వేదాలను టీటీడీ వేదపారాయణదారులు పారాయణం చేశారు.  
(5 / 7)

అభిషేకానంతరం వివిధ పాశురాలను తిరుమల పెద్ద జీయ్యంగార్‌, చిన్న జీయ్యంగార్లు పఠించారు. ఈ వేడుకలో రంగురాళ్లతో కూడిన గాజుల మాలలు, ఆప్రికాట్ మాలలు, వట్టివేరుమాలలు, కురువేరుమాలలు, రంగురంగుల రోజామాలలు, పసుపు రోజామాలలు, మిక్స్డ్ డ్రైఫ్రూట్స్ మాలలు, తెలుపు ముత్యాల మాలలు, కిరీటాలు, తులసి మాలలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు.
(6 / 7)

 టీటీడీ గార్డెన్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ప్రత్యేక అలంకరణలు చేశారు.  తమిళనాడులోని తిరుపూర్ కు చెందిన రాజేందర్ ఈ మాలలను విరాళంగా అందించారు. అదేవిధంగా, హైదరాబాద్ కు చెందిన  శ్రీహరి, శ్రీధర్, శ్రీనివాస్ విరాళంతో రంగనాయకుల మండపంలో సంప్రదాయ పుష్పాలు, కట్ ఫ్లవర్లతో విశేషంగా అలంకరించారు.
(7 / 7)

    ఆర్టికల్ షేర్ చేయండి